
బిగ్‌బాస్ షో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లతో ట్రెండ్ అవుతోంది. కంటెస్టెంట్ల అభిమానులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగేలా షో వార్తల్లో నిలుస్తోంది. ఇక శనివారం నాటి కార్యక్రమం నాని క్లాసులు పీకడం మామూలుగానే ఉన్నా... కంటెస్టెంట్లతో ఆడించిన ర్యాపిడ్ ఫైర్ ఆకట్టుకుంది. ఆదివారం షోకు హీరో విజయ్ దేవరకొండ, డైరక్టర్ పరుశురామ్‌లు గెస్ట్‌లుగా వచ్చారు. నానితో పాటు విజయ్ దేవరకొండ కూడా దీప్తి సునయనతో ఓ ఆట ఆడుకున్నారు. వారిద్దరీ ఆదేశాల మేరకు సునయన చేసిన సీక్రెట్ టాస్క్ హౌజ్‌లో నవ్వుల వర్షం కురిపించింది. తను చేస్తుంది సీక్రెట్ టాస్క్ అని హౌజ్‌మెట్స్ గుర్తించగలిగారు.
తనీశ్ మాత్రం సునయన కోసం స్విమ్మింగ్ ఫూల్‌లో దూకాడు. తన అక్క ఎంగేజ్‌మెంట్ పేరుతో టాస్క్‌లో భాగంగా అమిత్‌పై నీళ్లు పోయడం, కౌశల్‌ను బయటకు రా చూసుకుందాం అని అనడం, వాళ్ల అక్క ఎంగేజ్‌మెంట్ సందర్భంగా హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడటం ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్, పరుశురామ్‌లు హౌజ్‌మెట్స్‌తో సంభాషించారు. కంటెస్టెంట్ల కోరిక మేరకు నాని హౌజ్‌లో గీత గోవిందం సాంగ్ ప్లే చేశారు. ఈ సాంగ్‌కు గణేశ్ అభినయం ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్, పరుశురామ్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎలిమినేషన్ రౌండ్‌లో భాగంగా అందరూ ఊహించినట్టే దీప్తి సునయన ఎలిమినేట్ అవుతున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.
అంతకుముందు ఏం జరిగింది...
సోమవారం నుంచి శుక్రవారం వరకు కంటెస్టెంట్లు చేసే హంగామాతో నడిచే షో.. వారాంతంలో నాని చేసే సందడితో బాగానే ఆకట్టుకుంటోంది. ఒక్కో కంటెస్టెంట్ ఈ వారం చేసిన పర్ఫామెన్స్‌పై సమీక్ష జరిపి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చేశాడు. మొదటగా తనీష్ గురించి మాట్లాడిన నాని.. తన కెప్టెన్సీపై సంతృప్తి చెందలేదంటూ.. కెప్టెన్ అయి ఉండి స్టోర్ రూమ్‌లో నిద్రపోవడం ఏంటంటూ తనీష్‌ను మందలించాడు. సోమవారం ఎలిమినేషన్‌లో తనీష్ పోషించిన పాత్ర బాగుందని.. ఆ ఒక్క చోట మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడని చెప్పుకొచ్చాడు. దీప్తి సునయన, శ్యామల ఎలిమినేషన్‌లో తన నిర్ణయం ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నించాడు. అంటే బిగ్‌బాస్ ఇచ్చిన బాధ్యతను కూడా వదిలేస్తావా? అంటూ తనీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్‌లో సామ్రాట్‌ను సేవ్ చేసి దీప్తి సునయను ఎలిమినేట్ చేస్తానని తనీష్ బదులిచ్చాడు.
కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన రోల్ రైడాను అభినందించిన నాని.. తన ఆటను మెచ్చుకున్నాడు. గల్లి సెంటిమెంట్, రాజకీయ నాయకుడంటూ నూతన్ నాయుడిని బోల్తా కొట్టించావంటూ.. నాని పొగిడాడు. గణేష్‌ను ఎలిమినేట్ చేసి దీప్తి సునయను సేవ్ చేయాలని ర్యాపిడ్ ఫైర్‌కు ఆన్సర్ చేశాడు. ఇక రెండు వారాలు ఎలిమినేషన్ గ్యాప్ వచ్చిందని గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని అమిత్‌ను హెచ్చరించాడు. ఇప్పటికిప్పుడు హౌస్‌లోంచి ఎవరిని బయటకు పంపాలనుకుంటున్నావు? అని ప్రశ్నించగా.. కౌశల్ అని సమాధానం చెప్పాడు.
కౌశల్‌ను మందలించిన నాని...
హౌస్‌లో ఒంటరిగా ఉంటున్నానని, కార్నర్ చేస్తున్నారని ఇంకా అంటున్నావంటే ఎవరిది తప్పంటూ కౌశల్‌ను మందలించాడు. మనం ఎలా ఉంటే ఇతరులు మనతో అలా ఉంటారు అంటూ కౌశల్‌కు సూచించాడు. స్నేహంగా ఉండాలని మాటల్లో చెబుతున్నావు.. కానీ చేతలు మాత్రం అలా కనిపించడం లేదంటూ ఫైర్ అయ్యాడు. హౌస్‌లో ఏదో ఒక సందర్భంలో ఎవరోకరి గురించి ఓపెన్‌గా మాట్లాడుతుంటానని, దాంతో వారంతా తనకు వ్యతిరేకంగా మారుతున్నారని కౌశల్ తనను తాను సమర్దించుకున్నాడు. టాస్కులో గణేష్ తన సహనాన్ని పరీక్షించాడని, అతను బాగా ఆడాడని కౌశల్ చెప్పుకొచ్చాడు. గణేష్‌ను ఎలిమినేట్ చేసి దీప్తి సునయనను సేవ్ చేయాలని ర్యాపిడ్‌ఫైర్‌కు జవాబిచ్చాడు.
ఈ వారం విజృంభించాడని, ఎలిమినేషన్‌లో లేకపోవడం ఇది రెండో సారి అంటూ.. గణేష్‌ను ఆటపట్టించాడు. కౌశలే తనను మెచ్చుకున్నాడని.. సీరియస్‌గా చెప్పాల్సిన మాటలను సిల్లీగా చెప్పాడని.. ఐ వాంట్ మర్యాద అంటూ నాని వెక్కిరిస్తూ.. నవ్వులు పూయించాడు. సామ్రాట్‌ను సేవ్ చేసి, గీతను ఎలిమినేట్ చేయాలని ర్యాపిడ్‌ఫైర్‌కు గణేష్ బదులిచ్చాడు.
దీప్తి సునయన టాస్కులో సరిగా ఆడలేదని, కనీసం టాస్క్ రూల్స్ కూడా పాటించలేదని ఫైర్ అయ్యాడు. ఓ వైపు టాస్క్ నడుస్తుంటే నిద్ర పోతుందంటూ మందలించాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న రోల్ రైడా, పూజ, దీప్తి సునయన, శ్యామల, గీత, నూతన్ నాయుడులో.. గాయం అయినందున నూతన్ ఎలిమినేషన్ ప్రక్రియను పక్కన పెట్టేశారు. శ్యామల, గీతా మాధురిలు ప్రొటెక్షన్ జోన్‌లో ఉన్నట్టు నాని ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment