
జైపూర్ : రాజస్థాన్ బీవర్‌లోని నంద్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు చెబుతున్నారు. ఆ సిలిండర్ పక్కనే నిండుగా ఉన్న మరో సిలిండర్ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పేలుడు ధాటికి ప్రమాదం జరిగిన చోట రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పాటు దగ్గరలో ఉన్న రెండు కార్లు కూడా దగ్ధమయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దదరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment