![Nani Twitter Followers Reached Three Millions - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/12/nani1.jpg.webp?itok=VVcm5t8G)
తన సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే హీరో నేచురల్ స్టార్ నాని. పాత్ర ఎలాంటిదైనా సరే తన సహజత్వంతో ఆ క్యారెక్టర్‌ను పండించగల హీరో నాని. ప్రస్తుతం ఈ హీరో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఈ మధ్య నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్దం సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా ఈ సినిమాలో కృష్ణ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం నాని బిగ్‌బాస్ రెండో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
నాని సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటారు. అయితే తాజాగా తన ట్విటర్ ఫాలోవర్స్ మూడు మిలియన్లుకు చేరుకోవడంతో నాని ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ‘నా కుటుంబం మూడు మిలియన్లకు చేరుకుంద’ని ట్వీట్ చేశారు. నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు.
My family is now 3 million strong 😊
— Nani (@NameisNani) June 12, 2018
Comments
Please login to add a commentAdd a comment