నేడు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవా రం కరీంనగర్ జిల్లాకు వెళుతున్నారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సోదరి వివాహ వేడుకకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10.30 గంటలకు మెట్‌పల్లిలోని వెంకటరెడ్డి గార్డెన్‌కు చేరుకుంటారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.