రాజాకన్ను సతీమణికి లారెన్స్‌ ఆర్థికసాయం  | Raghava Lawrence Helping Hand Real Life Wife Jai Bhim Rajakannu | Sakshi
Sakshi News home page

రాజాకన్ను సతీమణికి లారెన్స్‌ ఆర్థికసాయం 

Published Wed, Nov 17 2021 7:38 AM | Last Updated on Wed, Nov 17 2021 7:40 AM

Raghava Lawrence Helping Hand Real Life Wife Jai Bhim Rajakannu - Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): రాజాకన్ను భార్య పార్వతమ్మకు నృత్య దర్శకుడు, నటుడు రాఘవలారెన్స్‌ ఆర్థిక సాయం చేశారు. సూర్య కథానాయకుడిగా నటించి నిర్మించిన చిత్రం జై భీమ్‌. పోలీసుల దాష్టీకానికి బలైపోయిన రాజాకన్ను సతీమణి పార్వతమ్మ ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఆమె కడు పేదరికంలో జీవిస్తున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న రాఘవ లారెన్స్‌ ఆమెకు ఇల్లు కట్టిస్తానని ఇటీవల ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

సోమవారం పార్వతమ్మను కలిసి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్వతమ్మతో మాట్లాడుతూ.. తన బామ్మ మాదిరిగానే ఉన్నావని, ఆమె ఇప్పుడు లేదు కనుక తన రూపాన్ని మీలో చూసుకుంటున్నానంటూ పార్వతమ్మ కాళ్లకు నమస్కారం చేసి ఆశీస్సులు అందుకున్నారు. కాగా రాఘవ లారెన్స్‌ పార్వతమ్మని కలిసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement