
సాక్షి, చెన్నై: జై భీమ్ చిత్రంలో సూర్య నటనకు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జ్యోతిక, సూర్య తమ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని టి.జె. జ్ఞానవేల్ తెరకెక్కించారు. పోలీసులు, రాజకీయ నాయకుల అరాచకాలకు గురవుతున్న కొండ జాతి ప్రజలకు అండగా నిలిచే న్యాయవాది పాత్రలో సూర్య నటించారు. ఈ చిత్రం మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్ టైంలో స్ట్రీమింగ్ అవుతోంది. చిత్రం చూసిన ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కొండజాతి ప్రజల జీవన విధానాన్ని, కష్టాలను కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారని కొనియాడారు.
చదవండి: Jai Bhim Review: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..?
నిజాయితీపరులైన పోలీసులు, న్యాయవాదులు న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించగలరని జై భీమ్ చిత్రంలో చూపించారంటూ చిత్ర యూనిట్‌ను, ముఖ్యంగా నటుడు సూర్యను ప్రశంసించారు. అదే విధంగా నటుడు, మకల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల హాసన్ జై భీమ్ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు. ఈ సినిమా చూసి తన కళ్లు చమర్చాయని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పళంగుడి ప్రజల కష్టాలను తెరపై ఆవిష్కరించిన దర్శకుడి తీరు ప్రశంసనీయం అన్నారు. సూర్య, జ్యోతికలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment