వృద్ధుడనే కనికరం లేకుండా సొంత మావపై దాడికి పాల్పడ్డ మహిళా పోలీసు | Viral Video: Woman Cop Slapping Her Father In Law Multiple Times | Sakshi
Sakshi News home page

మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్‌

Published Tue, Sep 6 2022 2:52 PM | Last Updated on Tue, Sep 6 2022 3:24 PM

Viral Video: Woman Cop Slapping Her Father In Law Multiple Times  - Sakshi

న్యూఢిల్లీ: ఒక మహిళా పోలీసు సొంత మావపై బౌతిక దాడికి దిగింది. ఐతే  ఈ ఘటనను మరొక పోలీసు వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని లక్ష్మీ నగరంలో నివాసం ఉంటున్న బాధిత వృద్ధుడి ఇంట్లో చోటు చేసుకుంది. ఆ వీడియోలో ఒక మహిళా పోలీసు పదేపదే తన మామాగారి చెంప చెళ్లుమనిపిస్తుంది. పైగా అందుకు ఆమె తల్లి కూడా మద్దతిచ్చింది.

ఈ ఘటన జరగడానికి ముందు ఆమె తన తల్లితో కలిసి వృద్ధుడైన తన మావతో గొడవకు దిగింది. ఇద్దరి మద్య పెద్ద వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా మరొక పోలీసు జోక్యం చేసుకునేలోపే ఆ మహిళా పోలీసు పదే పదే ఆ వృద్ధుడి చెంపపై కొట్టింది. సదరు మహిళా పోలీసు ఢిల్లీలోని ఢిఫెన్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ ఘటన పై సీరియస్‌ అయిన పోలీసు అధికారులు సదరు మహిళా పోలీసుపై కేసు నమోదు చేయడమే కాకుండా శాఖాపరమైన చర్యలు కూడా  తీసుకుంటామని తెలిపారు.

(చదవండి: వరద నీటిలో స్కూటీ స్కిడ్‌.. కరెంట్‌ స్తంభం పట్టుకోవడంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement