
ఆదివారం నాటి బిగ్‌బాస్ కార్యక్రమంలో అందరూ ఊహించిందే జరిగింది. మొదటి రెండు వారాలు సామాన్యులు ఇంటి నుంచి వెళ్లిపోగా.. ఈసారి కూడా ఎలిమినేట్ అయ్యేది మిగిలిన సామాన్యుడు గణేష్..అని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా తెరపైకి కిరీటి పేరు రావటం, అదే నిజం చేస్తూ నిన్న(ఆదివారం) కిరిటీ బిగ్‌బాస్ ఇంటి నుంచి వెనుదిరటం తెలిసిందే. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో మిగిలిన సామాన్యుడు ఒకే ఒక్కడు గణేష్. ప్రతిసారి ఎలిమినేషన్ ఫేజ్‌కు నామినేట్ అవుతున్న గణేష్... ప్రేక్షకుల మద్దతుతో గట్టెక్కుతూ వస్తున్నాడు.
నెక్స్ట్ అతనేనా?... ఆదివారం నాటి కార్యక్రమం ఆద్యంతం వినోధభరితంగా జరిగింది. టాస్క్‌లో భాగంగా కొన్ని సినిమా టైటిల్స్ చూపించి.. ఏ వ్యక్తికి సరిపోతుందో మిగతా కంటెస్టెంట్‌లతో చెప్పించాడు హోస్ట్ నాని. అయితే చివర్లో తర్వాత ఎలిమినేట్ అయ్యే హౌజ్‌మేట్ గురించి హింట్ ఇచ్చారేమో అనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా కౌశల్ వంతు రాగా, ‘అతడు స్వార్థపరుడు’... అనే అభిప్రాయాన్ని ఎక్కువమంది హౌజ్‌మేట్స్ వెలిబుచ్చారు. ఆ లెక్కన కౌశల్‌పై ఇంట్లో చాలా మంది నెగెటివ్‌గా ఉన్నారనేది స్పష్టమైంది. కాబట్టి సోమవారం జరగబోయే ఎలిమినేషన్ నామినేషన్లలో కౌశల్ పేరు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఇక ప్రతీవారం ఎలిమినేషన్ ఫేజ్‌లో ఉంటున్న గణేష్ ఈసారి కూడా నామినేట్ కావొచ్చన్నది మరో అభిప్రాయం. అయితే గణేష్‌కు ప్రేక్షకుల మద్దతు ఎలాగు ఉంటోంది. కాబట్టి మరోసారి గట్టెక్కే ఛాన్స్ ఉంది. ఒకవేళ కౌశల్ నామినేట్ అయితే మాత్రం ఎలా ఉండబోతోంది? ఆడియన్స్ అతనికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? అన్నదే ప్రశ్న.. ఏమో ఏమైనా జరుగొచ్చు..
Comments
Please login to add a commentAdd a comment