బిగ్ బాస్ రెండో సీజన్‌ను యంగ్ హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నానికి సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. తొలి సీజన్‌ను ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో హోస్ట్ చేయటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నాని ఆ రేంజ్ కంటిన్యూ చేయగలడా.. లేదా..? అన్నది చూడాలి. రెండో సీజన్‌కు మరింత మసాలా యాడ్ చేస్తున్నట్టుగా నాని ఇప్పటికే హింట్ ఇచ్చాడు.
తాజాగా షో కాన్పెప్ట్‌ను వివరిస్తూ ఓ ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. అక్వేరియంలో వివిధ రకాల చేపలను చూపిస్తూ రూపొందించిన ఈ టీజర్‌కు నాని వాయిస్ అంధించారు. బిగ్ బాస్ 2లో 16 మంది కంటెస్టెంట్‌లు పాల్గొంటుండగా ఈ సీజన్ 100 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 10 బిగ్ బాస్ 2 ప్రారంభం కానుంది.
#BiggBossTelugu2 👁https://t.co/V3x4lkpMbT
— Nani (@NameisNani) 2 June 2018
Comments
Please login to add a commentAdd a comment