హీరోగా నటిస్తున్న జైభీమ్‌ నటుడు.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ | Jai Bhim Actor Manikandan Starrer Good Night Movie Titile Announced | Sakshi
Sakshi News home page

Actor Manikandan : హీరోగా నటిస్తున్న జైభీమ్‌ నటుడు.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Feb 11 2023 9:03 AM | Updated on Feb 11 2023 9:06 AM

Jai Bhim Actor Manikandan Starrer Good Night Movie Titile Announced - Sakshi

తమిళసినిమా: జైభీమ్‌ చిత్రం ఫేమ్‌ మణికంఠన్‌ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రానికి గుడ్‌నైట్‌ అనే పేరును నిర్ణయించారు. వినాయక్‌ చంద్రశేఖరన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని డాలర్‌ స్టూడియోస్‌ సంస్థ, ఎంఆర్పీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థల అధినేతలు నజ్రేద్‌ పసిలియాన్, మహేశ్‌రాజ్‌ పసిలియాన్, యువరాజ్‌ గణేషన్‌ నిర్మిస్తున్నారు. దర్శకుడు ఎస్పీ శక్తివేల్‌ క్రియేటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నటి మితారఘునాథ్‌ నాయకిగా నటించగా రమేష్‌ తిలక్, దర్శకుడు, నటుడు బాలాజీ శక్తివేల్, బుక్స్, రేచ్చల్‌ రేబాకా ముఖ్యపాత్రలు పోషించారు.

జయంత్‌ సేతుమాధవన్‌ చాయాగ్రహణం, శ్యాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ షూటింగ్‌ పూర్తయిందని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసినట్లు చెప్పారు. ఇది గురక ప్రధాన అంశంగా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు.

నిద్రలో ఒక వ్యక్తి గురక ఇతరులను ఏ విధంగా బాధిస్తుంది అన్న అంశాన్ని వినోదాన్ని జోడించి రూపొందించినట్లు తెలిపారు. చిత్రంలో కుటుంబ అనుబంధాలకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దీన్ని చక్కని అర్థవంతమైన కథాంశంతో రపొందించినట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి, చిత్ర వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement