rachamallu
-
ఇది ప్రజలను ముంచే బడ్జెట్: రాచమల్లు
-
రాత్రి మారేలోపు జెండా మార్చేసావ్ ఆ మాట అనడానికి నోరెలావచ్చింది నీకు..?
-
రాజాకన్ను సతీమణికి లారెన్స్ ఆర్థికసాయం
సాక్షి, చెన్నై(తమిళనాడు): రాజాకన్ను భార్య పార్వతమ్మకు నృత్య దర్శకుడు, నటుడు రాఘవలారెన్స్ ఆర్థిక సాయం చేశారు. సూర్య కథానాయకుడిగా నటించి నిర్మించిన చిత్రం జై భీమ్. పోలీసుల దాష్టీకానికి బలైపోయిన రాజాకన్ను సతీమణి పార్వతమ్మ ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఆమె కడు పేదరికంలో జీవిస్తున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న రాఘవ లారెన్స్ ఆమెకు ఇల్లు కట్టిస్తానని ఇటీవల ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. సోమవారం పార్వతమ్మను కలిసి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్వతమ్మతో మాట్లాడుతూ.. తన బామ్మ మాదిరిగానే ఉన్నావని, ఆమె ఇప్పుడు లేదు కనుక తన రూపాన్ని మీలో చూసుకుంటున్నానంటూ పార్వతమ్మ కాళ్లకు నమస్కారం చేసి ఆశీస్సులు అందుకున్నారు. కాగా రాఘవ లారెన్స్ పార్వతమ్మని కలిసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
శానిటైజర్లు పంపిణీ చేసిన రాచమల్లు
-
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నరు
-
వైఎస్ఆర్ అంటేనే ఓ ప్రేమ మత్తు..
గుంటూరు: తనకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా పరిచయం చేసుకునే కన్నా... వైఎస్ఆర్ అభిమానిని అని చెప్పుకోవడమే గర్వంగా ఉంటుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ అనే పదం హృదయం అంచుల నుంచి బయటకు వస్తుంటే ప్రేమ మత్తు కలుగుతుందన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు వచ్చినప్పుడు ఆయన పంచెకట్టును సవరించుకుంటూ నడుస్తూ ఉన్న దృశ్యం ఈనాటికి మర్చిలేనిదన్నారు. అంత గొప్ప నాయకుడిని చూసిన కళ్లతో నక్కలాంటి ముఖ్యమంత్రిని చూడాలంటే బాధ అవుతోందన్నారు. తమ పార్టీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధంపు హామీలతో అధికారంలోకి వచ్చారని చెబుతున్నారని... అయితే చంద్రబాబు నిజం చెబితే విచిత్రం...అబద్ధం చెప్తే వింతేమీ లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తనకు ఓ సామెత గుర్తుకు వస్తోందని సిద్ధయ్య కంటే గొప్ప శిష్యుడు.. బ్రహ్మంగారింతటి గురువు.. వేమన్న అంతటి గొప్ప కవి లేరన్నట్లుగా... చంద్రబాబు అంతటి అబద్ధాల కోరు లేరని రాచమల్లు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్న అందరం కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామాన్ని మాఫియాగా మార్చారు.. గతంలో మాఫియా అంటే ముంబాయి గుర్తొచ్చేదని, అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలోనూ టీడీపీ మాఫియాను తయారు చేస్తున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మట్టి నుంచి ఇసుక వరకు అంతా దోచుకుంటూ ముఠా రాజకీయాలు చేస్తున్నారని, జన్మభూమి కమిటాలు గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నాయని, పోలవరం ప్రాజెక్ట్ నుంచి రాజధాని వరకు అంతా అవినీతే అని అన్నారు. అందరం పోరాడి పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామన్నారు. చంద్రబాబు కార్మిక ద్రోహి చంద్రబాబు కార్మిక ద్రోహి అని వైఎస్ఆర్ సీపీ ట్రెడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. ప్లీనరీలో కార్మిక సమస్యలపై పలు తీర్మానాలను గౌతంరెడ్డి ప్రవేశపెట్టగా, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆమోదం తెలిపారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు వాళ్ల మజ్జిగను అమ్ముకోవడానికి తమ పొట్ట గొడుతున్నారన్నారు. నష్టాల్లో ఉందంటూ ఆర్టీసీని ప్రవేట్ పరం చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియ వాస్తవాలు గ్రహించాలి రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని, ఎల్లో మీడియా వాస్తవాలు గ్రహించాలని ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు అన్నారు. ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పూర్తిగా అవినీతి పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 600 హామీలు ఇచ్చారని, ఆ హామీలు విస్మరించారన్నారు. ఇలాంటి నాయకుడు దేశంలోనే ఉండరన్నారు. ప్రజా సమస్యలతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వైఎస్ జగన్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే..ఎల్లో మీడియా, టీడీపీ నేతలు విమర్శిస్తున్నారన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, అనేక ప్రాంతాల్లో కరువు విలయ తాండవం చేస్తోందన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు ప్రచురించి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుందామని కొరుముట్ల శ్రీనివాసులు కోరారు. చదవండి: నాయకుడంటే ప్రజల గుండె చప్పుడు: వైఎస్ విజయమ్మ మాట తప్పడం మా రక్తంలో లేదు: వైఎస్ షర్మిల 'వచ్చే ఎన్నికల్లో బాబుకు ఒకటి, పప్పుకొకటి' ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేసిన వైఎస్ జగన్ ఎన్టీఆర్తోనే చంద్రబాబు హత్యా రాజకీయాలు 'ప్రతి ఇంటికి పెద్ద కొడుకు వైఎస్ జగన్' -
ఇసుక రీచ్‌లు..దేవగుడి, పోట్లదుర్తి నేతలకేనా?
ప్రొద్దుటూరు: ‘దేవగుడితోపాటు చుట్టుపక్కల పలు క్వారీలు మంజూరు చేశారు.. మరోవైపు నంగనూరుపల్లె క్వారీని పోట్లదుర్తి నేతలు ఆక్రమించుకున్నా రు.. ఇసుక క్వారీలు దేవగుడి, పోట్లదుర్తి అధికార పార్టీ నేతలకేనా?’ అని ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన పలు వురు ట్రాక్టర్ల యజమానులు మంగళవారం ఆందోళనకు దిగారు. అటు నం గనూరుపల్లె క్వారీ, ఇటు దేవగుడి క్వా రీలకు వెళ్లేందుకు తమను అనుమతిం చకపోవడంతో నిరసన వ్యక్తం చేసిన ట్రాక్టర్ యజమానులు ఉదయాన్నే జమ్మలమడుగు రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద దేవగుడి ప్రాంతం నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా వెళ్లి ఇసుక తెచ్చుకునే వీలుండగా మంత్రి ఆది నారాయణరెడ్డి అనుచరులమంటూ తమను రానివ్వడం లేదని, వెళ్లిన వారి పై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ప్రాంతానికి చెం దిన ట్రాక్టర్లను దేవగుడి ప్రాంతానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నప్పుడు, అక్కడి ట్రాక్టర్లను తాము పట్టణంలోకి ఎలా అనుమతిస్తామని అడ్డుకున్నారు. వారి కారణంగా తామంతా జీవనోపాధి కోల్పోయామని పేర్కొన్నారు. చాలా రోజులుగా ఇదే పరిస్థితి ఉందన్నారు. వ్యాపారకేంద్రమైన ప్రొద్దుటూరుకు ఇసుక అవసరం తప్పనిసరని, అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ క్వారీలు లేకుండా చేశారని ఆరోపించారు. ప్రొద్దుటూరుకు ప్రత్యేకంగా క్వారీలు ఉంటే బయటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇసుకకు డిమాండ్ ఉండదని, ఇక్కడ క్వారీ లేకుండా చేశారని చెప్పారు. రోజూ దేవగుడి ప్రాంతం నుంచి వెయ్యి ట్రాక్టర్ల ఇసుక వస్తోందన్నారు. పైగా జియోట్యాగ్ లేకుండానే ఇసుక రవాణా అవుతున్నా అధికారులు పట్టించుకోకుండా వదిలేశారని చెప్పారు. ప్రొద్దుటూరు మండలంలోని శంకరా పురంలో ఇసుక క్వారీ ఉన్నప్పుడు దేవగుడి, పోట్లదుర్తి తదితర ప్రాంతాల వారంతా యథేచ్ఛగా ఇసుకను తీసుకెళ్లారని, అలాంటప్పుడు తమకు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. భూపేష్ ట్రాక్టర్‌ను అడ్డుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు మంత్రి ఆది కుటుంబానికి చెందిన భూపేష్ పేరుతో ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను స్థానికులు అడ్డుకున్నారు. తమకొక న్యాయం, వారికొక న్యాయం ఏమిటని ట్రాక్టర్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈలోపే అధికారపార్టీ నుంచి ఫోన్లు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్‌తోపాటు సిబ్బంది వెంటనే వైఎస్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఎవరు ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారని స్థానికులపై లాఠీచార్జి చేసేందుకు ప్రయత్నించారు. ఎస్ఐ వేగాన్ని గమనించిన ఆందోళనకారులు అక్కడి నుంచి పక్కకువెళ్లారు. నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న క్వారీ నుంచి ఇసుక తీసుకొస్తున్నారని, అలాంటప్పుడు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయడానికి వీలు లేదని ఎస్ఐ తెలిపారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. భయాందోళనకు గురైన ట్రాక్టర్ యజమానులు సమస్య తీవ్రతను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఇంటికి వెళ్లి తెలిపారు. -
దమ్ముంటే.. రాజీనామా చేయండి
ప్రొద్దుటూరు: దమ్ము, ధైర్యం ఉంటే జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సవాల్ విసిరారు. ఈ రెండు స్థానాల్లో అధికార పార్టీ నేతలు గెలిస్తే 2019 ఎన్నికల్లో జిల్లాలో తాము పోటీ చేయబోమని పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని టీడీపీ నేతలు ప్రకటించారన్నారు. అలాగే పులివెందుల నియోజకవర్గంలో గెలుస్తామని సతీష్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని మార్లు పోటీ పెట్టి ఓడిపోయారో ప్రజలకు తెలియంది కాదని పేర్కొన్నారు. ఓడిపోయిన వరద, లింగారెడ్డిలకు మాట్లాడే అర్హత లేదన్నారు. సంస్కార హీనంగా మాట్లాడటం తగదు: వివేకానందరెడ్డి తమ పార్టీలోకి వస్తే పదవి ఇస్తామని టీడీపీ నేతలు సంస్కార హీనంగా మాట్లాడటం తగదని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కోడ్ ఇచ్చి, వారిని భయభ్రాంతులకు గురి చేసి, బెదిరించి విజయం సాధించారన్నారు. సినీ గ్లామర్ ఉన్న ఎన్టీ రామారావు లాంటి నాయకుడే చిత్తరంజన్‌దాసు చేతిలో ఓటమి పాలయ్యారని, అలాగే గుడివాడలో కటారి ఈశ్వర్ కుమార్ చేతిలో ఓడిపోయారన్నారు. ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీకి కూడా ఓటమి తప్పలేదన్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల్లో అధికార పార్టీ ఘోర వైఫల్యాన్ని చవిచూస్తోందన్నారు. విద్యావంతులు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ డబ్బు పెట్టాడు: రాయచోటి ప్రాంతంలో ఒక ఎర్రచందనం స్మగ్లర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రూ.8 కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు చిలేకాంపల్లి యామిని, శివకుమార్ యాదవ్, టప్పా గైబుసాహెబ్తోపాటు చిన్నరాజు, రాజుపాళెం మండల కన్వీనర్ నారాయణరెడ్డి, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు షేక్షావలి తదితరులు పాల్గొన్నారు. -
కుట్రకు – వైఎస్ అభిమానానికి మధ్య పోటీ
ప్రొద్దుటూరు టౌన్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కుట్రకు – వైఎస్ అభిమానానికి మధ్య పోటీ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల దగ్గరపడుతున్న తరుణంలో పార్టీ గుర్తులు ఉండవని తెలిపారు. అభ్యర్థి యెక్క గుణగణాలను పరిశీలించి కుటుంబ రాజకీయ చరిత్రలో విలువలను, శాంతి స్వభావం, వంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఓటు వేయాల్సిన ప్రజా ప్రతినిధులందరూ ఆత్మప్రభోదానుసారం వ్యవహరించాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి మసిపూసి అవమానం చేయాలనే తీవ్రమైన సంకల్పంతో పని చేసే దుష్టశక్తులను మీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. ఆ కుటుంబానికి అవమానం చేయాలని చూస్తున్న ఆదినారాయణరెడ్డికి మసి పూయాలన్నారు. నాదృష్టిలో ఈ పోటీ కుట్రకు, వైఎస్ అభిమానానికి జరుగుతోందన్నారు. వైఎస్‌ను అభిమానించే వారు ఈనెల 17న గుణపాఠం నేర్పాలన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గెలుపు జిల్లా ప్రయోజనాలు, అభివృద్ధికి ముడిపడి ఉందన్నారు. మొన్న 100 మంది మెజార్టీ ఉన్నారని ప్రకటించి నిన్న 60 ఓట్లు ఎక్కువని, నేడు మ్యాజిక్ ఫిగర్ ఉందని, రేపు ఓడిపోయాం వైఎస్ అభిమానమే గెలిచిందని టీడీపీ నేతలే చెబుతారన్నారు. మ్యాజిక్ ఫిగర్ అంటే గెలుపు ఖాయం కాలేదని అర్థమని పేర్కొన్నారు. వైఎస్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఆది ఎన్నటికీ ఆయన రుణం తీర్చుకోలేడన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు. -
హోదా కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలి
-
రాజకీయం.. వ్యాపారం కాదు
ప్రొద్దుటూరు: రాజకీయం వ్యాపారం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, సినీనటి ఆర్.కె.రోజా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం దొరసానిపల్లె జెడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేదవారి కోసం చేపట్టిన చేయూత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నానన్నారు. అయితే నేడు చాలా మంది దోచుకునేందుకు, దోచుకున్నది దాచుకునేందుకు సేవ పేరుతో రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. ప్రజలను అభిమానించే, ప్రజా సమస్యలపై స్పందించే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి లాంటి నాయకుడు ఉండటం ప్రొద్దుటూరు ప్రజల అదృష్టమని తెలిపారు. డబ్బు సంపాదించుకునేందుకు ఇతర మార్గాలు ఉన్నాయని, ఇందు కోసం రాజకీయాల్లోకి వస్తుండటం దురదృష్టకరమన్నారు. ‘ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న సూక్తిని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. శ్రీకృష్ణ భగవానుడు, అల్లా, ఏసు అందరూ తోటి వారికి సాయం అందించాలని చెప్పారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి షేర్ ఆటోలు, బస్సుల్లో వస్తున్న బాలికల ఇబ్బందులను గుర్తించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వారికి 47 సైకిళ్లు కొని ఇవ్వడం చాలా మంచి నిర్ణయమని తెలిపారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు కూడా రక్షణ కరువయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. బయటికి వెళ్లిన మహిళలు ఇంటికి వస్తారో లేదోనని ఆందోళన చెందే పరిస్థితి ఉందన్నారు. బాబు వస్తే జాబు వస్తాదని ఇలా ఎన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రజలను వంచించాడన్నారు. పేదల సమస్యలపై నా హృదయం చలించింది – ఎమ్మెల్యే రాచమల్లు గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించినప్పుడు పేదల సమస్యలు అనేకం తన దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. వారి సమస్యలను చూసి తన హృదయం స్పందించిందని తెలిపారు. భర్త మరణించడంతో దిక్కులేని కుటుంబం, గూడు మిద్దెలో 23 మంది కుటుంబ సభ్యులు కలిసి ఉంటున్న సమస్య, విద్యుత్ షాక్‌తో మృతి చెందిన వ్యక్తి కుటుంబం రోడ్డున పడటం, తండ్రి మృతితో అనాథ అయిన కుటుంబం, బోన్ క్యాన్సర్‌తో బాధపడుతూ వైద్యం కోసం ఎదురుచూస్తుండటం ఇలా అనేక సమస్యలను చూసి తాను ఎంతగానో చలించిపోయానన్నారు. ప్రభుత్వం సాయం చేయకపోవడంతో వీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఈ సమస్యలను కూడా ఏరోజుకారోజు ఇంటికి వెళ్లిన తర్వాత తన సతీమణితో కలిసి చర్చించేవాడినని పేర్కొన్నారు. సమస్యలను చూసి స్పందించే హృదయం ఉండాలేకానీ వీరిని ఆదుకోవడానికి డబ్బే ప్రధానం కాదన్నారు. గత 25 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెట్టింది లేదన్నారు. రాజుపాళెం మండలం కుమ్మరపల్లె గ్రామానికి చెందిన నాయీ బ్రాహ్మణ దంపతులకు పుట్టిన ఇద్దరు సంతానం గత ఏడాది కేసీ కెనాల్లో పడి చనిపోయారన్నారు. తిరిగి ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో ఆ కుటుంబం భవిష్యత్తు దృష్ట్యా టెస్ట్‌ట్యూబ్ బేబి పద్ధతిలో సంతానం పొందేందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దొరసానిపల్లె జెడ్పీహైస్కూల్లో చదువుతున్న బాలికలకు 47 సైకిళ్లను కొనివ్వడంతోపాటు మొత్తం రూ.25లక్షల వ్యయంతో 11 రకాల సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపట్టారు. -
మార్షల్స్ మాపై దాడి చేస్తారా..?