
గుంటూరు జిల్లాలో నేడు వైఎస్ జగన్ పర్యటన
విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. ఉదయం 9.45 గంటలకు గన్నవరానికి విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ మీదుగా గుంటూరు నగరానికి బయలుదేరి వెళతారు.
అనంతరం అక్కడ సన్నిధి కల్యాణ మండపంలో మాజీ కేంద్రమంత్రి, పార్టీ ముఖ్యనేత, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనుమరాలు, పార్టీ నేత కిలారి రోశయ్య కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం గన్నవరం చేరుకుని 2.40 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళతారని రఘురామ్ వివరించారు.