విశాఖలోని బీచ్ రోడ్డులో ఓ హొటల్లో నిర్వహించిన వివాహ వేడుకలో దొంగతనం జరిగింది. అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా దొంగలు ఇర వై నాలుగున్నరతులాల
విశాఖపట్నం: విశాఖలోని బీచ్ రోడ్డులో ఓ హొటల్లో నిర్వహించిన వివాహ వేడుకలో దొంగతనం జరిగింది. అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా దొంగలు ఇర వై నాలుగున్నరతులాల బంగారు ఆభరణాలు అపహరించారు. విశాఖ త్రీ టౌన్ క్రైం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బొబ్బిలికి చెందిన గేదెల వెంకటప్పలనాయుడు కుమారుడు సందీప్‌కుమార్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అతనికి నగరానికి చెందిన దాసరి వెంకటరమణ కుమార్తెతో వివాహం కుదిరింది. ఈ నెల 21న ముహర్తం కుదరడంతో బీచ్‌రోడ్డులోని ఓ హోటల్లో పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించారు.
శనివారం రాత్రి 9 గంటల సమయంలో వరుడు తన విడిది గదిలో బంగారు ఆభరణాలు తీసి బ్యాగ్‌లో పెట్టి కల్యాణ మండపం వద్దకు వెళ్లాడు. ఇదే అదనుగా దొంగలు అతని గదిలో ప్రవేశించి ఇరవై నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. కొద్ది సమయం తర్వాత వరుడు తన గదిలోకి వచ్చి చూడగా ఆభరణాలు కనిపించ లేదు. దీంతో త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వేడుకలోని ఫొటోలు, వీడియోలు వీక్షించారు. అనుమానితుల ఫోటోలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.