
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని తీపి గుర్తు. ఈ వివాహ కార్యక్రమంలోని ప్రతి వేడుకను వధూవరులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అయితే, పెళ్లి తంతు జరిగే వరకు ఎంతో ఆనందంగా ఉండే వధువు అప్పగింతలు వచ్చేసరికి మాత్రం కన్నీటి పర్యంతమవుతుంది. తనవాళ్లను వదిలి వెళ్లలేక తెగ ఇబ్బంది పడిపోతుంటుంది. వధువుతో పాటు చుట్టుపక్కల వారుకూడా ఆ సమయంలో కన్నీరు పెట్టుకుంటారు.
అయితే, ఇక్కడ జరిగిన ఓ అప్పగింతల కార్యక్రమంలో ఒక తండ్రి చేసిన పని నవ్వు తెప్పిస్తోంది. పెళ్లి జరిగిన అనంతరం ఓ వధువు తన తండ్రిని వదిలి వెళ్లలేక తెగ ఏడుస్తోంది. కాస్త దూరం వెళ్తుందో లేదో.. తిరిగి వచ్చి తండ్రిని హత్తుకుని మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంటోంది. కొంత దూరం పోగానే.. మళ్లి పరుగెత్తుకు వచ్చి హత్తుకుని బాధపడుతుంది. పదే పదే ఇలాగే చేయడంతో విసిగిపోయిన తండ్రి కోపంతో కూతురిని చెప్పుతో కొట్టి అక్కడి నుంచి సాగనంపాడు.
అయితే, ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే, ఈసంఘటన గతంలో జరిగిందే.. తిరిగి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఇలాంటి అప్పగింతలు ఎప్పుడూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.