‘‘నెలకోసారే పిజ్జా తినాలి.. ఇంట్లో వంటనే తినాలి.. ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాలి.. ప్రతిరోజూ చీర కట్టుకోవాలి.. 15 రోజులకోసారి మాత్రమే షాపింగ్ చేయాలి.. ప్రతి పార్టీలో మంచి ఫొటోస్ తీసుకోవాలి..’’
ఇదేంటి న్యూఇయర్ రిజల్యూషన్స్‌లా ఉన్నాయి అనుకుంటున్నారా. రిజల్యూషన్స్ అన్నమాట నిజమే కానీ.. న్యూ ఇయర్‌కు తీసుకున్నవి కాదు. అస్సాంకు చెందిన నూతన వధూవరులు శాంతి, మింటూ పెళ్లి తరువాత చేసుకున్న కాంట్రాక్ట్‌లోనివి. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు, ప్రీవెడ్డింగ్ షూట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు సంప్రదాయాలను బ్రేక్ చేస్తున్నారు... ఇంకొందరు వింత పద్ధతుల్లో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఈ జంట పెళ్లి తరువాత ఉండాల్సిన పద్ధతులపై కాంట్రాక్ట్ చేసుకున్నారన్నమాట.
ఎర్రని లెహంగాలో వధువు, తెల్లని పెళ్లి దుస్తుల్లో వరుడు కాంట్రాక్ట్ పేపర్‌పై సంతకం పెడుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వెడ్డింగ్ ఫొటోగ్రఫీ సంస్థ వెడ్‌లాక్... పోస్ట్ చేసిన ఆ వీడియోకు నెటిజన్స్ మామూలుగా స్పందించలేదు. ‘వెడ్డింగ్ కాంట్రాక్ట్’ బాగుందని కొందరంటే.. ‘ఇదేం పద్ధతి’ అంటూ కొందరు చిరాకు పడ్డారు. ‘అది పెళ్లి కాదు... షేర్వానీలో చేసుకున్న కాంట్రాక్ట్’ అంటూ ఓ నెటిజన్, ‘కండీషన్స్ ఓకేనబ్బా... కానీ ప్రతిరోజూ చీర అంటే టూ మచ్’ మరొకరు, ‘ఇండియాలో ఇంకా అసమానతలు కొనసాగడం బాధాకరం’ అని ఇంకొకరు స్పందిస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment