
బిగ్‌బాస్ షోను యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఎంతో రసవత్తరంగా నడిపించారు. ఈ షో విజయవంతం కావడంతో బిగ్‌బాస్ రెండో సీజన్‌పై అందరి దృష్టి పడింది. అయితే ఈ సారి ఎన్టీఆర్‌కు బదులుగా నాని హోస్ట్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఏదైనా జరగవచ్చు, ఇంకొంచెం మసాలా అంటూ ఈ సీజన్‌పై అంచనాలు పెంచేస్తున్నారు.
జూన్ 10 నుంచి మొదలు కాబోతున్నందున్న.. షో నిర్వాహకులు సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నానికి ... ఓ మీడియా ప్రతినిధి సల్మాన్ ఖాన్, ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో మీరు ఎవరిని ఫాలో అవుతారని ప్రశ్నించగా... నేను ఎవర్నీ ఫాలో అవ్వను, నాలాగే ఉండటానికి ప్రయత్నిస్తాను. ప్రేక్షకులకు అది నచ్చుతుందని ఆశిస్తున్నానని బదులిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘అల్లు అరవింద్ మొదటగా ఫోన్ చేసి ఈ బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా చేయాలని అడిగారు. అయితే నేను చేయగలనా అన్న డౌట్ నాకు ఉండేది. ఆయన మాత్రం ఎంతో కాన్ఫిడెంట్‌గా నేను చేయగలని చెప్పారు’ అని నాని వివరించారు. తాను ఇంతవరకు బిగ్‌బాస్ షోను చూడలేదని, అయితే అందరూ ఈ షో గురించి ఇంతలా మాట్లాడుకుంటుంటే చూడాలనిపించేదని, అందుకే ఈ మధ్యే చూడటం ప్రారంభించానంటూ చెప్పారు. 16 మంది సెలబ్రిటీలతో వందరోజులపాటు హైదరాబాద్ (అన్నపూర్ణ స్టూడియో)లో వేసిన బిగ్‌బాస్ సెట్‌లో షూటింగ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment