
‘ఏమైనా జరగొచ్చు.. ఇంకొంచెం మసాలా’ అంటూ నాని చెప్పిన డైలాగ్‌లు నిజమవుతున్నట్టే కనిపిస్తోంది. తేజస్వీ, సామ్రాట్ మధ్య ఏదో జరుగుతోందని, తనీష్, దీప్తి సునయనల విషయంపై బిగ్‌బాస్ క్లాస్ పీకాడంటూ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో భాగంగా రక్తికడుతున్న నాటకం కూడా హైలెట్‌గా నిలిచింది. ఇంటి నియమాలను పాటించకుండా అందరి దగ్గరా నామినేషన్‌కు సంబంధించిన విషయాలను ప్రసంగిస్తోందంటూ గీతా మాధురిని బిగ్‌బాస్ జైల్లో వేయడం కూడా జరిగింది. ఈ వారానికి కౌశల్, గణేష్‌ను ఎక్కువ మంది ఇంటి సభ్యులు నామినేట్ చేయగా, శ్యామల, తేజస్వీ, బాబు గోగినేని, దీప్తి కూడా నామినేట్ అయ్యారు. నేడు బిగ్‌బాస్ హౌజ్‌ను ఇంకొంచెం స్పెషల్‌గా ఉంచేందుకు ఇంట్లోకి అతిథులు రాబోతున్నారు. ఈ అతిథులతో హౌజ్ అంతా సందడిగా మారబోతోంది.
నేడు (గురువారం) ప్రసారంకానున్న కార్యక్రమంలో తేజ్ టీమ్ సాయి ధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ పాల్గొనబోతున్నారు. వీరితో కలిసి హౌజ్‌మేట్స్ చేసే సందడి హైలెట్‌గా నిలవనుంది. తేజస్వీ.. ‘నా బర్త్‌డేకు కేక్ తీసుకురాలేదా బావా?’ అని అంటే.. తేజ్ ‘నేను రావడమే ఎక్కువ ఇంకా కేక్ కూడానా?’ అని బదులివ్వడం బాగానే పేలింది. సామ్రాట్‌ను ఉద్దేశించి... బౌలింగ్ కూడా బాగానే వేస్తున్నావట అని అనడం.. తనీష్‌ను ఉద్దేశించి వేసిన పంచ్‌లు వీడియోలో ఉన్నాయి. అనుపమా పాట పాడటం ఇలా ఈరోజంతా సరదాగా గడిచేట్టుంది బిగ్‌బాస్ ఇంట్లో.
Comments
Please login to add a commentAdd a comment