
సాక్షి, అనంతపురం: జిల్లాలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనానికి పెనుప్రమాదం తప్పింది. కళ్యాణదుర్గం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకళ్తే.. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు కళ్యాణదుర్గం సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అయితే బస్సు హైటెన్షన్ విద్యుత్ తీగలకు సమీపంలోకి వెళ్లి నిలిచిపోవడంతో.. పెద్ద ముప్పు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 10 మందికి స్వల్ప గాయాలు కాగా.. 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డ వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యచికిత్స అందిస్తున్నారు. ('అనంత'లో అదుపు తప్పిన వోల్వో బస్సు)
Comments
Please login to add a commentAdd a comment