సేలం: పెళ్లయిన తర్వాత కూడా తమతో క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని వరుడి స్నేహితులు వధువుతో ఒప్పందం చేసుకున్న సంఘటన ఉసిలంపాటిలో ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మదురై జిల్లా ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్ ప్రాంతానికి చెందిన హరిప్రసాద్ తేనిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.
ఈయనకు క్రికెట్‌లో కూడా రాణించారు. ఈయనకు, తేనీకి చెందిన పూజతో ఉసిలంపాటిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో శుక్రవారం పెద్దల సమక్షంలో పెళ్లికి నిశ్చయించారు. ఈ పెళ్లి సందర్భంగా అక్కడికి వచ్చిన వరుడి స్నేహితులు పెళ్లి తర్వాత కూడా హరిప్రసాద్‌ను క్రికెట్ ఆడడానికి అనుమతి కల్పించాలని వధువును పట్టుబట్టారు.
శని, ఆదివారాల్లో పెళ్లికొడుకు క్రికెట్ ఆడేందుకు ఒప్పుకోవడంతో అది రాతపూరంగా ఉండాలని కోరారు. దీంతో పెళ్లికూతురు అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత వారి పెళ్లి జరిపించారు. పెళ్లయ్యాక వరుడి క్రీడల్లో పాల్గొనకుండా భార్యలు అడ్డుకునే సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ విధంగా వరుడి స్నేహితులు వధువు చేత చేయించిన అంగీకార ఒప్పందం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: IND-W vs ENG-W: భారత్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం!
Comments
Please login to add a commentAdd a comment