Women cops
-
వృద్ధుడనే కనికరం లేకుండా సొంత మావపై దాడికి పాల్పడ్డ మహిళా పోలీసు
న్యూఢిల్లీ: ఒక మహిళా పోలీసు సొంత మావపై బౌతిక దాడికి దిగింది. ఐతే ఈ ఘటనను మరొక పోలీసు వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని లక్ష్మీ నగరంలో నివాసం ఉంటున్న బాధిత వృద్ధుడి ఇంట్లో చోటు చేసుకుంది. ఆ వీడియోలో ఒక మహిళా పోలీసు పదేపదే తన మామాగారి చెంప చెళ్లుమనిపిస్తుంది. పైగా అందుకు ఆమె తల్లి కూడా మద్దతిచ్చింది. ఈ ఘటన జరగడానికి ముందు ఆమె తన తల్లితో కలిసి వృద్ధుడైన తన మావతో గొడవకు దిగింది. ఇద్దరి మద్య పెద్ద వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా మరొక పోలీసు జోక్యం చేసుకునేలోపే ఆ మహిళా పోలీసు పదే పదే ఆ వృద్ధుడి చెంపపై కొట్టింది. సదరు మహిళా పోలీసు ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ ఘటన పై సీరియస్ అయిన పోలీసు అధికారులు సదరు మహిళా పోలీసుపై కేసు నమోదు చేయడమే కాకుండా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. #WATCH | Case registered under section 323/427 IPC after a video of Sub-Inspector thrashing her in-laws in Delhi's Laxmi Nagar went viral. Info shared with concerned authority to take suitable departmental action against the erring police official: Delhi Police (CCTV Visuals) pic.twitter.com/VUiyjVtZQl — ANI (@ANI) September 5, 2022 (చదవండి: వరద నీటిలో స్కూటీ స్కిడ్.. కరెంట్ స్తంభం పట్టుకోవడంతో) -
దప్పికతోనే మహిళ పోలీసుల విధులు!
న్యూఢిల్లీ: మహిళా సాధికారిత సాధనలో భాగంగా పోలీసుశాఖలోనూ పెద్ద ఎత్తున మహిళలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో కనీస మౌలిక సౌకర్యాలు లేక మహిళా పోలీసులు అనుభవిస్తున్న కష్టాలను తాజాగా ఓ సర్వే వెలుగులోకి తెచ్చింది. విధులు నిర్వహించే ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఒకటికి వెళ్లకుండా ఉండేందుకు కనీసం నీళ్లు కూడా తాగకుండా మహిళా పోలీసులు కర్తవ్యపాలన చేస్తున్నారు. దీనికితోడు పురుషుల శరీర దారుఢ్య కొలతలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రక్షణ జాకెట్లు రూపొందిస్తుండటంతో అవి తాము ధరించినప్పుడు చాలా బిగుతూగా ఉండి.. ఊపిరి కూడా అందడం లేదని, చాలాబరువుగా కూడా ఉంటున్నాయని మహిళా పోలీసులు ఈ సర్వేలో వెల్లడించారు. గత ఏడాది జరిగిన పోలీసుశాఖలోని మహిళల 7వ జాతీయ సదస్సు సందర్బంగా ఈ సర్వే వివరాలు, సిఫారసులను అందజేశారు. పోలీసు రీసెర్చ్, అభివృద్ధి బ్యూరో, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే వివరాలు తాజాగా వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాల గురించి చర్చించి.. వాటి పరిష్కారం కోసం సలహాలతో కూడిన ఈ సర్వే వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. కేంద్ర బలగాల్లో 33శాతం పోస్టులను, సరిహద్దు భద్రతా దళాల్లో 15 శాతం పోస్టులను మహిళలకు కేటాయించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీసుశాఖలోని మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.