మాకే ఎందుకిన్ని కష్టాలు అనిపించే స్టోరీ.. ఓటీటీలో చూసేయండి.. | Kannagi Telugu And Hindi Version Movies Released In OTT, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Kannagi OTT Release Date: నలుగురమ్మాయిల కష్టాల కథే ఈ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Sun, Mar 3 2024 3:24 PM | Last Updated on Sun, Mar 3 2024 3:47 PM

Kannagi Movie Telugu, Hindi Version Released, Check OTT Platform - Sakshi

ఆ నాలుగు పాత్రలు.. మాకే ఎందుకిన్ని కష్టాలు అనిపించేలా ఉంటాయి. స్కైమూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఈ5 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ గణేశ్‌, ధనుష్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబ

నలుగురమ్మాయిలు పడ్డ కష్టాలు.. వాటి నుంచి బయటపడేందుకు చేసిన పోరాటమే కన్నగి కథ! అమ్ము అభిరామి, విద్య ప్రదీప్‌, షాలిని జోయ, కీర్తి పాండియన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ తమిళ సినిమాకు యశ్వంత్‌ కిషోర్‌ దర్శకత్వం వహించారు. ఆ నాలుగు పాత్రలు.. మాకే ఎందుకిన్ని కష్టాలు అనిపించేలా ఉంటాయి. స్కైమూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఈ5 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ గణేశ్‌, ధనుష్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బాక్సాఫీస్‌ దగ్గర అంతంత మాత్రమే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో చడీచప్పుడు లేకుండా అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేసింది. అప్పుడు తమిళ వర్షన్‌ మాత్రమే రిలీజైంది. తాజాగా హిందీ, తెలుగు వర్షన్‌ను ప్రైమ్‌లో అందుబాటులోకి తెచ్చారు. సినిమా రిలీజైన రెండున్నర నెలల తర్వాత తెలుగు వర్షన్‌ తీసుకురావడం విశేషం. 

చదవండి:  సడన్‌గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement