టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత, వ్యాపారవేత్త రామ్ వీరపనేనిల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. వివాహానికి ఇరుకుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, మరికొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరైన సంగతి తెలిసిందే. ఇక భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న సునీత.. తన పెళ్లి వేడుకను స్వర్గంతో పోల్చారు. రామ్‌తో కలిసి నూతన జీవితం ప్రారంభిచడం తన అదృష్టం అన్నారు. ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడుతూ.. రామ్‌తో తన పరిచయం.. పెళ్లి గురించి చెప్పినప్పుడు పిల్లల స్పందన వంటి తదితర విషయాలను వెల్లడించారు సునీత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రామ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. వాస్తవానికి తను నా సోషల్ మీడియా అకౌంట్స్‌ని చూసుకునే వాడు. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఏళ్లు గడుస్తున్న కొద్ది ఆ స్నేహం మరింత బలపడింది. మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. దీని గురించి ఇరు కుటుంబాలతో మాట్లాడి.. వారి అంగీకారం తర్వాతే పెళ్లి చేసుకున్నాం’ అన్నారు సునీత. (చదవండి: సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్ )
నా నిర్ణయంతో పిల్లలు ఇబ్బంది పడకూడదు
‘రామ్‌తో పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు మొదట నాకు పిల్లలే గుర్తుకు వచ్చారు. ఎందుకంటే నేను తీసుకునే నిర్ణయాలతో వారు ఇబ్బందిపడకూడదు. అలానే జీవిత భాగస్వామి ఉండటం కూడా ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే ప్రతి క్లిష్ట సందర్భంలో మనకు తోడుగా నిలిచేవారు.. మన కష్టసుఖాల్లో అండగా నిలిచే వ్యక్తి భాగస్వామిగా దొరకడం ఎంతో అదృష్టం. రామ్ రూపంలో నాకు ఆ అదృష్టం లభించింది. ఇక నా తల్లి దండ్రులు ఎన్నో ఏళ్లుగా నన్ను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. కానీ పిల్లలను దృష్టిలో పెట్టుకుని వారి నిర్ణయాన్ని పక్కకు పెడుతూ వచ్చాను. కానీ ఇప్పుడు వారు పెద్దవారయ్యారు.. పరిస్థితులను చక్కగా అర్ధం చేసుకునే పరిణీతి వారిలో ఉంది. ఇక రామ్‌ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని వారితో చెప్పినప్పుడు.. వారు నన్ను కౌగిలించుకుని.. ఈ నిర్ణయం తమకు ఎంతో సంతోషాన్నిస్తుంది అని చెప్పారు. నన్ను ఇంత బాగా అర్థం చేసుకునే పిల్లలు లభించడం ఎంతో అదృష్టం. ఇక నా కుటుంబం కూడా నాకు ఎల్లప్పుడు మద్దతుగా నిలబడింది’ అన్నారు సునీత. (చదవండి: సింగర్ సునీతకు సుమ కాస్ట్‌లీ గిఫ్ట్?)
ఆ తర్వాతే హనీమూన్‌కి వెళ్తాం..
‘ఇక కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కేవలం కుటుంబ సభ్యులు.. అత్యంత సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించాం. కానీ మా రెండు కుటుంబాలు చాలా పెద్దవి. అతిథుల జాబితా 200కు చేరింది. ఇక రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించడం లేదు. ఎందుకంటే మేం కలవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందుకే వారందరి కోసం రానున్న రోజుల్లో చిన్న చిన్న పార్టీలు నిర్వహించబోతున్నాం. ఇవన్నీ ముగిశాక హనీమూన్ గురించి ఆలోచిస్తాం. ఆ తర్వాత ఇద్దరం ఎక్కడికైనా వెళ్తాం’ అంటూ చెప్పుకొచ్చారు సునీత.
అలా.. రామ్‌తో పరిచయం ఏర్పడింది: సునీత
Published Tue, Jan 12 2021 11:31 AM | Last Updated on Tue, Jan 12 2021 2:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment