ఫుల్ రొమాన్స్... | Full Romance... | Sakshi
Sakshi News home page

ఫుల్ రొమాన్స్...

Published Thu, May 15 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

ఫుల్ రొమాన్స్...

ఫుల్ రొమాన్స్...

మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడకుండా, ప్రేమకథల వైపు ఎప్పుడైతే దష్టి సారించారో... అప్పట్నుంచీ నితిన్ కెరీర్ సూపర్‌స్పీడ్ అందుకుంది. వరుస విజయాలు ఆయన ఖాతాలో చేరుతున్నాయి. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్‌ఎటాక్... ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నారు నితిన్. త్వరలో రాబోతున్న ఆయన సినిమా.. ‘కొరియర్‌బోయ్ కల్యాణ్’ కూడా ప్రేమకథే కావడం గమనార్హం. ఇప్పుడు అదే ఊపుతో మరో ప్రేమకథకు పచ్చజెండా ఊపారు నితిన్. ప్రేమకథలు తీయడంలో సిద్ధహస్తునిగా పేరుగాంచిన కరుణాకరన్ దర్శకత్వంలో ఫుల్ రొమాన్స్ చేయబోతున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకరరెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలీవుడ్ కథానాయిక మిస్తీ ఇందులో హీరోయిన్. ఈ నెల 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంచనంగా జరుగనున్నాయి.

ఇష్క్, గుండెజారి... తర్వాత తాము నిర్మిస్తున్న మూడో సినిమా ఇదని, జూన్ 2న చిత్రీకరణ మొదలుపెట్టి మన దేశంలోనూ, విదేశాల్లోనూ చిత్రీకరణ జరుపుతామని, భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కనున్న ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కెమెరా: ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, కళ: రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌గౌడ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement