మిడ్ మానేరు కాంట్రాక్టు రద్దు: కేసీఆర్
కరీంనగర్: మిడ్ మానేరు ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పనుల్లో జాప్యం కారణంగానే మిడ్ మానేరు కు గండి పడిందని ఆరోపించారు. సోమవారం ఆయన మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకుల వైఫల్యం కారణంగానే పనులు పూర్తి కాలేదని విమర్శించారు.
కొత్తగా టెండర్లు పిలిచి త్వరగా పనులు పూర్తి చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాంట్రాక్టు పనుల్లో 5 శాతం లెస్సు తేడాతో పనులు అప్పగించేలా జోవో తెస్తామని చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలకు మెరుగైన పరిహారం అందజేస్తామన్నారు. ఇకపై వరదలు వచ్చినా పెద్దగా నష్టం జరగకుండాచర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మిడ్ మానేరుకు వరద నీరు తగ్గడంతో నిన్నటి నుంచి పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు తమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించినట్టు చెప్పారు.