హైదరాబాద్ పాతబస్తీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ వివాహ బరాత్ కార్యక్రమంలో 10 రౌండ్ల కాల్పులు జరిపారు. రెండు రివాల్వర్‌లతో స్వయంగా వరుడే గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులతో సమీపంలోని వారు ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.