బిగ్‌బాస్‌ : వెక్కి వెక్కి ఏడ్చిన గణేశ్‌ | Common Man Ganesh Cries In Bigg Boss 2 | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : వెక్కి వెక్కి ఏడ్చిన గణేశ్‌

Published Tue, Jul 17 2018 8:55 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Common Man Ganesh Cries In Bigg Boss 2 - Sakshi

వెక్కి వెక్కి ఏడుస్తున్న గణేశ్‌

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-2 ఏమైనా జరుగొచ్చు అన్న ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టే సోమవారం ఎపిసోడ్‌ కొంత ఆసక్తికరంగా.. మరికొంత నిరుత్సాహంగా సాగింది. కామన్‌మ్యాన్‌ గణేశ్‌ కంటతడి పెట్టాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ చిన్నపిల్లాడిలా బాధపడ్డాడు. ‘నేను వెళ్తా.. ఇలా అయితే ఈ హౌజ్‌ నాకు అవసరం లేదు.. నన్ను ఎలిమినేట్‌ చేసేయండి.. కొట్టించుకోవడానికి రాలేదు’ అంటూ బోరుమన్నాడు. 

ఇంతకీ జరిగిందేమిటంటే.. 
వారం ప్రారంభ ఎపిసోడ్‌ కావడంతో బిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియను చేపట్టాడు. తొలుత కంటెస్టెంట్స్‌ను హౌస్‌లో ఎవరితో మాట్లాడటం ఇష్టం లేదో ఆ ఒకరి పేరును ఏకాభిప్రాయంగా సూచించాలని ఆదేశించాడు. దీనికి హౌస్‌ మేట్స్‌ వారిలో వారు చర్చించుకోని ఓటింగ్‌ నిర్వహించి అమిత్‌ పేరును సూచించారు. అయితే ఇక్కడ అమిత్‌ పేరును తొలుత గణేశే ప్రస్తవించాడు. దీంతో బిగ్‌బాస్‌, అమిత్‌ ఇప్పటి నుంచి హౌస్‌లో అదృశ్యవాసి అని అతనితో ఎవరు మాట్లాడవద్దని ఆదేశించాడు. అమిత్‌ ఎలిమినేషన్‌కు డైరెక్ట్‌గా నామినేట్‌ అయినట్లు కూడా తెలిపాడు. ఇక్కడ అతనికి బిగ్‌బాస్‌ ఓ ఆఫర్‌ ఇచ్చాడు. సీక్రెట్‌ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే ఎలిమినేషన్‌ నుంచి తప్పిస్తానన్నాడు.

బేడీలు..నామినేషన్లు..
కంటెస్టెంట్స్‌లను వారికి ఇష్టమైనవారితో జోడీలుగా విడిపోమ్మని బిగ్‌బాస్‌ సూచించాడు. దీనికి హౌస్‌ మేట్స్‌ గణేశ్‌-దీప్తి, తనీష్‌-దీప్తి సునయన, నందిని రాయ్‌-తేజస్వీ, కౌశల్‌-సామ్రాట్‌, బాబు గోగినేని-రోల్‌ రైడాలుగా విడిపోయారు. బజర్‌లు మోగగానే జంటగా ఉన్న ఇద్దరు చర్చించుకోని ఒకరు విడుదలవ్వాలని, ఇలా విడుదల అయిన వారు సేఫ్‌ అయినట్లు మిగిలినవారు డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌ ప్రక్రియకు నామినేట్‌ అయినట్లు అని పేర్కొన్నాడు. అయితే విడుదల చేసే ముందు కారణం తెలపాలని కూడా చెప్పాడు.

అమిత్‌కు ఇచ్చిన ఆ టాస్క్‌ ఏమిటంటే..
1. ఏదైన వంటను చెడగొట్టాలి. 2. ఓ కంటెస్టెంట్‌ నెత్తిపై గుడ్డు కొట్టాలి 3. దీప్తి సునయనను ఏడిపించాలి. 4. ఓ కంటెస్టెంట్‌ ప్యాంట్‌, షర్ట్‌, షూస్‌ స్విమ్మింగ్‌పూల్‌లో వేయాలి. 5. ఓ హౌస్‌మేట్‌ను డైనింగ్‌ టేబుల్‌పై డ్యాన్స్‌ చేసేలా చేయాలి. ఇవన్నీ ఎవరికి తెలియకుండా.. కంటపడకుండా బజర్స్‌ మోగడం పూర్తి అయ్యేలోపు చేయాలి. అయితే ఇందులో​ అమిత్‌ నాలుగు పనులను విజయవంతంగా పూర్తి చేశాడు. గీతా మాధురి ఏదో జ్యూస్‌ చేస్తుండగా ఎవరికీ తెలియకుండా దానిలో ఉప్పు వేసి చెడగొట్టాడు. ఈ జ్యూస్‌లో ఉప్పు ఎక్కువైందనీ బాబు గోగినేని తెలిపినా తనే కావాలని వేసినా అని గీతా చెప్పడం ఇక్కడ విశేషం. తనీష్‌, టీషర్టు, ప్యాంట్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో వేయడం, దీప్తి సునయను ఏడిపించే ప్రయత్నం, గణేశ్‌పై గుడ్డు కొట్టడం వంటి పనులను అమిత్‌ పూర్తి చేశాడు.

ఓవైపు నామినేట్‌ ఎవరు కావాలని జుట్టు పీక్కుంటున్న గణేశ్‌-దీప్తిల వద్దకు వచ్చిన అమిత్‌.. ఆకస్మాత్తుగా గుడ్డుతో గణేశ్‌పై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ‘నా పేరే తొలుత నీవే చెప్పావు. నా కోపం చూడవద్దన్నా కానీ చూశావు’ అంటూ నటిస్తూ బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనతో హౌస్‌ మేట్స్‌కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గణేశ్‌ అయితే బిత్తర పోయాడు. అప్పటికి దీప్తి ఏదైనా సిక్రెట్‌ టాస్క్‌ అయి ఉండవచ్చని కూడా గణేశ్‌కు సర్ధి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ గణేశ్‌ మాత్రం బాత్రూంలోకి వెళ్లి మరీ గట్టిగా చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.

అందరితో బాగుండే అమిత్‌ ఇలా చేయడం ఏమిటీ.. టాస్క్‌ అయితే మాత్రం ఇలా ఓ వ్యక్తిపై దాడి చేయడం అవసరమా అని హౌస్‌ మేట్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గణేశ్‌  చిన్నపిల్లాడిలా మరింత ఏడ్వసాగాడు. మరో వైపు కెమెరాల ముందుకొచ్చి అమిత్‌ కంటతడి పెట్టుకున్నాడు. వీళ్లంతా నన్ను అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు టాస్క్‌ ఓడిపోయినా పర్వాలేదని, గణేశ్‌ దగ్గరకు వెళ్లి హౌస్‌మేట్స్‌ అందరికి ఉన్న విషయం చెప్పాడు.

నామినేట్‌ అయింది..
ఈ వారం ఎలిమినేషన్‌కు సామ్రాట్‌, తేజస్వీ, రోల్‌రైడా, దీప్తి, తనీష్‌లు నామినేట్‌ అయ్యారు. సామ్రాట్‌, కౌశల్‌ను సేవ్‌ చేయగా.. తేజస్వీ,..నందును, రోల్‌రైడా.. బాబుగోగినేనిని, తనీష్‌.. దీప్తి సునయనలను కాపాడారు. ఇక సీక్రెట్‌ టాస్క్‌లో ఎక్కువ పనులు అమిత్‌ పూర్తి చేయడంతో నామినేషన్‌ తప్పించుకున్నాడని బిగ్‌బాస్‌ అనౌన్స్‌ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పనులు పూర్తి చేసినా అతను టాస్క్‌ గురించి చెప్పేశాడని, అయినా బిగ్‌బాస్‌ విజయవంతమయ్యాడని ప్రకటించడం ఏమిటని, ఈ విషయంలో బిగ్‌బాస్‌ ఘోరంగా విఫలమయ్యాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక కామన్‌ మ్యాన్‌ అన్న విషయంతో గణేశ్‌కు మద్దతినిస్తుంటే అతనేమో చిన్న పిల్లాడిలా ఏడ్వడం ఏమిటని, ఇవన్నీ బిగ్‌బాస్‌లో ఉంటాయనే విషయం తెలియదా అని మండిపడుతున్నారు. ఇంకొందరమే గుడ్లతో దాడిచేయడం ఏమిటని పాపం గణేశ్‌ అంటూ.. అతనికి మద్దతు తెలుపుతున్నారు. ఇలా అమిత్‌ సీక్రెట్‌ టాస్క్‌.. నామినేషన్‌ ప్రక్రియ కొంత ఆసక్తికరంగా ఉండగా.. గణేశ్‌ సిల్లీగా ఎడ్వడం, బిగ్‌బాస్‌ టాస్క్‌ ప్లాన్‌ గాడితప్పడం నిరుత్సాహ పరిచింది.

చదవండి: టార్గెట్‌ దీప్తీ.. గణేశ్‌ అత్యుత్సాహం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement