బిగ్‌బాస్‌-2.. అదే అసలు సమస్య! | Leakage Issues to Bigg Boss 2 Telugu | Sakshi

Published Mon, Aug 6 2018 2:11 PM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Leakage Issues to Bigg Boss 2 Telugu - Sakshi

బిగ్‌బాస్‌... విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ రియాల్టీ షో మన దగ్గర తొలుత బాలీవుడ్‌లో బాగా క్లిక్‌ అయ్యింది. ఆ ప్రేరణతో మిగతా భాషల్లోనూ ఈ షోలను తెరకెక్కిస్తుండగా.. అక్కడ కూడా మంచి రేటింగ్‌లనే రాబడుతున్నాయి. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా తెలుగులోనూ బిగ్‌బాస్‌-1 కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. అయితే అంచనాలకు అందని పేరున్న ఈ షో.. సెకండ్‌ సీజన్‌లో మాత్రం అందుకు అతీతంగానే సాగుతోంది. అందుకు ప్రధాన కారణం లీకేజీలు.  (తేజస్వీ సంచలన వ్యాఖ్యలు)

తొలి సీజన్‌ పుణే(మహారాష్ట్ర)లో ప్రత్యేకమైన సెట్‌ వేసి, బయటి టెక్నీషియన్లతో నిర్వహించటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగింది. కానీ, బిగ్‌బాస్‌-2ని మాత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్‌ వేసి కానిచ్చేస్తున్నారు. ఇదే అసలు తలనొప్పిగా మారింది. సాధారణంగా షోకి సంబంధించిన ఎపిసోడ్‌లను ఒకరోజు ముందుగానే చిత్రీకరిస్తుంటారు. దీంతో షో కోసం పని చేస్తున్న సిబ్బందికి ఏం జరుగుతుందన్న సమాచారం ముందే తెలిసిపోతుంది. కనుక తమకు కావాల్సిన వారికి ఆ సమాచారాన్ని ముందుగానే చేరవేస్తున్నారు. ఈ దశలో తమకు తెలిసినంత మేర సమాచారాన్ని పలువురు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసేస్తున్నారు. లీక్‌లు చేసేది సిబ్బంది అని తెలిసి కూడా ఏం చేయలేని స్థితిలో నిర్వాహకులు ఉండిపోయారు. దీనికితోడు కంటెస్టెంట్లు కూడా బయటకు వచ్చేసిన క్రమంలో అత్యుత్సాహంతో వెనువెంటనే తమ సమాచారాన్ని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసేసుకుంటున్నారు. వెరసి సమాచారం మొత్తం షో టెలికాస్టింగ్‌ కంటే కాస్త ముందే మీడియాకి, జనాల్లోకీ చేరిపోతోంది. ఈ పరిణామాలతో ఉత్కంఠంగా సాగాల్సిన ఈ దఫా సీజన్‌.. ఎలాంటి మసాలా లేకుండా చప్పగా సాగుతోందన్న  అభిప్రాయం వ్యక్తమౌతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement