హైదరాబాద్: ఓటు వేయడం ద్వారా సంతృప్తి లభించడమే కాదు మనం ఓటు వేసిన నాయకుడు గెలిస్తే ఆ తృప్తి రెండింతలవుతుంది. మనం ఓటు వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధి పనులు చేయకపోతే ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. పని చేస్తే ప్రశంసించేందుకు అవకాశం దక్కుతుంది. దేశ భవిష్యత్ గురించి మన భవిష్యత్ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన నాయకులను మనమే ఎన్నుకున్నామన్న తృప్తి మిగలాలి.
ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు లభిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఓటు విషయంలో అందరూ ఒక్కటే. ప్రతి ఒక్కరూ లైన్‌లో నిలబడి తప్పనిసరిగా ఓటు వేయాలి. నేను ప్రతిసారీ ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకుంటాను.– కౌశల్, నటుడు, బిగ్‌బాస్– 2 విజేత
Comments
Please login to add a commentAdd a comment