బిగ్‌బాస్ రెండో సీజన్‌తో మోస్ట్ పాపులర్ అయిన కంటెస్టెంట్ కౌశల్. తన ఆటతో అందరి అభిమానాన్ని సంపాదించుకుని విన్నర్‌గా నిలిచాడు. అయితే అంతవరకు మంచి పేరున్న కౌశల్.. బయటకు వచ్చాక చేసిన కొన్ని పనులతో నవ్వులపాలయ్యాడు. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఓ యూనివర్సిటీ తనకు డాక్టరేట్ పట్టా ఇస్తామన్నారంటూ ప్రచారం చేసుకునే సరికి అతనికి కొంత నెగెటివిటీ ఏర్పడింది.
హౌస్‌లో ఉన్నంత సేపు ఎవ్వరితోనూ అంతగా కలవకుండా సొంతంగా గేమ్ ఆడిన కౌశల్.. బయటకు వచ్చాక కూడా తన హౌస్‌మేట్స్‌తో ఎక్కువ కలిసిమెలిసి ఉన్నట్లు కనిపించలేదు. అయితే మిగతా కంటెస్టెంట్లు అందరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఎవరి పుట్టినరోజు వేడుకలు అయినా, పండగలు వచ్చినా కలిసి ఎంజాయ్ చేస్తారు.
అయితే శుక్రవారం (సెప్టెంబర్ 20) నాడు కౌశల్ కూతురు లల్లీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు తనీష్, గీతా మాధురి, అమిత్, రోల్ రైడా, గణేష్ ఇలా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు చాలామంది హాజరైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరంతా లల్లీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే.. ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్ హాజరవ్వడం మరో ఎత్తు. ఈ సందర్భంగా సుకుమార్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment