
కమల్‌తో నాని
ఎన్నో ఇంటర్వ్యూల్లో తన అభిమాన హీరో అని చెప్పుకున్న నాని.. తను హోస్ట్ చేసే షోకు అతిథిగా రావడంతో..
సాక్షి, హైదరాబాద్ : న్యాచురల్ స్టార్, బిగ్‌బాస్ సీజన్ 2 హోస్ట్ నాని తన అభిమాన హీరోను కలిసాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘ఓ అభిమాని తన అభిమాన హీరోను కలుసుకున్నాడు.. జూనియర్ హోస్ట్.. సీనియర్ హోస్ట్‌ను కలిసాడు. అవును ఇది జరిగింది’ అనే క్యాప్షన్‌తో కమల్‌తో దిగిన ఫొటోలను షేర్ చేశాడు.
విశ్వరూపం 2 ప్రమోషన్స్‌లో భాగంగా కమల్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా హోస్ట్ నాని తన అభిమాన హీరోను కలిసాడు. ఎన్నో ఇంటర్వ్యూల్లో తన అభిమాన హీరో అని చెప్పుకున్న నాని.. తను హోస్ట్ చేసే షోకు అతిథిగా రావడంతో పులికించిపోయాడు. నిజానికి నాని శని, ఆదివారాల్లోని కనిపిస్తాడు. కానీ లోకనాయకుడి కోసం నాని ప్రత్యేకంగా బిగ్‌బాస్ సెట్‌కు హాజరయినట్లు తెలుస్తోంది. ప్రోమోలో సైతం లోకనాయకుడు.. భారతీయుడు హౌస్‌లోకి వస్తున్నాడని ఇంటి సభ్యులకు తెలియజేశాడు. ఇక తమిళ బిగ్‌బాస్‌కు కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Fan meets his Favourite actor .
— Nani (@NameisNani) August 3, 2018
Junior Host meets senior Host .
Yes ... This happened :)) pic.twitter.com/p5I6SF7tRf