
సాక్షి, హైదరాబాద్: బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటోంది. అయితే బిగ్ బాస్ వన్‌కు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మొదలైన రెండవ సీజన్‌లో నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ స్థాయిలో నాని చేయడం లేదనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ నాని మొదట చెప్పిన విధంగానే ఇంకొంచెం మసాల వేసి వారం వారం తన పిట్ట కథలతో ప్రేక్షకులకు కావాల్సిన మజానిస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్‌కు ఓ కార్యక్రమంలో బిగ్ బాస్2 కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి ఎన్టీఆర్ బదులిస్తూ.. ‘నాని చాలా మంచి నటుడు. దాని గురించి మీరు నన్ను అడగటం తప్పు. వారం వారం అతను చెప్పే పిట్ట కథలు చాలా బాగున్నాయి. బిగ్‌బాస్ అనేది మంచి ఫ్లాట్‌ఫామ్, సక్స్‌స్‌ఫుల్ వేదిక. అక్కడ ఎవరు వ్యాఖ్యతగా వ్యవహరించిన బాగానే ఉంటుందని’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment