leakages
-
అటు సన్నద్ధానికి, ఇటు సహనానికి.. మళ్లీ.. మళ్లీ ‘పరీక్షే’
సాక్షి, హైదరాబాద్: సర్కారు కొలువు సాధించడం ఓ యజ్ఞమే. దీనికోసం ఏళ్ల తరబడి కష్టపడేవారు కొందరు ఉంటున్నారు. అన్నీ వదిలేసి కోచింగ్ తీసుకునేవారు మరికొందరు ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసేవారు, దీర్ఘకాలిక సెలవు పెట్టేవారూ ఉంటారు. అయితే లీకేజీల మకిలీ, పరీక్షల వాయిదా, పరీక్షల రద్దు ఇలా వరుస ఘటనలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ప్రిపరేషనే ఓ పరీక్ష అయితే...సహనానికీ పరీక్ష పెట్టినట్టుగా ఉందని నిరుద్యోగులు వాపోతున్నారు. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తెలంగాణస్టేట్ పబ్లిక్‌సర్విస్ కమిషన్ గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా ఇప్పటివరకు 30 ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ఏకంగా 503 ఉద్యోగాలతో గ్రూప్–1 ప్రకటన వెలువడడంతో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారిలో ఎంతో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, ఇంజనీరింగ్ ఉద్యోగాలతోపాటు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ టీచర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, లైబ్రేరియన్స్, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్, హార్టీకల్చర్ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, టౌన్ ప్లానింగ్.. ఇలా దాదాపు 30వేల ఉద్యోగాలకు పైబడి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించింది. రెండో ‘సారీ’ ప్రశ్నపత్రాల లీకేజీతో డీఏఓ, గ్రూప్–1, ఏఈఈ పరీక్షలు రద్దు చేయగా, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, హార్టికల్చర్ ఆఫీసర్ తదితర పరీక్షలు చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఈ క్రమంలో దాదాపు ఏడున్నర లక్షల మందికిపైగా అభ్యర్థులంతా రెండోసారి పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఇందులో అత్యధికంగా గ్రూప్–1కు 3.80 లక్షల మంది, డీఏఓ పరీక్షకు దాదాపు 1.6లక్షల మంది అభ్యర్థులున్నారు. ఒకసారి పరీక్ష రాశాక, రెండోసారి మళ్లీ పరీక్షకు సన్నద్ధం కావడమనేది మానసికంగా తీవ్రఒత్తిడి కలిగించే విషయమే. ఇక గ్రూప్–1 విషయానికి వస్తే పరీక్ష నిర్వహణలోపాల కారణంగా రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు రెండుసార్లు ఆదేశించింది. గ్రూప్–1 పరీక్ష రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అత్యంత ఉత్తమమైన సర్విసు. రాష్ట్రస్థాయి సివిల్ సర్విసుగా భావించే దీనికి ప్రిపరేషన్ అంత ఈజీ కాదు. రోజుకు 18గంటల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి వారికి తాజాగా హైకోర్టు నిర్ణయం షాక్‌కు గురిచేసింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తే హాజరశాతం గణనీయంగా పడిపోయే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాతే హాజరులో స్పష్టత గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను ప్రకటించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 11వ తేదీ సాయంత్రం టీఎస్పీ ఎస్సీ హాజరైన అభ్యర్థుల ప్రాథమిక సమాచారం పేరిట ప్రకటన విడుదల చేసింది. పరీక్ష కేంద్రాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాలు చెబుతున్నా, ఓఎంఆర్ జవాబుపత్రాలు స్వా«దీనం చేసుకున్న తర్వాత పక్కా గణాంకాలు ఇస్తామని తెలిపింది. సాధారణంగా పరీక్షల హాజరుశాతం గణాంకాలపై స్పష్టత రావాలంటే వెంటనే సాధ్యం కాదు. అన్ని కేంద్రాల నుంచి పక్కా సమాచారం సేకరించడానికి సమయం పడుతుంది. ఈమేరకు టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొన్నా, మరుసటి ప్రకటనలో నెలకొన్న గందరగోళం అభ్యర్థులను కొంత అనుమానాలకు గురిచేసింది. ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసిన తర్వాత టీఎస్పీఎస్సీ చేసిన ప్రకటనలో స్పష్టత ఇచ్చినా, అభ్యర్థులకు మాత్రం అనుమానాలు తొలగలేదు. ఇక బయోమెట్రిక్ హాజరుతీరు పట్ల కూడా అనుమానాలు నెలకొనడంతో న్యాయస్థానాన్ని ఆశ్ర యించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో బయోమెట్రిక్ హాజరులో ఎదుర్కొన్న పలు సమస్యల కారణంగానే, బయోమెట్రిక్ వద్దనుకున్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థులకు వారం రోజుల ముందే పంపించిన హాల్‌టికెట్లలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశామని చెబుతున్నాయి. అయి తే రెండోసారి జారీ చేసిన హాల్ టికెట్లలో బయోమెట్రిక్ చెక్ఇన్ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. -
ర్యాలంపాడు రిజర్వాయర్ కట్టకు బీటలు
-
బిగ్‌బాస్-2.. అదే అసలు సమస్య!
బిగ్‌బాస్... విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ రియాల్టీ షో మన దగ్గర తొలుత బాలీవుడ్లో బాగా క్లిక్ అయ్యింది. ఆ ప్రేరణతో మిగతా భాషల్లోనూ ఈ షోలను తెరకెక్కిస్తుండగా.. అక్కడ కూడా మంచి రేటింగ్‌లనే రాబడుతున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులోనూ బిగ్‌బాస్-1 కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అయితే అంచనాలకు అందని పేరున్న ఈ షో.. సెకండ్ సీజన్లో మాత్రం అందుకు అతీతంగానే సాగుతోంది. అందుకు ప్రధాన కారణం లీకేజీలు. (తేజస్వీ సంచలన వ్యాఖ్యలు) తొలి సీజన్ పుణే(మహారాష్ట్ర)లో ప్రత్యేకమైన సెట్ వేసి, బయటి టెక్నీషియన్లతో నిర్వహించటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగింది. కానీ, బిగ్‌బాస్-2ని మాత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేసి కానిచ్చేస్తున్నారు. ఇదే అసలు తలనొప్పిగా మారింది. సాధారణంగా షోకి సంబంధించిన ఎపిసోడ్లను ఒకరోజు ముందుగానే చిత్రీకరిస్తుంటారు. దీంతో షో కోసం పని చేస్తున్న సిబ్బందికి ఏం జరుగుతుందన్న సమాచారం ముందే తెలిసిపోతుంది. కనుక తమకు కావాల్సిన వారికి ఆ సమాచారాన్ని ముందుగానే చేరవేస్తున్నారు. ఈ దశలో తమకు తెలిసినంత మేర సమాచారాన్ని పలువురు సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. లీక్‌లు చేసేది సిబ్బంది అని తెలిసి కూడా ఏం చేయలేని స్థితిలో నిర్వాహకులు ఉండిపోయారు. దీనికితోడు కంటెస్టెంట్లు కూడా బయటకు వచ్చేసిన క్రమంలో అత్యుత్సాహంతో వెనువెంటనే తమ సమాచారాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసేసుకుంటున్నారు. వెరసి సమాచారం మొత్తం షో టెలికాస్టింగ్ కంటే కాస్త ముందే మీడియాకి, జనాల్లోకీ చేరిపోతోంది. ఈ పరిణామాలతో ఉత్కంఠంగా సాగాల్సిన ఈ దఫా సీజన్.. ఎలాంటి మసాలా లేకుండా చప్పగా సాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. -
లీకేజీలపర్వం
మదనాపురం : బీడు భూములను సాగులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం.. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు శిథిలావస్థకు చేరాయి. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కమీషన్లకు కక్కుర్తిపడి దశాబ్దాల పాటు పనిచేయాల్సిన ఎత్తిపోతల పథకాలు ఆదిలోనే మొరాయిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో లిఫ్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకే తలమానిగా ఉన్న సరళాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని రామన్‌పాడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి నాబార్డు ఆర్థికసాయంతో రూ.1,292 లక్షలు వెచ్చించి 2006లో నిర్మించారు. ఈ లిఫ్టు ద్వారా సరళాసాగర్ ప్రాజెక్టును నింపి 4200 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా అధికారులు డిజైనింగ్ రూపొందించారు. తరచూ లీకేజీలు మదనాపురం మండలంలోని శంకరమ్మపేట, దంతనూర్, మదనాపురం, తిర్మలాయపల్లి, రామన్‌పాడు, అజ్జకొల్లు, నర్సింగాపురం, నెల్విడి, వడ్డెవాట గ్రామాలకు సాగునీరు అందించాలని సరళాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పనచేశారు. పథకాన్ని ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు ప్రధాన పైప్‌లైన్‌కు 30లీకేజీలు ఉన్నాయి. గత వేసవిలో 20లీకేజీలను సరిచేయగా ఇంకా పదింటిని సరిచేయాల్సి ఉంది. మూడున్నరేళ్లలో నాలుగుసార్లు పైప్‌లైన్ పగిలింది. మొదటిసారి మదనాపురం చిన్నవాగులో, రెండవ సారి ప్రధాన పంప్‌హౌస్ వద్ద తిర్మలాయపల్లి శివారు, మూడవ సారి మదనాపురం వాగులోని మొదట పగిలిన స్థానంలోనే మళ్లీ పగిలింది. నాలుగోసారి నర్సింగాపురం శివారు కావలి రాములు పొలంలో పైప్‌లైన్ పగిలింది. ఎప్పుడు ఎక్కడ ఏ పైప్‌లైన్ పగులుతుందోనని ఇటు లిఫ్టు నిర్వాహణ కమిటీ, ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పగిలిన పైప్లైన్లకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.3లక్షలు వెచ్చించి మరమ్మతు చేయించారు. నాణ్యతలేని పైపులు వేశారు. తరతరాలుగా రైతులకు అన్నంపెట్టే లిఫ్టును కాంట్రాక్టర్లు కమీషన్ల కోసం నిర్మాణంలో నాణ్యతలేని పైపులు వేశారు. అధికారులు కుమ్మక్కై ఎత్తిపోతల పథకం లక్ష్యాన్ని నీరుగార్చారు. నాటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయానికి తూట్లు పొడిచారు. తరచూ లీకేజీలతో పొలాలకు నీళ్లు రాక సతమతమవుతున్నాం.. లిఫ్టు మూతపడితే మా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుంది. – వెంకటయ్య, రైతు, నర్సింగాపురం కాంట్రాక్టర్లు దోచుకున్నారు లిఫ్టు నిర్మాణ సమయంలో అధికారులు కాంట్రాక్టర్లు కలిసి దోచుకున్నారు. నాణ్యమైన పైపులు, మోటార్లు వేయకపోవడంతో తరచూ ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం.. లిఫ్టు నడవకుంటే ప్రస్తుతం వరినాట్లు వేసుకున్న 1600ఎకరాల పంట ఎండిపోతుంది. అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకాలను మరమ్మతు చేసి ప్రారంభించారు. – సూరిబాబు, రైతు, మదనాపురం నాణ్యతలేని పైపుల వాడకంతోనే.. 4,200ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్టు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, నాణ్యత లేని పైపులు, నాసిరకమైన విద్యుత్ మోటార్లను బిగించకపోవడంతోనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన పైప్‌లైన్ గుండా ప్రారంభించిన నాటినుంచి తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు నీటి ఉధృతిని తట్టుకోలేక పైపులు పగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 1600 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. -
లీకేజీలకు ఆస్కారం లేని సీబీఆర్టీ
ఈ విధానంలో ఒకరోజు ముందు కూడా కొన్ని ప్రశ్నలను చేర్చాం. అలాగే కొన్నింటిని తొలగించాం. ప్రశ్నలను రూపొందించడానికి ఉపయోగించిన సర్వర్లకు ఇంటర్నెట్తో ఉన్న కనెక్షన్ పూర్తిగా తొలగించారు. (ఈ నెల 20వ తేదీ, ఆదివారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సీబీఆర్టీ పరీక్షను నిర్వహించింది) సంప్రదాయకంగా కాగితం, కలం విధానంతో కాకుండా, కంప్యూటర్ సాయంతో పరీక్ష నిర్వహించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) భారీ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. హైదరా బాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జోన్లలో దాదాపు 34,000 మంది అభ్యర్థుల కోసం ఈ కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షను (సీబీఆర్టీ) కమిషన్ నిర్వ హించింది. కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలా ఉద్యోగ నియామక పరీక్షను నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి. బహుళ జోన్లలోని 99 పరీక్షా కేంద్రాలలో, ఒకేరోజు రెండు ప్రశ్న పత్రాలతో నిర్వహించడం కూడా మొదటిసారే. కంప్యూటర్ సాయంతో పరీక్ష నిర్వహించడానికైనా మామూలుగా అయితే ఏర్పాట్ల కోసం కనీసం నాలుగు మాసాల కాలం అవసరమవుతుంది. అయితే పరీక్ష నిర్వహణ ఏర్పాట్లనూ, పనులనూ టీఎస్పీఎస్సీ నాలు గు వారాల లోపుననే పూర్తి చేసింది. ప్రశ్నల ఎంపిక, ప్రశ్నల నిధుల తయారీ, పరీక్షా కేంద్రాల ఎంపిక, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయదలచిన 40,000 కంప్యూ టర్ల సంసిద్ధతను పరీక్షించడం, యూపీఎస్, డీజీ సెట్ల సౌకర్యాలు, 50 మంది స్క్వాడ్ సభ్యుల, 250 మంది కమిషన్ పర్వవేక్షకుల, 250 మంది టెక్నికల్ మేనేజర్లు, ఇన్విజిలేటర్లను నియామకం, ఈ సిబ్బందికి తర్ఫీదు, నమూనా పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల ఏర్పా ట్లు - అన్నీ కూడా ఆ నాలుగువారాలలోనే పూర్తి చేశారు. ఇదంతా కేవలం 40 మంది సిబ్బంది ఉన్న సంస్థ సాధిం చింది. శక్తిసామర్థ్యాలు తన సొంతం అనిపించే కమిషన్ చైర్మన్ డాక్టర్ ఘంటా చక్రపాణి, సభ్యుడు సి. విఠల్, కార్యదర్శి పార్వతి చూపిన అకుంఠిత దీక్ష ఇందుకు కార ణం. వారంతా రోజుకు 16 గంటలు పనిచేశారు. సీబీఆర్టీ పరీక్ష వల్ల ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. మేం మొత్తం 1500 ప్రశ్నలతో ఒక నిధిని సిద్ధం చేశాం. కంప్యూటర్ను ఉపయోగించడం ద్వారా ర్యాండమ్ విధా నంతో వాటి నుంచి తీసుకున్న ప్రశ్నలతో బహుళ ప్రశ్న పత్రాలను (150 ప్రశ్నలతో) రూపొందించాం. ఇవి కూడా ఎన్క్రిప్షన్ (సంకేత లిపిని విశ్లేషించి రాసే విధా నం)తో రూపొందించడం జరిగింది. దీనితో పరీక్షలో ఏ ప్రశ్నలు ఇస్తారో ఏ ఒక్కరికీ (కమిషన్ చైర్మన్, సభ్యులు సహా) తెలిసే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో పరీక్ష నిర్వహించడానికి ముందు పది పదిహేను రోజుల ముందు పరీక్ష పత్రాల కట్టలను అచ్చుకు పంపడం లేదు. దీనితో పేపర్ లీకేజీకి ఏమాత్రం అవకాశం ఉండ దు. ఈ విధానంలో ఒక రోజు ముందు కూడా కొన్ని ప్రశ్నలను చేర్చాం. అలాగే కొన్నింటిని తొలగించాం. ప్రశ్నలను రూపొందించడానికి ఉపయోగించిన సర్వర్ లకు ఇంటర్నెట్తో ఉన్న కనెక్షన్ పూర్తిగా తొలగించారు. కాబట్టి హ్యాకింగ్ లేదా సైబర్ దాడికి కూడా అవకాశం లేదు. ప్రతి ప్రశ్నపత్రానికి కమిషన్ చైర్మన్ ముందు రాత్రే రహస్య పాస్వర్డ్ రక్షణ కల్పిస్తారు. అయితే ఒకసారి ఈ రక్షణ కల్పించిన తరువాత పరీక్ష సమయం ముగిసే దాకా మళ్లీ దానిని తొలగించడం చైర్మన్‌కు కూడా సా ధ్యం కాదు. ఎవరైనా ఆ పాస్‌వర్డ్‌ను తస్కరించినా కూ డా ఆ రక్షణ నుంచి తప్పించలేరు. పరీక్షా కేంద్రాల దగ్గర ఏర్పాటు చేసిన ప్రతి కంప్యూటర్ టెర్మినల్‌ను టీఎస్పీ ఎస్సీ కేంద్రంతో అనుసంధానించారు. అసలు పరీక్షను నిర్వహించడానికి ముందురోజు నుంచి వాటి కార్యకలా పాలను పర్యవేక్షించడం ప్రారంభించారు. 99 కేంద్రాల లోని 31,000 కంప్యూటర్ల పని తీరును డమ్మీ ప్రశ్న పత్రంతో పరీక్షించారు. ఇది సంక్రమంగా జరుగుతున్న దని 250 మంది కమిషన్ అబ్జర్వర్ల ద్వారా, 250 మంది టెక్నికల్ మేనేజర్ల ద్వారా, 1,600 మంది ఇన్విజిలేటర్ల ద్వారా నిర్ధారించుకున్నారు. నమూనా పరీక్ష, పోస్ట్ ఎగ్జా మ్ ప్రక్రియలలోని ప్రతి అడుగును తనిఖీ చేయడానికీ, ప్రతి పరీక్షా కేంద్రాన్నీ, కంప్యూటర్‌నూ, పరీక్ష జరుగు తున్నంత సేపు అభ్యర్థి కదలికలనూ కనిపెట్టి ఉండ డానికీ టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థి నిబంధనలు ఎప్పుడు చదువుకున్నాడు, ఎప్పుడు లాగ్ ఇన్ అయ్యా డు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఎంత సమ యం తీసుకున్నాడు వంటి అంశాలను కూడా అది గమ నిస్తుంది. పరీక్షా సమయానికి సరిగ్గా మూడు గంటల ముం దు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ప్రశ్నపత్రం పాస్‌వర్డ్‌ను ఐటీ సమాచార పంపిణీ విధానం ద్వారా తెలంగాణ అం తటా ఏర్పాటు చేసిన 169 కంప్యూటర్ సర్వర్లకు విడు దల చేశారు. దీనితో పోలీస్, ట్రెజరీ వంటి విభాగాలకు పని తగ్గించారు. ఇదే విధానంతో ఒక గంట ముందు టీఎస్పీఎస్సీ చైర్మన్ డ్రైవ్ పాస్‌వర్డ్‌ను విడుదల చేశారు. కేంద్రాలలో ఏర్పాటు చేసిన 34,000 కంప్యూటర్లకు ప్రశ్న పత్రం చేరిన విషయం దీనితో రూఢీ అవుతుంది. అయితే దీనిని అభ్యర్థి మాత్రమే(తన పాస్‌వర్డ్‌తో) తెలు సుకోగలడు. ఈ కార్యక్రమం మొత్తాన్ని ఉదయం పది గంటల నుంచి టీఎస్పీఎస్సీ కేంద్రంలో పర్యవేక్షిం చారు. ఈ విధానం కూడా చాలా పని గంటలను, సిబ్బం ది శ్రమను ఆదా చేసింది. ఫొటోను గుర్తించే వెబ్‌క్యామ్ తో సహా, బయో మెట్రిక్‌ను (వేలి ముద్ర)ను ప్రతి అభ్య ర్థికి ఇచ్చారు. దీనిని సరి చూసే వ్యవస్థను టీఎస్పీఎస్సీ సర్వర్ ద్వారా నిర్వహించారు. పరీక్ష రాయడం పూర్తయి నాక జవాబు పత్రాలు వాటికవే టీఎస్పీఎస్సీ దగ్గర ఏర్పాటు చేసిన సర్వర్లకు చేరుకుంటాయి. ఒక అభ్యర్థికి బదులు వేరొక అభ్యర్థి పరీక్ష రాసే అక్రమాన్ని అరికట్ట డానికి గేట్, క్యాట్, ఐఐటీ-జీఈఈలు కూడా ఇలాంటి విధానాన్ని ఇంతవరకు ప్రవేశపెట్టలేదు. వ్యాసకర్త ఈసీ మేరీ క్యూరీ ఫెలో-ఇండియన్ ఐఐటీ హైదరాబాద్, nishanth@iith.ac.in - ప్రొ. దొంగరి నిశాంత్ -
కృష్ణా మూడో దశలో ఆగని లీకేజీలు
హైదరాబాద్ : కృష్ణా మూడోదశ పథకానికి లీకేజీల గండం పట్టుకుంది. తరచుగా లీకేజీలు ఏర్పడుతుండడంతో జనం దాహార్తిని తీర్చాల్సిన విలువైన తాగునీరు వృథా అవుతోంది. తాజాగా ఆదివారం నాసర్లపల్లి-గోడకొండ్ల(ప్యాకేజీ2) మార్గంలో కుర్మేడు వద్ద కృష్ణా మూడో దశ పైప్‌లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడింది. కృష్ణా మొదటి, రెండవ దశ పైప్లైన్ల కంటే నూతనంగా వేసిన మూడోదశ పథకంలో పలుమార్లు లీకేజీలు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. పైపుల జాయింట్లు, జంక్షన్ల పనులు పటిష్టంగా చేయకపోవడంతోనే లీకేజీలు ఏర్పడుతున్నట్లు సమాచారం. సుమారు 1,670ల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కృష్ణా మూడోదశ పథకం ద్వారా నగరానికి నిత్యం 90 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించాలన్న లక్ష్యం నిర్దేశించుకున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ పథకం ద్వారా నగరానికి సుమారు 50 మిలియన్ గ్యాలన్ల జలాలను సరఫరా చేస్తుండగా..ఇందులో లీకేజీల కారణంగా పలుమార్లు విలువైన మంచినీరు మట్టిపాలవుతోంది. -
ముందుచూపేదీ?.
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.36.50 కోట్లతో ఏడేళ్ల కింద చేపట్టిన మంచినీటి పథకం మూన్నాళ్ల ముచ్చటే అవుతోంది. తరచూ లీకేజీలతో నీరందించేందుకు ఆపసోపాలు పడుతున్న ఈ నీటి పథకానికి అధికారుల ముందుచూపు లేమితో మరో గండం వచ్చింది. సిరిసిల్ల-వేములవాడ పట్టణాల మధ్య ఫోర్‌లేన్ రహదారి నిర్మాణం జరుగుతుండగా.. పైపులైన్ పైనే రోడ్డు వేస్తున్నారు. రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలతో పైపులైన్ పగిలితే అటు రోడ్డుకు, ఇటు నీటి సరఫరాకు ముప్పు తప్పదు. పైపులైన్‌ను మింగేస్తున్న ఫోర్‌లేన్ సిరిసిల్ల-వేములవాడ పట్టణాల మధ్య ఏడు కిలోమీటర్ల డబుల్ రోడ్డును ఫోర్‌లేన్‌గా విస్తరిస్తున్నారు. రూ.16 కోట్లతో ఫోర్‌లేన్ పనులు జరుగుతున్నాయి. పైపులైన్ పైన కొత్తగా రహదారి వేయడంతో ఎప్పుడు పైపు పగిలిపోయినా రహదారికి, నీటి సరఫరాకు ముప్పు వాటిళ్లుతుంది. పైపులైన్ నిర్మాణ దశలో ఇంజినీర్లు రహదారి విస్తరణను దృష్టిలో ఉంచుకొని మరింత ఎడంతో పైపులైన్ వేస్తే ఈ ప్రమాదం వచ్చేది కాదు. దీనికితోడు కరీంనగర్-కామారెడ్డి డబుల్ రోడ్డును భవిష్యత్‌లో ఫోర్‌లేన్‌గా మార్చుతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఫోర్‌లేన్ నిర్మాణం జరిగితే కరీంనగర్ నుంచి సిరిసిల్ల వరకు పైపులైన్ మొత్తం రహదారి అడుగుభాగంలో భూస్థాపితమయ్యే ప్రమాదముంది. పైపులైన్ మూలంగా దీర్ఘకాలం మన్నికగా ఉండాల్సిన రహదారి సైతం చెడిపోయే అవకాశముంది. షిఫ్టింగ్‌కు రూ.12 కోట్ల ఖర్చు ప్రజాధనమంటే అధికారులకు లెక్కలేకుండా పోయింది. రూ.16 కోట్లతో నిర్మిస్తున్న ఫోర్‌లేన్ పనుల్లో భాగంగా మంచినీటి పైపులైన్‌ను షిఫ్టింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అక్షరాలా రూ.12 కోట్లు ఖర్చవుతుందని మున్సిపల్ అధికారులు అంచనా వేసి ఆర్అండ్బీ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. పైపులైన్ షిప్టింగ్‌కు సర్కారు నుంచి అనుమతి రావాల్సి ఉందని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ బి.సుమన్‌రావు తెలిపారు. తలకు మించిన భారం.. సిరిసిల్ల పట్టణానికి సమీపంలోనే మానేరువాగు ఉంది. దశాబ్దకాలంగా పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను మానేరు వాగే తీరుస్తోంది. పక్కన ఉన్న వాగును వదిలేసి నలభై కిలోమీటర్ల దూరంలోని ఎల్ఎండీ నుంచి పైపులైన్ నిర్మించి సిరిసిల్లకు నీరు అందించాలని 2007లో రూ.36.50 కోట్లతో మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. ఆ నిధులతో కరీంనగర్ ఎల్ఎండీ నుంచి సిరిసిల్ల వరకు పైపులైన్ వేశారు. రగుడు వద్ద నీటి శుద్ధి ప్లాంట్‌ను నిర్మించారు. నిర్మించిన నాటి నుంచి లీకేజీలతో నీటి పథకం నీరుగారిపోతోంది. మూడేళ్లపాటు కాంట్రాక్టర్ ఈ పథకాన్ని అతి కష్టమ్మీద నిర్వహించి మున్సిపాలిటీకి అప్పగించారు. దీంతో నిర్వహణ ఖర్చులు మున్సిపాలిటీకి తలకుమించిన భారమైంది. ఎల్ఎండీ వద్ద మోటార్లు ఆన్‌చేస్తే మూడు గంటల వరకు సిరిసిల్లకు చుక్కనీరు చేరదు. ఆలోగా కరెంటు అంతరాయం ఏర్పడితే అంతే సంగతులు. ఇలా నీటి పథకం దినదిన గండంగా వెల్లదీస్తోంది. ఇప్పటికీ నీటి పంపింగ్ కష్టంగానే మారింది. పథకం నిర్మాణ దశలోనే ఇంజినీర్ల పర్యవేక్షణలోపం, ప్రజాప్రతినిధుల అవినీతిదాహం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. నీటి కష్టాలు తీరేదెలా..? సిరిసిల్ల శివారులో ఉన్న మానేరువాగు నుంచి నీటిని పంప్ చేస్తూ నల్లా నీరు అందిస్తుండగా, శివారు ప్రాంతాల్లో నీటి కష్టాలు తప్పడం లేదు. ఎల్ఎండీ పైపులైన్ పగుళ్లతో ‘నీరు’ గారిపోతుండగా మానేరువాగు నీరే దిక్కవుతోంది. సిరిసిల్లలో ఎనిమిదివేల నల్లాలు ఉండగా ఆరు ప్రాంతాల్లోని వాటర్‌ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మున్సిపాలిటీ అధికారులు ట్యాంకర్ల ద్వారా అరకొర నీటిని అందిస్తున్నారు. పట్టణంలోని తారకరామనగర్, గణేశ్‌నగర్, సుందరయ్యనగర్, బీవైనగర్, వెంకంపేట, ప్రగతినగర్ ప్రాంతాల్లో పైపులైన్లు ఉన్నా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌లో భాగంగా మధ్యమానేరు జలాశయం నుంచి నీటిని పంప్ చేసి సిరిసిల్ల ప్రాంతంలోని 307 గ్రామాలతో పాటు పట్టణానికి అందించాలని రూ.670 కోట్లతో ప్రతిపాదించింది. ఇక రూ.36.50 నీటిపథకం పూర్తిగా నిరుపయోగంగా మారనుంది. -
అవి‘నీటి’కి లైన్‌క్లియర్!
సిరిసిల్ల మున్సిపాలిటీలో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.80 కోట్లతో చేపట్టాల్సిన తాగునీటి పైపులైన్ పనులకు టెండర్ల దశలోనే అవి‘నీటి’ లీకేజీలు ఏర్పడ్డాయి. నాణ్యత ప్రమాణాలతో పదికాలాలపాటు నిలిచేలా పనులు నిర్వహించాల్సి ఉండగా... కొంతమంది కౌన్సిల్ సభ్యులు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు పుచ్చుకొని నిబంధనలకు విరుద్ధంగా దాఖలైన టెండర్లను ఆమోదించేందుకు రంగం సిద్ధమైంది. సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రభుత్వ హైస్కూల్ నుంచి తుమ్మలకుంట చెరువు వరకు ప్రధాన మురికికాలువ నిర్మాణానికి రూ.26.31 లక్షలతో టెండర్లు నిర్వహించగా, 26.55 శాతం తక్కువకు కోడ్ చేసిన శ్రీహనుమాన్ వడ్డెర సంఘానికి పని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. శాంతినగర్, వెంకట్రావునగర్, అంబేద్కర్‌నగర్ అంతర్గత హెచ్డీపీఈ పైపులైన్ కోసం రూ.21.80 లక్షలతో టెండర్లు పిలిచారు. ఈ పనిని 15.20 శాతం తక్కువకు సత్యం సిమెంట్ పైప్స్ కంపెనీకి అప్పగించేందుకు టెండర్లు ఓకే చేశారు. సాయినగర్ వాటర్ ట్యాంక్ నుంచి తుక్కారావుపల్లి, గణేశ్‌నగర్, తారకరామనగర్‌లో పైపులైన్ వేసేందుకు రూ.40.51 లక్షలతో టెండర్లు పిలువగా 15.40 శాతం తక్కువ కోడ్ చేసిన సత్యం సిమెంట్ పైప్స్ కంపెనీకే ఓకే చేస్తూ మున్సిపల్ ఏజెండాలో పేర్కొన్నారు. పట్టణంలోని గణేశ్‌నగర్, జేపీనగర్, తుక్కారావుపల్లి, అంబికానగర్, లలితానగర్, తారకరామనగర్ ప్రాంతాల్లో పైపులైన్ నిర్మాణం కోసం రూ.20 లక్షలతో టెండర్లు పిలవగా 18.10 శాతం తక్కువకు వేసిన మహేశ్వరి పాలిమర్స్‌కు టెండర్ ఓకే చేశారు. మొత్తం వ్యవహారంలో కౌన్సిల్ ముఖ్య నాయకులకు ముందే రూ.10 లక్షలు ఇవ్వాలన్న ఒప్పందం మేరకు టెండర్లు ఖరారు చేసినట్లు ఆరోపణలున్నాయి. లోగుట్టు ఇదీ... ఈ-ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా టెండర్లు పిలువగా అక్టోబర్ 31లోగా టెండర్లు దాఖలు చేయాలి. నవంబర్ 1న టెండర్లు ఓపెన్ చేయాలి. నిబంధనల ప్రకారం టెండర్లు తెరిచేలోగా ఈఎండీ, ప్రాసెసింగ్ ఫీజు డీడీ చెల్లించిన కాంట్రాక్టర్ల టెండర్లు మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉండగా, కౌన్సిల్ కోరుకున్న వ్యక్తులు ఆ నిబంధనల ప్రకారం డీడీలు కట్టలేదు. స్థానిక కాంట్రాక్టర్ ఒకరు డీడీలు చెల్లించి పనులు చేసేందుకు సిద్ధంగా ఉండగా, మున్సిపల్లోని కీలక నాయకులు సదరు కాంట్రాక్టర్‌ను మున్సిపాలిటీకి పిలిచి టెండర్ వాపస్ తీసుకోవాల్సిందిగా హుకుం జారీ చేసినట్లు సమాచారం. సదరు కాంట్రాక్టర్ ససేమిరా అనడంతో డీడీ చెల్లించని కాంట్రాక్టర్లతో డీడీలు తెప్పించుకొని టెండర్‌ను ఓకే చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సిరిసిల్ల పట్టణంలో పైపులైన్ లీకేజీలతో పట్టణ నీటి సరఫరా వ్యవస్థ గందరగోళంగా మారింది. కొత్తగా వేసే పైపులైన్లలోనూ మున్సిపల్ కౌన్సిల్ కాసుల కోసం కక్కుర్తిపడి నిబంధనలు పాటించని వ్యక్తులకు పైపులైన్ పనులు అప్పగించేందుకు సిద్ధమవడం చర్చనీయాంశమైంది. కౌన్సిలర్ల మధ్య కలహాలు పైపులైన్ టెండర్లకు సంబంధించి ఒప్పందం చేసుకున్న రూ.10 లక్షల పంపిణీ వ్యవహారం కౌన్సిలర్ల మధ్య కలహాలకు దారి తీసింది. ఈ డబ్బులను కౌన్సిల్‌లోని ముఖ్యనాయకులు ఇద్దరితోపాటు మరో సీనియర్ కౌన్సిలర్, ప్రతిపక్ష పార్టీకి చెందిన మరో ఇద్దరు ముఖ్య కౌన్సిలర్లకు వాటాలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. ఐదుగురు ముఖ్య నాయకులకే వాటాలు ఇచ్చి ఈ మేరకు ఈ నెల 29న నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో టెండర్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపేలా రంగం సిద్ధమైంది. విషయం తెలుసుకున్న మిగతా టీఆర్ఎస్ కౌన్సిలర్లు తమకూ వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. కీలక కౌన్సిలర్లు అందుకు నిరాకరించారని, పైపులైన్ పనులు పూర్తయ్యాక వచ్చే కమీషన్‌ను వారికి పంపిణీ చేస్తామని సముదాయించినట్లు తెలిసింది. ఈ ఒప్పందాన్ని నిరాకరించిన మెజారిటీ కౌన్సిలర్లు రెండురోజుల కిందట ఓ కౌన్సిలర్ ఇంట్లో సమావేశమై టెండర్లు ఆమోదం పొందకుండా చూడాలని నిర్ణయించారు. మొత్తంగా పైపులైన్ నిర్మాణానికి ముందే ముడుపుల లీకేజీలు సిరిసిల్ల కౌన్సిల్లో రగడకు కారణమయ్యాయి. ఈ విషయంలో కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. నిబంధనల ప్రకారమే టెండర్లు - సుమన్‌రావు, మున్సిపల్ కమిషనర్ 13వ ఆర్థిక సంఘం నిధులతో పైపులైన్ కోసం పిలిచిన టెండర్లు నిబంధనల మేరకే జరిగాయి. జీవో ప్రకారం ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచాం. తక్కువ పర్సెంట్‌కు టెండర్ కోడ్ చేసిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించేందుకు కౌన్సిల్ ఆమోదానికి పెట్టాం. రూ.11.58 లక్షల మేర తక్కువ మొత్తానికే టెండర్లు ఒకే చేశాం. -
వృథా.. వ్యధ
ధారూరు, న్యూస్‌లైన్: జిల్లాకే తలమానికమైన కోట్‌పల్లి ప్రాజెక్టు గత వర్షాకాలంలో పూర్తిగా నిండటంతో ధారూరు, పెద్దేముల్ మండలాల రైతులు రబీపై ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. ప్రాజెక్టుకు తగిన మరమ్మతులు లేక పొలాలకు వదిలిన నీళ్లు వృథాగా పోతున్నాయి. ప్రాజెక్టు కింద 9,200 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా ఆరువేల ఎకరాలకే అందుతోంది. ఈ ప్రాజెక్టుకు బేబీ కెనాల్‌తో పాటు కుడి, ఎడమ కాల్వలున్నాయి. 1967లో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు సరైన మరమ్మతులు లేక నిర్లక్ష్యానికి గురవుతోంది. కాల్వలు శిథిలమై, లీకేజీలు ఏర్పడి ప్రాజెక్టులోని నీరు వృథాగా బయటకి వెళ్తున్నాయి. ప్రాజెక్టును నిర్మించి 47 ఏళ్లు పూర్తి కావస్తున్నా నేటికీ చివరి భూములకు నీరందడం లేదు. మండలంలోని రుద్రారం, గట్టెపల్లితండా, రాంపూర్ తండా మీదుగా 11 కిలో మీటర్ల పొడవుతో ఎడమ కాల్వను నిర్మించారు. కాల్వ లో మూడు చోట్ల పెద్ద పెద్ద లీకేజీలు ఏర్పడి సగం నీరు వృ థాగా కాగ్నా నదిలో కలిసిపోతోంది. ఈ నీళ్లు సద్వినియోగమైతే దాదాపు 400 ఎకరాల బీడు భూములకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఈ కాల్వ పరిధిలో 1,120 ఎకరాలకు నీరందాల్సి ఉండగా ప్రస్తుతం 600ల ఎకరాలకు కూడా అందడం లేదు. వృథా నీటిని అరికట్టేందుకు లీకేజీలను సరి చేయాలని నాలుగు దశాబ్దాలుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడమ కాల్వ తూము వద్దే లీకేజీలు.. ప్రాజెక్టు వెనుక భాగంలో నిర్మించిన ఎడమ కాల్వ తూము లోపభూయిష్టంగా ఉండటంతో పొలాలకు నీరందడం లేదు. తూము నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో లీకేజీలు ఏర్పడి ప్రాజెక్టు నీరు వృథా అవుతోంది. తూముకు రంధ్రాలు పడి, లీకేజీలు ఏర్పడినా మరమ్మతులు చేపట్టకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. కాల్వల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి ఏటా రూ.లక్షల్లో నిధులు కేటాయించినా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేపడుతూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుడి కాల్వ పరిస్థితీ అంతే.. మండల పరిధిలోని నాగసమందర్, అల్లాపూర్ గ్రామాలతో పాటు పెద్దేముల్ మండలంలోని 7,720 ఎకరాలకు కుడి కాల్వ ద్వారా పొలాలకు నీరు చేరాలి. కాల్వ శిథిలావస్థకు చేరడంతో అధిక మొత్తంలో నీరు వృథా అవుతోందని రైతులు వాపోతున్నారు. కాల్వ పొడవు 24 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు 8 నుంచి 10 వరకు లీకేజీలు ఉన్నట్లు చెబుతున్నారు. కాల్వల్లో ఏర్పాటు చేసిన షెట్టర్లు పూర్తిగా దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. వృథా నీటిని అరికడితే దాదాపు 3 వేల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉంటుందంటున్నారు. బూరుగు గడ్డ ప్రాంతంలోని 360 ఎకరాలకు నీరందించేందుకు నిర్మించిన 1.6 కిలో మీటర్ల పొడవైన బేబీ కెనాల్ కూడా పాడై నీరు వృథాగా నాగసమందర్ సమీపంలోని ఊట వాగులో కలుస్తోంది. ఈ విషయం ప్రాజెక్టు గ్యాంగ్మెన్లకు, సాగునీటి శాఖ డీఈ, ఈఈలకు తెలిసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు కాకుంటే తామేం చేస్తామని సిబ్బంది చేతులు దులు పుకొంటున్నారు. ‘జైకా’ నిధులు వచ్చేనా? జైకా నిధులు (జపాన్ దేశం నుంచి) రూ. 20 కోట్లు వస్తేనే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టే వీలుంటుందని రైతులు పేర్కొంటున్నారు. నిధులు మంజూరయ్యాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నా ఇంతవరకు పనుల జాడే లేదంటున్నారు. ఈ రబీ సీజన్లోనే పనులను ప్రారంభించి పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.