Mishti
-
‘కంగనా రియల్ డైరెక్టర్ కాదు’
మణికర్ణిక సినిమాపై విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్న చిత్ర నటీనటులు నుంచి మాత్రం విమర్శలే వినిపిస్తున్నాయి. దర్శకుడు క్రిష్.. కంగనా తీరుపై విరుచుకుపడ్డారు. సోనూ సూద్ పాత్రను తగ్గించాలన్న నిర్ణయం కంగనా తీసుకోవటం పాటు మరిన్ని మార్పులకు ఒత్తిడి చేయటంతోనే తాను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా క్రిష్ తెలిపారు. సోనూసూద్ కూడా తన పాత్రను ముందు చెప్పినట్టుగా తెరకెక్కించకపోవటంతోనే ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని తెలిపాడు. తాజా మణికర్ణిక సినిమాలో కీలక పాత్రలో నటించిన మిస్తీ చక్రవర్తి, కంగనా తీరుపై స్పందించారు. ‘క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తరువాత అబద్దాలు చెప్పి కంగనా, కమల్ జైన్‌ను నా డేట్స్ అడిగారు. సినిమాలో నీది కీలక పాత్ర సినిమా అంత నువ్ కనిపిస్తావు. అందుకే మరిన్ని డేట్స్ అవసరం పడ్డాయని చెప్పారు. కానీ క్రిష్ తీసిన సన్నివేశాలను కూడా కట్ చేసి, నా పాత్రను కొన్ని సీన్స్‌కే పరిమితం చేశార’ని తెలిపారు మిస్తీ. అంతేకాదు కంగనా తన పాత్రను మరింతగా ఎలివేట్ చేసేందుకు ఇతర పాత్రల నిడివిని తగ్గించారని ఆరోపించారు. అంతేకాదు కంగనా నిజమైన డైరెక్టర్ కాదని, డైరెక్టర్ తన సినిమాలో ప్రతీ పాత్రను ప్రేమిస్తారని.. కానీ కంగనా కేవలం తన పాత్రను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాలో మార్పులు చేశారని తెలిపారు. -
‘శరభ’ మూవీ రివ్యూ
టైటిల్ : శరభ జానర్ : సోషియో ఫాంటసీ తారాగణం : ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి, జయప్రధ, నెపోలియన్, పొన్వన్నన్ సంగీతం : కోటి దర్శకత్వం : ఎన్. నరసింహారావు నిర్మాత : అశ్వనీ కుమార్ సహదేవ్ ఒకప్పుడు టాలీవుడ్లో సోషియో ఫాంటసీల ట్రెండ్ బాగా కనిపించేది. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు పెద్దగా రాలేదు. దీంతో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన శరభ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జయప్రధ లాంటి సీనియర్ నటి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం కూడా శరభకు కలిసొచ్చింది. మరి ఆ అంచనాలను శరభ అందుకుందా..? ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ కుమార్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? జయప్రధ రీ ఎంట్రీలో సత్తా చాటారా..? కథ ; శరభ (ఆకాష్ కుమార్) సిరిగిరిపురంలో సరదాగా కాలం వెల్లదీసే అల్లరి కుర్రాడు. కొడుకే ప్రాణంగా బతికే పార్వతమ్మ (జయప్రధ) ఎన్ని తప్పులు చేసినా శరభను ఒక్క మాట కూడా అనదు. దివ్య (మిస్తీ చక్రవర్తి) సెంట్రల్ మినిస్టర్(షియాజీ షిండే) కూతురు. తన జాతక దోశాలకు సంబంధించిన శాంతి కోసం మినిస్టర్ తన కూతురిని సిరిగిరిపురంలోని గురువు (పొన్వన్నన్) గారి దగ్గర విడిపెట్టి వెళతాడు. గురువుగారు దివ్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతను శరభ, పార్వతమ్మలకు అప్పగిస్తాడు. చిన్న గొడవతో ప్రారంభమైన దివ్య, శరభల పరిచయం తరువాత ప్రేమగా మారుతుంది. అదే సమయంలో దివ్య ప్రమాదంలో ఉందని తెలుస్తోంది. 17 మంది అమ్మాయిలను బలి ఇచ్చిన ఓ రాక్షసుడు 18వ బలి కోసం దివ్యను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే సమయంలో శరభ గతానికి సంబంధించిన ఓ విషయం తెలుస్తుంది. అసలు శరభ గతం ఏంటి..? ఆ రాక్షసుడు దివ్యను ఎందుకు బలి ఇవ్వాలనుకున్నాడు..? రాక్షసుడితో శరభ చేసే పోరాటంలో దైవ శక్తి ఎలా సహాయపడింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హీరో ఆకాష్ కుమార్ మెప్పించలేకపోయాడు. యాక్షన్ సీన్స్‌లో పరవాలేదనిపంచినా నటన పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. హీరోయిన్ మిస్తీ చక్రవర్తి తన పరిధి మేరకు పరవాలేదనిపించింది. ఇక పార్వతమ్మ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చిన జయప్రధ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. హీరో తల్లిగా హుందాగా కనిపించారు. చాల కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన పునీత్ ఇస్సార్, నెపోలియన్లను తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇతర పాత్రల్లో నాజర్, పొన్వన్నన్, చరణ్ దీప్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; చాలా కాలం తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ సోషియో ఫాంటసీ కథను తీసుకువచ్చిన దర్శకుడు ఎన్ నరసింహారావు మెప్పించలేకపోయారు. సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో ప్రారంభించినా.. తొలి భాగం అంతా టైంపాస్ సన్నివేశాలతో లాగించేశారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లు మధ్య వచ్చే సన్నివేశాలు బోర్‌కొట్టిస్తాయి. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మేకప్, గ్రాఫిక్స్ కీలకం. కానీ ఆ రెండు విషయాల్లో శరభ నిరాశపరుస్తుంది. క్లైమాక్స్‌లో నరసింహా స్వామి స్వయంగా వచ్చి రాక్షసున్ని అంతం చేసే సీన్ బాగుంది. సంగీతం కూడా ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; జయప్రధ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్ ; కథనం ఫస్ట్ హాఫ్ సంగీతం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
దేవుడు మనతోనే ఉంటాడు
‘ఫైర్ ఉన్న నాలాంటి కుర్రాడితో పెట్టుకోకు..బాడీ మార్చురీలో ఉంటుంది. దేవుడికే దెయ్యం పట్టిస్తే సృష్టి సర్వనాశనం అవుతుంది. వెళ్లేదారి మంచిదైతే దేవుడు కూడా మనతో వస్తాడు. గమ్యం చేరేదాకా ఆయన మనతోనే ఉంటాడు’ వంటి డైలాగ్స్ ‘శరభ’ చిత్రంపై ఆసక్తి పెంచుతున్నాయి. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా రూపొందిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘శరభ’. జయప్రద, నెపోలియన్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఏ.కె.ఎస్. ఎంటర్టైన్మెంట్ పతాకంపై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నారు. అశ్వనీకుమార్ సహదేవ్ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అవుట్‌పుట్ బాగా వచ్చింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ చేసిన ప్రోస్థటిక్ మేకప్, సీజీ వర్క్ ప్రత్యేక ఆకర్షణలు. చిరంజీవిగారు ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి, ‘దిల్’ రాజుగారు రిలీజ్ చేసిన టీజర్‌కి భారీ స్పందన లభించింది. కోటిగారి సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ఒక కొత్త డైరెక్టర్, కొత్త హీరో కాంబినేషన్లో రూపొందిన మా చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం’’ అన్నారు. పునీత్ ఇస్సార్, తనికెళ్ల, ఎల్.బి.శ్రీరామ్, సాయాజీ షిండే, పృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రమణ సాల్వ. -
చిన్నదాన నీ కోసం మూవీ స్టిల్స్
-
చిన్న దాన నీకోసం మూవీ స్టిల్స్
-
నితిన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం
-
ముంబయ్ భామతో ప్రేమాయణం
ప్రేమకథా చిత్రాలకు నప్పే హీరో నితిన్. ప్రేమకథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే నైపుణ్యం ఉన్న దర్శకుడు కరుణాకరన్. ఈ ఇద్దరి కలయికలో ఓ సినిమా వస్తే.. అది కూడా వారి తరహా ప్రేమకథా చిత్రమైతే?... చెప్పడానికేముంటుంది? ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టే సినిమా ఇస్తారని చెప్పొచ్చు. ఈ కాంబినేషన్లో శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న సినిమా బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. నితిన్‌తో ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’వంటి రెండు విజయవంతమైన చిత్రాల తర్వాత ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. నిఖితారెడ్డి, సుధాకర్‌రెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్‌గౌడ్ సమర్పకుడు. బాలీవుడ్ భామ మిస్తీ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి సదానంద్ గౌడ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత రామ్మోహన్ రావు క్లాప్ ఇచ్చారు. వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. వచ్చే నెల 2న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, ఇక్కడే కాకుండా విదేశాల్లోనూ షూటింగ్ చేయనున్నామని నిఖితారెడ్డి తెలిపారు. -
ఫుల్ రొమాన్స్...
మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడకుండా, ప్రేమకథల వైపు ఎప్పుడైతే దష్టి సారించారో... అప్పట్నుంచీ నితిన్ కెరీర్ సూపర్స్పీడ్ అందుకుంది. వరుస విజయాలు ఆయన ఖాతాలో చేరుతున్నాయి. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ఎటాక్... ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నారు నితిన్. త్వరలో రాబోతున్న ఆయన సినిమా.. ‘కొరియర్‌బోయ్ కల్యాణ్’ కూడా ప్రేమకథే కావడం గమనార్హం. ఇప్పుడు అదే ఊపుతో మరో ప్రేమకథకు పచ్చజెండా ఊపారు నితిన్. ప్రేమకథలు తీయడంలో సిద్ధహస్తునిగా పేరుగాంచిన కరుణాకరన్ దర్శకత్వంలో ఫుల్ రొమాన్స్ చేయబోతున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకరరెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలీవుడ్ కథానాయిక మిస్తీ ఇందులో హీరోయిన్. ఈ నెల 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంచనంగా జరుగనున్నాయి. ఇష్క్, గుండెజారి... తర్వాత తాము నిర్మిస్తున్న మూడో సినిమా ఇదని, జూన్ 2న చిత్రీకరణ మొదలుపెట్టి మన దేశంలోనూ, విదేశాల్లోనూ చిత్రీకరణ జరుపుతామని, భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కనున్న ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కెమెరా: ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, కళ: రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌గౌడ్. -
ఒక కొత్తమ్మాయి ఒక పాత సెంటిమెంటు!
కొత్త ముఖం తాను కొత్తగా పరిచయం చేసే కథానాయికలకు ‘యం’తో మొదలయ్యే పేర్లు పెట్టడం డెరైక్టర్ సుభాష్ ఘయ్‌కు ఉన్న సెంటిమెంట్. ‘కాంచి’ సినిమా కథానాయిక అసలు పేరు ఇంద్రాణి చక్రవర్తి. అయితే ఆమె పేరును తన సెంటిమెంట్ ప్రకారం ‘మిస్తి’గా మార్చాడు. ‘యం’ సెంటిమెంట్ ఏమిటి? అని అడిగితే- ‘యం’ ఫర్ మదర్... స్త్రీ అంటే తల్లితో సమానం... అంటాడు ఘయ్. మిస్తి అనే పేరేమిటి? కాస్త విచిత్రంగా ఉంది... అనేకదా మీ డౌటు? అసలు విషయం ఏమిటంటే, ఇంద్రాణి నిక్‌నేమ్ ‘మిస్తి’! ఎలాగూ ఈ పేరు ‘యం’తో మొదలవుతుంది కాబట్టి నిక్ నేమ్‌నే అసలు పేరు చేశాడు సుభాష్ ఘయ్. ఘయ్ సెంటిమెంట్ గోల పక్కన పెడదాం. ఇంతకీ ఇంద్రాణి తన ‘స్క్రీన్ నేమ్’ మీద సంతృప్తిగా ఉందా? ఆమె ఇలా అంటుంది- ‘‘నా పేరు ఇంద్రాణి అనే విషయం చాలామందికి తెలియదు తెలుసా! నేను మిస్తిగానే అందరికి తెలుసు’’ (బాప్రే!) ‘కాంచి’ సినిమాకు అనూహ్యమైన స్పందన ఏమీ రాలేదు. ‘పాత సీసాలో కొత్త హీరోయిన్’ అని కొందరు వెక్కిరించారు. మిస్తి నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ సినిమా అనుకున్నంత విజయమేమీ సాధించలేదు. ‘‘సినిమా సూపర్ హిట్ కాలేదు కదా. మరి మీకు అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారా?’’ అని అడిగితే- ‘‘అదేమీ లేదు. మూడు సినిమాలు ఇప్పటికే ఒప్పుకున్నాను’’ అంటుంది. ‘‘వాటి వివరాలు చెబుతారా?’’ అని అడిగితే- ‘‘పూర్తి వివరాలు త్వరలోనే’’ అని అంటుంది మాటలు నేర్చిన మిస్తి! -
కాంచీ విడుదలకు తొందరేం లేదు: సుభాష్ ఘాయ్
తన దర్శకత్వంలో రూపుదిద్దుకోంటున్న 'కాంచీ' చిత్రం విడుదలకు అంత తొందర ఏమి లేదని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ వెల్లడించారు. కాంచీ చిత్రాన్ని తగినంత సమయం తీసుకుని విడుదల చేస్తానని ఆయన తెలిపారు. ఆ చిత్ర నిర్మాణంలో మహాబీజిగా ఉన్న ఆయన కాసంత విరామం సమయంలో విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. కాంచీ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుందని తెలిపారు. అలా అని షూటింగ్ పూర్తి అయిన వెంటనే విడుదల చేయనన్నారు. సినిమా చిత్రీకరణ ఓ సారి పూర్తి అయితే ఎప్పుడు విడుదల చేద్దామా అనే ఆలోచన అతనకు ఉంటుందన్నారు. అయితే ఈ సారి అలా కాకుండా సరైన సమయంలో కాంచీ విడుదల చేస్తానన్నారు. తన దర్శకత్వంలో ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన యువరాజ్ చిత్రంలా అరిబరీగా తీసి మళ్లీ చేతులు కాల్చుకోనే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. యువరాజ్ చిత్రాన్ని ఒడిలోపెట్టన దడిలో పెట్టన అన్న రీతిలో తీసి ఆగమేఘాలపై విడుదల చేశానని సుభాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ చిత్రం తనకు ఓ గుణపాఠం అని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే ఆ చిత్రంతో తనకు జ్ఞానోదయం అయిందని వివరించారు. అలాంటి తప్పులు మరల జీవితంలో చేయకుడదని ఓ నిర్ణయం తీసుకున్నట్లు సుభాష్ ఘాయ్ వివరించారు. కార్తీక్ తివారీ, నూతన నాయక మిస్తి ప్రధాన తారాగణంగా కాంచీ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రంలో రిషి కపూర్, మిథున్ చక్రవర్తులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.