హీరో, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనాతో బాధపడుతున్న ఓ గర్భిణికి తన వంతు సాయం చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. డెలివరీ స్టేజ్‌లో ఉన్న తన భార్య ఇబ్బందులు పడుతోందని ఆమె భర్త లారెన్స్ సాయం కోరాడు. దీనికి వెంటనే స్పందించిన లారెన్స్ తమిళనాడు ఆరోగ్య మంత్రి పీఏతో మాట్లాడి ఆ గర్భిణికి సాయం చేయమని కోరాడు. వెంటనే రంగంలోకి దిగిన వైద్య సిబ్బంది.. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు.
ఆమెకి కరోనా ఉండటంతో వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకొని ఆపరేషన్ చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్ననిచ్చింది. ఈ సందర్భంగా గర్భిణికి ఆపరేషన్ చేసి కాపాడిన వైద్యసిబ్బందికి లారెన్స్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. చిన్నారి ఆరోగ్యంగా ఉందని.. తల్లి చికిత్సలో ఉందన్నాడు. ఇక లారెన్స్ సాయానికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాఘవ నువ్వు రియల్ హీరోవి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక కరోనా క్రైసిస్‌లో లారెన్స్ రూ. 3కోట్ల భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి:
‘రిషి కపూర్ చివరి చిత్రం పూర్తిచేస్తాం’
నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా..
Comments
Please login to add a commentAdd a comment