నిరాడంబరంగా నటుడి పెళ్లి | Actor Manikandan Got Married In Kochi Temple | Sakshi
Sakshi News home page

నిరాడంబరంగా నటుడి పెళ్లి

Published Sun, Apr 26 2020 6:11 PM | Last Updated on Sun, Apr 26 2020 6:17 PM

Actor Manikandan Got Married In Kochi Temple - Sakshi

భార్య అంజలితో నటుడు మణికందన్‌

కొచ్చి : నటుడు, కేరళ ఫిల్మ్‌ అవార్డ్‌ విజేత మణికందన్‌​ ఓ ఇంటివాడయ్యారు. ఆదివారం కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య లాక్‌డౌన్‌ నిబంధనలను గౌరవిస్తూ ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలల క్రితమే మరదుకు చెందిన అంజలితో మణికందన్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్‌ 26న పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అయితే పెళ్లి తేదీని మార్చటానికి మణికందన్‌ ఇష్టపడలేదు. కానీ, ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పెళ్లి ఘనంగా చేసుకోకూడదని మాత్రం నిర్ణయించుకున్నారు. పెళ్లి కోసం వెచ్చించాల్సిన డబ్బు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారు. 2016లో వచ్చిన కమ్మటిపడ సినిమాతో మణికందన్‌ సినీరంగంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కేరళ ఫిల్మ్‌ అవార్డు అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement