
వివాహ వేడుకలో వైఎస్ జగన్
కర్నూలు జిల్లా ఆలూరు శాసన సభ్యుడు గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు కుమార్తె అమృత వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి. వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌తో కరచాలనం చేయడానికి అభిమానులు పోటీ పడ్డారు.