Entha Manchivaadavuraa Movie Censor Report | Kalyan Ram - Sakshi
Sakshi News home page

పర్ఫెక్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌..!

Published Mon, Jan 6 2020 2:03 PM | Last Updated on Mon, Jan 6 2020 3:59 PM

Entha Manchivaadavuraa Sencor Compltes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కళ్యాణ్‌ రామ్, మెహరీన్‌ జంటగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్‌ అధినేత ఉమేష్‌ గుప్తా నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు ముగిశాయి. పర్ఫెక్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ‘క్లీన్‌ యూ’ సర్టిఫికేట్‌ లభించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.  సకుటుంబసపరివార సమేతంగా చూడదగ్గ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్‌, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మరింత ప్రమోషన్‌ కల్పించేందుకు బుధవారం (8వతేదీన) హైదరాబాద్‌ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతి బరిలో ఉన్న సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో ప్రమోషన్‌లో దూసుకుపోతూ ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ గెస్ట్‌గా ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తుండటంతో ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద బాగా కలిసివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమాకు రాజ్ తోట ఫోటోగ్రఫిని అందిస్తుస్తున్నారు. కళ్యాణ్ రామ్, మెహరీన్‌తోపాటు, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement