శ్రీవారి ఆలయంలో దేవస్థానం ఉద్యోగితో సినీ నటుడు సామ్రాట్
పశ్చిమగోదావరి , ద్వారకాతిరుమల: సినీ నటుడు, బిగ్‌బాస్–2షో కంటెస్టెంట్ సామ్రాట్‌రెడ్డి బుధవారం చినవెంకన్న క్షేత్రాన్ని సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు సినిమాల్లో తాను హీరోగా, ప్రతినాయకుడిగా నటించానన్నారు. మూడు నెలలపాటు బిగ్‌బాస్ షోలో పాల్గొన్నట్టు చె ప్పారు. షో తనకు మరింత గుర్తింపును తేవడంతో పాటు జీవితంలో మలుపుగా నిలిచిందని చెప్పారు. సామ్రాట్‌తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు.
Comments
Please login to add a commentAdd a comment