
బిగ్‌బాస్ హౌస్‌లో అనసూయ
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ గొడవలతో సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సృష్టించింది ఈ రియాల్టీ షో. ఆసక్తికర టాస్క్‌లు, సెలబ్రిటీల సడన్ ఎంట్రీలతో బిగ్‌బాస్ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నాడు. సోమవారం అంతా ఎలిమినేషన్ ప్రక్రియ.. ఇంటి సభ్యులపై అభిమానుల నెగటీవ్ కామెంట్స్.. వాటికి వారి సమాధానంతోనే సాగింది. ఇక ఎపిసోడ్ చివర్లో హౌస్‌లో పెళ్లి సందడి నెలకొందని హింట్ ఇస్తూ.. ఓ ప్రోమోతో బిగ్‌బాస్ ప్రేక్షకులను కట్టిపడేశారు.
అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ హౌస్‌లో సందడి చేస్తోంది. పెళ్లి సందడి టాస్క్‌లో భాగంగా ఆమె సెలబ్రిటీ హోదాలో ముఖ్య అతిథిగా హాజరైనట్లు అర్థమవుతోంది. సూయ..సూయ అనసూయ సాంగ్‌తో బిగ్‌బాస్ ఆమెకు ఘనస్వాగతం పలకగా.. ఇంటి సభ్యులు రెట్టించిన ఉత్సాహంతో అనసూయను రీసివ్ చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే నేటి ఎపిసోడ్‌లో రంగమ్మత్త అలరించనున్నారు. తుది అంకానికి చేరుకున్న ఈ రియాల్టీ షోకు మరో నాలుగు వారాలే మిగిలిఉంది. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేలా టాస్క్‌లు రూపొందిస్తున్నారు. ఆదివారం ఎపిసోడ్‌లో హీరో విజయ్ దేవరకొండతో గేమ్‌ను రక్తికట్టించిన విషయం తెలిసిందే.(మరిన్నీ బిగ్‌బాస్ ముచ్చట్లు)
చదవండి: దీప్తి ఎలిమినేషన్ ఖాయం!

ఇంటి సభ్యులతో రంగమ్మత్త
Comments
Please login to add a commentAdd a comment