చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం గుడ్‌నైట్. ఈ చిత్ర కథానాయకుడు మణికంఠన్, మిలియన్ డాలర్స్, ఎంఆర్పీ సంస్థలు మరో చిత్రానికి సిద్ధమయ్యారు. శ్రీగౌరిప్రియ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని, శ్రేయాకృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం ఉదయం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నటుడు విజయ్‌సేతుపతి విచ్చేసి ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు వివరాలను తెలుపుతూ యువతీ యువకులు సమకాలీన ప్రేమ, తద్వారా ఏర్పడే సమస్యలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, గోవా సమీపంలోని గోకర్ణం ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. చిత్ర కథ జనరంజక అంశాలతోపాటు మంచి సందేశంతో కూడి ఉంటుందన్నారు.
చదవండి: నాకు హద్దులు తెలుసు.. అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment