![Prakash Raj Respond On Controversy Scene In Jai Bhim Movie - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/7/jai-bhim-scene.jpg.webp?itok=0zce_Gkl)
తమిళ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజాగా చిత్రం ‘జైభీమ్’. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీకీ చెందిన సెలెబ్రిటీలందరూ ఈ సినిమాని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో తమ స్పందనను తెలుపుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం పోలీసులు కొన్ని కులాలకి చెందిన నిరుపేద ప్రజలని ఎలా టార్గెట్ చేసి హింసించేవారనేది ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడంటూ దర్శకుడు జ్ఞానవేల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ సినిమాలో వచ్చిన ఓ చెంపదెబ్బ సీన్ వివాదంగా మారింది.
(చదవండి: Jai Bhim: ఎవరీ జస్టిస్ చంద్రు? జై భీమ్ మూవీతో ఆయనకేం సంబంధం?)
ఓ సీన్‌లో హిందీ మాట్లాడుతున్న వ్యక్తిని ప్రకాష్‌రాజ్ చెంపదెబ్బ కొడతాడు. విచారణలో భాగంగా పోలీసు అధికారిగా నటించిన ప్రకాశ్ రాజ్ అలా కొడతాడు. అయితే 'ఇది హిందీ భాషని అవమానించడమే' అంటూ కొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ప్రకాశ్ రాజ్‌స్పందించాడు. ‘జై భీమ్ సినిమాలో అణగారిన వర్గాల బాధని, వాళ్లు పడే కష్టాన్ని చూపించాం. కానీ కొంతమంది అసలు విషయాన్ని మరిచి.. చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు’అని ప్రకాశ్ రాజ్ ట్విట్ చేశాడు. నేను నటించాననే కారణంతో ఈ సినిమాను వివాదంలోకి లాగుతున్నారు. ఇలాంటి వివాదాలపై స్పందించడం అర్థం లేదు’అని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment