పెళ్లిలో గన్ పేలి కానిస్టేబుల్ మృతి | gun shot in marriage conistable die | Sakshi
Sakshi News home page

పెళ్లిలో గన్ పేలి కానిస్టేబుల్ మృతి

Published Tue, Mar 8 2016 4:00 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM

gun shot in marriage conistable die

మెయిన్‌పురి: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. బోగాం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రసింగ్(45) అనే కానిస్టేబుల్ కూతురు పెళ్లి సందర్భంగా ఆనందోత్సాహాలతో పలువురు తుపాకులతో గాలిలో కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్ రాజేంద్రసింగ్‌పైకి దూసుకురావడంతో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజేంద్రసింగ్ కొంతకాలంగా బుదాన్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement