వివాహ వేడుకల్లో సీఎం కిరణ్ | To pull the wedding celebrations | Sakshi
Sakshi News home page

వివాహ వేడుకల్లో సీఎం కిరణ్

Published Fri, Nov 29 2013 2:56 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఉదయం తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగిన పీలేరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్

తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఉదయం తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగిన పీలేరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డి కుమార్తె రోహితరెడ్డి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులు రోహితరెడ్డి, కృపానందరెడ్డిని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశీర్వదించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అల్పాహార విందును ఆరగించారు. వివాహానికి టీటీడీ బోర్డు సభ్యులు జీవీ.శ్రీనాథరెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
 
భారీ బందోబస్తు

పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన రాకను పురస్కరించుకుని లక్ష్మీపురం సర్కిల్ నుంచి టీవీఎస్ షోరూం వైపు వెళ్లే వాహనాలు, ద్విచక్రవాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ జాం చేశారు.

దాదాపు రెండు గంటలపాటు లక్ష్మీపురం సర్కిల్ వైపు నుంచి ఎయిర్‌బైపాస్‌రోడ్డు వైపు వాహనాలు రాకుండా కట్టడి చేశారు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అత్యవసరంగా వెళ్లాలని వాహనదారులు వేడుకున్నా వినలేదు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉన్నవాళ్లు కార్యాలయాలకు వెళ్లేందుకు, పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు అవస్థలు పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement