Good Night Movie
-
Meetha Raghunath: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న యూత్ ఫేవరెట్ హీరోయిన్ (ఫోటోలు)
-
Meetha Raghunath: ఎంగేజ్మెంట్తో కుర్రకారు మనసు ముక్కలు చేసిన గుడ్‌నైట్ హీరోయిన్ (ఫోటోలు)
-
యూత్ కలల రాణికి నిశ్చితార్ధం.. త్వరలో పెళ్లి
భాషతో సంబంధం లేకుండా గుడ్‌నైట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ ఏడాదిలో చిన్న సినిమా వచ్చిన గుడ్‌నైట్ భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్మార్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై వచ్చిన ఈ చిత్రంలో కె. మణికంఠన్, మీతా రఘునాథ్ జోడీ చాలా బాగా మెప్పిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గుడ్‌నైట్ చిత్రంలో ఎలాంటి మేకప్ లేకుండా 'అను' పాత్రలో మీతా రఘునాథ్ ప్రేక్షకులను చాలా బాగా మెప్పించింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా ఈ ఏడాది హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. నిద్ర, గురక వంటి సాదాసీదా విషయాలను కథావస్తువుగా తీసుకుని అద్భుతమైన స్క్రీన్ ప్లేగా అభిమానులకు అందించారు దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్. మీతా రఘునాథ్ పెళ్లి ఈ చిత్రంలో మణికందన్, మీతా రఘునాథ్ నటనకు భారీ స్పందన లభించింది. మీతా రఘునాథ్ తన సహజ నటనతో అభిమానులను ఆకట్టుకుంది. 2022లో "సా నీ నిధూమ్ నీ" చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసిన ఆమెకు 'గుడ్ నైట్' చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన చూసిన అభిమానులు తనలాంటి భార్య కావాలని సోషల్ మీడియాలో ఎందరో యూత్ మాట్లాడుకునేలా చేసింది. భర్త కోసం దేన్నైనా భరించే భార్యగా ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సినిమా వల్ల ఆమెకు కోలీవుడ్‌లో భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. ఈ సందర్భంలో మీతాకు పెళ్లి నిశ్చయమైంది. తాజాగా ఆమె నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనుండగా, అభిమానులు మీతాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
సూపర్ హిట్‌గా నిలిచిన గుడ్‌నైట్ మూవీ.. ఈ టీమ్ కలయికలో కొత్త చిత్రం
చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం గుడ్‌నైట్. ఈ చిత్ర కథానాయకుడు మణికంఠన్, మిలియన్ డాలర్స్, ఎంఆర్పీ సంస్థలు మరో చిత్రానికి సిద్ధమయ్యారు. శ్రీగౌరిప్రియ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని, శ్రేయాకృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం ఉదయం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నటుడు విజయ్‌సేతుపతి విచ్చేసి ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలను తెలుపుతూ యువతీ యువకులు సమకాలీన ప్రేమ, తద్వారా ఏర్పడే సమస్యలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, గోవా సమీపంలోని గోకర్ణం ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. చిత్ర కథ జనరంజక అంశాలతోపాటు మంచి సందేశంతో కూడి ఉంటుందన్నారు. చదవండి: నాకు హద్దులు తెలుసు.. అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్ -
'గుడ్ నైట్' సినిమా రివ్యూ (ఓటీటీ)
టైటిల్: గుడ్ నైట్ నటీనటులు: మణికందన్, మీరా రఘునాథ్, రమేశ్ తిలక్ తదితరులు నిర్మాణ సంస్థ: మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్ఆర్పీ ఎంటర్ టైన్మెంట్ నిర్మాత: యువరాజ్ గణేశన్, మగేశ్ రాజ్, నజేరత్ పసిలియన్ దర్శకత్వం: వినాయక్ చంద్రశేఖరన్ సంగీతం: సీన్ రోల్డన్ సినిమాటోగ్రఫీ: జయంత్ సేతు మాధవన్ ఎడిటర్: భరత్ విక్రమన్ విడుదల తేదీ: 2023 జూలై 03 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సినిమా హిట్ అవ్వాలంటే భారీతనం, హంగులే అక్కర్లేదు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా ఓ కథ-కథనం ఉంటే చాలు. కచ్చితంగా హిట్ అవుతుంది. భాషతో సంబంధం లేకుండా ఆదరణ సొంతం చేసుకుంటుంది. అలా మనందరికీ తెలిసిన 'గురక' అనే పాయింట్ తో తమిళంలో వచ్చిన సినిమా 'గుడ్ నైట్'. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. హాట్‌స్టార్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే. కథేంటి? మోహన్ అలియాస్ మోటర్ మోహన్(మణికందన్)కు గురక సమస్య. నిద్రపోయాడంటే సౌండ్ రీసౌండ్ వస్తుంది. అమ్మ, అక్క-బావ, చెల్లితో కలిసుంటాడు. తన గురక గురించి అందరూ తిడుతున్నాసరే దానికి అలవాటు పడిపోతాడు. ఓరోజు అనుకోని పరిస్థితుల్లో అను (మీరా రఘునాత్) పరిచయమవుతుంది. మనుషుల్లో పెద్దగా కలవని ఈమె.. మోహన్ తో లవ్‌లో పడుతుంది. కొన్నిరోజులకే పెళ్లి చేసుకుంటుంది. ఫస్ట్ నైట్ రోజు.. భర్తకు గురక ప్రాబమ్ ఉందని ఈమెకు తెలుస్తుంది. మరి తర్వాత ఏమైంది? భార్యభర్తలు చివరకు ఒక్కటయ్యారా? లేదా అనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? కొత్త ఫ్లాట్.. మోహన్-అనుకి ఫస్ట్ నైట్.. రాత్రంతా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. నిద్ర ముంచుకురావడంతో మోహన్ పడుకుంటాడు. తెలియకుండానే గట్టిగా గురక పెడతాడు. ఇబ్బందిపడుతూనే అను ఆ రాత్రి గడుపుతుంది. తన అసౌకర్యం గురించి భర్తకి చెప్పదు. ఉదయం లేచి, అతడు అడిగినా సరే పర్లేదు అని చెబుతుంది. ఇది ఓ సీన్. కాపురం మొదలైన కొన్నాళ్లకు భర్త గురక వల్ల అను ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒంటరిగా వేరే ఇంట్లోకి మారిపోతుంది. కానీ ఆమెకు నిద్ర పట్టదు. ఒంటరిగా ఉన్నాసరే రాత్రంతా భర్త గురించే ఆలోచనలు. దీంతో వాట్సాప్ ఓపెన్ చేసి, అందులో భర్త ఇంతకు ముందు తనకు సెండ్ చేసిన గురక రికార్డింగ్స్‌ని ఈయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ వింటుంది. ఇది మరో సీన్. మొదటి సీన్ చూస్తున్నప్పుడు మనకు నవ్వొస్తుంది. రెండో సీన్ చూస్తున్నప్పుడు అనుతో పాటు మనమూ ఎమోషనల్ అవుతాం. అదే ఈ సినిమాలో మ్యాజిక్. టైటిల్స్ పడకముందే మనకు గురక సౌండ్ వినిపిస్తుంది. కాసేపటికే మోహన్ ని చూపిస్తారు. ఇకు ఆలస్యం చేయకుండా నేరుగా స్టోరీలో మెయిన్ పాయింట్ ఏంటనేది డైరెక్టర్ చెప్పేశాడు. ఆ తర్వాత మోహన్ కుటుంబాన్ని, అతడు జీవితంలో ఉండే మనుషులు, వాతావారణాన్ని పరిచయం చేస్తూ వెళ్లాడు. గురక వల్లే తన ఆఫీసులోనే పనిచేస్తున్న ఓ అమ్మాయి మోహన్‌కి బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత అతడి ఇంటికొచ్చి ఏడవడం, అది చూస్తున్న మనకు నవ్వు రావడం లాంటి సీన్స్ వరసగా వస్తుంటాయి. మోహన్, అను.. ఇద్దరు జీవితాలు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. అలాంటిది ఓరోజు అనుకోకుండా వీళ్లిద్దరూ పరిచయవుతారు. స్నేహం.. ప్రేమ.. పెళ్లి.. ఇదంతా జరిగేసరికి ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఫస్టాప్ మొత్తాన్ని ఎంటర్ టైనింగ్‌గా తీసిన డైరెక్టర్.. సెకండాఫ్ లో ఎమోషన్స్ ని నమ్ముకున్నాడు. భర్తకు గురక సమస్య ఉందని తెలిసిన తర్వాత అను జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి? మోహన్ ఏం చేశాడు? ఫైనల్ గా ఏం జరిగిందనేది క్లైమాక్స్. ఈ సినిమాలోనే మోహన్ బావ-అక్క స్టోరీ కూడా ఉంటుంది. ఈ కాలం తల్లిదండ్రుల తీరుని క్వశ్చన్ చేసేలా అదంతా ఉంటుంది. దాదాపు రెండున్నర గంటలున్న ఈ సినిమాలో ఫస్టాప్ ని చకచకా నడిపించేసిన డైరెక్టర్.. సెకండాఫ్ లో కాస్త నిదానమే ప్రదానం అనే ఫార్ములా పాటించాడు. గురక తగ్గించుకోవడానికి మోహన్ పడే పాట్లు లాంటి సీన్స్.. రిపీట్‌గా అనిపిస్తాయి. కొన్నిచోట్లు మెలోడ్రామా ఎక్కువైంది. మోహన్, అను పాత్రలు.. తమకు వచ్చిన సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. కానీ కలిసి ఉంటేనే ఏ బంధమైనా నిలుస్తుందని చెబుతూ సాగే క్లైమాక్స్ సీన్స్ మనల్ని ఎమోషనల్ చేస్తాయి. ఎవరెలా చేశారు? మోహన్ పాత్రలో మణికందన్ అదరగొట్టేశాడు. ఏ పాయింట్ లో కూడా ఓ నటుడిని చూస్తున్నాం, ఇది సినిమా అనే ఫీలింగ్ అస్సలు అనిపించదు. గురక పెట్టే సీన్స్ నుంచి అను దూరమవుతుందనే భయంతో బాధపడే సన్నివేశాల వరకు చాలా నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. అను పాత్రలో మీరా రఘునాథ్ ఫెర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇంటర్వెర్ట్, అమాయకురాలిగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆ పాత్రతో పాటు జర్నీ చేసేలా చేసింది. మోహన్ బావ పాత్రలో నటించిన రమేశ్ తిలక్.. కనిపించిన ప్రతి సీన్ లో నవ్వించాడు. చివర్లో మాత్రం ఏడిపించేశాడు. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాల్లో సీన్ రొల్డన్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. జయంత్ సేతు సినిమాటోగ్రఫీ నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ప్రతి సీన్ ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఎడిటర్ భరత్ విక్రమన్.. సెకండాఫ్ లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉండాల్సింది. రైటర్ అండ్ డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖరన్.. అందరికీ తెలిసిన గురక అనే సమస్యని తీసుకుని దాన్ని ఫన్నీ అండ్ ఎమోషనల్ వేలో భలే తీశాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే.. కుటుంబంతో కూర్చొని, నీట్ అండ్ క్లీన్ ఎంటర్టైనర్ చూద్దామనుకుంటే 'గుడ్ నైట్' సినిమా బెస్ట్ ఆప్షన్. - చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు
ఎప్పటిలానే మరో సోమవారం వచ్చేసింది. అందరూ ఆఫీసులు, స్కూల్-కాలేజీ హడావుడిలో పడిపోయారు. మూవీ లవర్స్ మాత్రం ఈ వారం ఎన్ని సినిమాలు రాబోతున్నాయి? వాటిని ఎప్పుడు ఎలా చూడాలా అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. థియేటర్లలోకి 10 చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో 'రంగబలి' మాత్రం కాస్త చెప్పుకోదగ్గది. అయితే ఓటీటీల్లోకి మాత్రం ఈ వారం ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో తెలుగు మూవీస్-సిరీస్ లు బోలెడన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియో బాబీలోన్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 05 స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్) - జూలై 06 అదురా (హిందీ సిరీస్) - జూలై 07 ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గుడ్ నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్) కిజాజీ మోటో: జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్) - జూలై 05 IB 71 (హిందీ సినిమా) - జూలై 07 నెట్‌ఫ్లిక్స్ అన్నోన్: ద లాస్ట్ పిరమిడ్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 03 (స్ట్రీమింగ్ అవుతోంది) ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్) హోమ్ రెకర్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 06 ఫేటల్ సెడక్సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07 ద ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 07 ద పోప్స్ ఎక్సార్సిస్ట్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 07 హాక్ మై హోమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07 డీప్ ఫేక్ లవ్ (ఇంగ్లీష్ రియాలిటీ షో) - జూలై 07 జీ5 అర్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా) - జూలై 07 తర్లా (హిందీ మూవీ) - జూలై 07 జియో సినిమా ఇష్క్ నెక్స్ట్ డోర్ (హిందీ చిత్రం) - జూలై 03 (స్ట్రీమింగ్ అవుతోంది) బ్లయిండ్ (హిందీ మూవీ) - జూలై 07 ఉనాద్ (మరాఠీ సినిమా) - జూలై 08 సోనీ లివ్ ఫర్హానా (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 07 హవా (బంగ్లాదేశీ మూవీ) - జూలై 07 ముబీ రిటర్న్ టూ సియోల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 07 (ఇదీ చదవండి: కెమెరాల ముందు ముద్దులు, సారీ చెప్పిన సల్మాన్ ఖాన్)