
జగన్‌కు నీరాజనం
తిరుపతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం ఉదయం తిరుపతి, చంద్రగిరిల్లో ఘన స్వాగతం లభించింది. ఆయన పార్టీ కార్యక్రమానికి కాకుండా బంధువుల వివాహంలో పాల్గొందుకు వచ్చినప్పటికీ సమాచారం తెలుసుకున్న అభిమానులు రేణిగుంట నుంచి చంద్రగిరి వరకు మార్గం మధ్యలో బారులు తీరారు.
చంద్రగిరిలో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వైఎస్ జగన్ బుధవారం ఉదయం తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. ఎంపీలు వైఎస్ అవినాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో పాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ ఉదయం 10 గంటలకే విమానాశ్రయానికి చేరుకుని జననేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ ఇన్‌చార్జులు, మండల నాయకులు, అభిమానులతో తిరుపతి విమానాశ్రయం కిటకిటలాడింది. ’జై జగన్..జైజై జగన్’ అంటూ నినాదాలు హోరెత్తారుు. అభిమాన నేత ఆగమనం గురించి ముందే తెల్సుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎరుుర్‌పోర్టుకు తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే ఎదురెళ్లిన నాయకులు, ఎమ్మెల్యేలను జగన్ పేరుపేరునా పలకరించారు. ఎరుుర్‌పోర్టు విశ్రాంతి గదిలో కొద్దిసేపు నేతలతో సమావేశమై చంద్రగిరికి బయలుదేరారు.
విమానాశ్రయం గేటు దగ్గర విద్యార్థులో ఎదురొచ్చిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డిని జగన్ పలకరించారు. హరిప్రసాదరెడ్డి అందించిన పుష్పగుచ్ఛాన్ని అందుకుని విద్యార్థులకు రెండు చేతులతో అభివాదం చేశారు. కొద్ది దూరం వెళ్లాక తిరుపతి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఎస్‌కే ఇమాం ఇచ్చిన వినతిపత్రాన్ని అందుకున్నారు. యువతను అభినందించారు. చంద్రబాబు నయవంచనపై నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఇమాం విన్నవించారు.
దారిపొడవునా వెల్లువెత్తిన అభిమానం
వైఎస్ జగన్ వెళ్లే కాన్వాయ్ కోసం ఉదయం 8 గంటల నుంచే రోడ్డు పక్క పార్టీ జెండాలతో ఎదురు చూస్తోన్న అభిమానులు ఆయనను చూడగానే ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. చేతులు ముందుకు చాచి ఆయనతో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. రాయల్‌పోర్డు, దామినేడు, తనపల్లె క్రాస్ రోడ్‌ల దగ్గర పెద్ద సంఖ్యలో ఎదురొచ్చిన పార్టీ నాయకులు, అభిమానులను కారు దిగి జననేత పలకరించారు. దామినేడు చౌరస్తా దగ్గర పూలదండలు, పుష్ఫగుచ్ఛాలతో ఎదురొచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. ముందే సిద్ధం చేసిన ఓపెన్‌టాప్ జీపు ఎక్కాలని అభ్యర్థించిన ఎమ్మెల్యేకి సర్దిచెప్పిన వైఎస్ జగన్ రోడ్డు పక్కన ఉన్న మహిళా కార్యకర్తలందరినీ పలకరించారు. చంద్రగిరిలోని కల్యాణ మండపాన్ని చేరుకున్న ఆయన వధూవరులు శుభకర్‌రెడ్డి, నళినీరెడ్డిని ఆశీర్వదించారు. అనంతరం తిరిగి ఎరుుర్‌పోర్టుకు చేరుకుని హైదరాబాద్ బయలుదేరారు. అధినేతకు స్వాగతం పలికిన వారిలో నియోజకవర్గ ఇన్‌చార్జులు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, రాకేష్‌రెడ్డి, సీవీ కుమార్, రెడ్డెమ్మ, చంద్రమౌళి, పార్టీ నేతలు పాలగిరి ప్రతాపరెడ్డి, బీరేంద్రవర్మ, పుల్లూరు అమరనాథ్‌రెడ్డి, పాలగిరి ప్రతాపరెడ్డి, చెలికం కుసుమ, పోకల అశోక్‌కుమార్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమ త, శ్యామల, పుష్ప తదితరులు ఉన్నారు.
చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారి మీదున్న దామినేడు సెంటరు నుంచి చంద్రగిరి వరకూ పెద్ద సంఖ్యలో కటౌట్లు, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. సుమారు 6 వేల మంది మహిళలు, కార్యకర్తలు రోడ్డుకు ఎడమ వైపున జెండాలతో నిలబడి జననేత జగన్‌కు స్వాగతం పలికారు. తనపల్లె, ఢిల్లీహోటల్ సెంటర్లలో కార్యకర్తలు బాణసంచా పేలుళ్లతో హోరెత్తించారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కళాబృందాలు ఆకట్టుకున్నారుు. రోడ్డు పొడవునా అభిమానులు వైఎస్ జగన్‌పై పూలవర్షం కురిపించారు. నియోజకవర్గ నాయకులను చెవిరెడ్డి భాస్కరరెడ్డి జగన్‌మోహన్ రెడ్డికి పరిచయం చేశారు.