పూజా రాంచంద్రన్, నాని
సాక్షి, హైదరాబాద్: ఈ వారం కాస్త బోర్ కొట్టిన బిగ్‌బాస్.. వారంతంలో ప్రేక్షకులకు కావాల్సిన మజా ఇచ్చింది. తనీష్-కౌశల్ మధ్య జరిగిన గొడవ, శనివారం నాటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌లకు హోస్ట్ నాని పీకిన క్లాసులు, ఆదివారం రాఖీ పండుగ స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా నాని హౌజ్‌లోకి వెళ్లడం ఇంట్రెస్టింగ్ అనిపించాయి. హౌజ్‌లోకి వెళ్లిన నాని వారితో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు. కంటెస్టెంట్‌లకు స్పెషల్ ఐటమ్స్ దగ్గర ఉండి మరి వడ్డించి.. వారితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత హౌజ్‌లో ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాల్ని వారితో పంచుకున్నారు. ఎపిసోడ్ చివర్లో పూజా ఎలిమినేట్ అయిన విషయాన్ని నాని హౌజ్‌లోనే ప్రకటించారు. ఎలిమినేట్ అయిన పూజా బిగ్‌బాంబ్ గీతపై వేసింది. దీని ప్రకారం గీత ఈ శనివారం వరకు జైల్లోనే పడుకోవాల్సి ఉంటుంది.
కాగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న కౌశల్, పూజా రాంచంద్రన్, తనీష్, దీప్తిల్లో ఎవరు ప్రొటెక్ట్‌జోన్‌లోకి వెళతారనే అంశంపై నాని శనివారం నాటి ఎపిసోడ్‌లో కాసింత ఆసక్తి క్రియేట్ చేశారు. కానీ ప్రతి ఎలిమినేషన్ సోషల్ మీడియా వేదికగా తెలుస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా పూజా ఎలిమినేట్ అయిన విషయం ముందుగానే తెలిసిపోయింది. అంతా అనుకున్నట్లే ఈ వారం హౌస్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజా రాంచంద్రన్ ఎలిమినేట్ అయ్యారు. లీకుల విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంత కట్టడి చేసినా లాభంలేకపోయింది. దీంతో వారు కూడా చేసేదేమి లేక సైలెంట్ అయిపోయారు.
ఎలిమినేట్ అయిన పూజా
గతవారమే దీప్తి సునయనతో గట్టెక్కిన పుజాకు ఈ సారి నిష్క్రమణ తప్పలేదు. ఆమె నామినేట్ కాగానే ఈ సారి ఎలిమినేషన్ అయ్యేది పూజానే అని ప్రేక్షకులు అంచనా వేశారు. అయితే ఆమె ఎలిమినేషన్‌కు కారణం మాత్రం తెలుగు రాకపోవడం.. ఇక్కడి అమ్మాయి కాకపోవడం, తొలి వారంలో ఉన్నంత ఉత్సాహం కొనసాగించకపోవడమని అర్థం అవుతోంది. అంతేకాకుండా టాస్క్‌ల్లో ఆమె సహనం కోల్పోతూ అరవడం.. సంచాలకురాలిగా తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించకపోవడం ప్రేక్షకులకు చికాకు పుట్టించాయి. దాదాపు బిగ్‌బాస్‌ను తమ ఆదీనంలోకి తీసుకున్న కౌశల్ ఆర్మీ.. దీప్తి సునయనను టార్గెట్ చేయడంతో పూజా తక్కువ ఓటింగ్‌తో గతవారం గట్టెక్కింది. (చదవండి: అనుకోని సంఘటన.. దీప్తికి షాక్!)
#Biggbosstelugu2 #KaushalArmy #PoojaRamachandran back to 🏠
— Pathan Usif (@Pathan4141) August 26, 2018
Source found it in twitter
Randomly while searching
Malli adakakandi source ani
😂😂😂
Once again pics leaked
If not great photoshop by someone🙏🙏 pic.twitter.com/0Nl0eeTBkP
ఈ రియాల్టీ షో పూర్తికావడానికి ఇంకా కొంత సమయమే ఉండటంతో ఈ వారం డబుల్ ధమాకా ఎలిమినేషన్ ఉంటుందని భావించారు. పూజాతో దీప్తి సైతం ఎలిమినేట్ అవుతుందని, అందుకే ఆమె కెప్టెన్సీ తొలిగించారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం జరగలేదు. కేవం ఒక పూజా మాత్రమే ఎలిమినేట్ అయింది. (చదవండి: మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్లు)
Comments
Please login to add a commentAdd a comment