మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే వివాహాబంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలవ్వుగా.. ఈ నెలలోనే పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మెగా ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్, ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
(ఇది చదవండి; మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!)
కాగా.. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి వేడుక కోసం అతిథులు, సన్నిహితుల ఆహ్వానాలు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే వరుణ్- లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉపాసన తన ఇన్‌స్టాలో ప్రస్తావించింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే వీరి పెళ్లి తేదీపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈనెలలో జరుగుతుందా లేదా వచ్చేనెలలోనా అనే విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.
(ఇది చదవండి: కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు: ఇలియానా)
Comments
Please login to add a commentAdd a comment