రాణిస్థానీ
రాజస్థానీ ప్రాంతీయ కళా వైభవం... కళ్లను కట్టిపడేసే రంగుల సింగారం... కట్టులోనూ, కట్‌లోనూ ‘విలయ’ డిజైన్స్ ఓ ప్రత్యేకం. ఆ కళావైభవాన్ని, ఆ కలల సింగారాన్ని ఒంటిని హత్తుకుపోతే నవవధువు మహారాణిలా వెలిగిపోవాల్సిందే! రాజస్థానీ కాదు రాణిస్థానీ అనాల్సిందే అంతా!
వివాహవేడుకలలో నవ వధువు అందంగా, ఆధునికంగా వెలిగిపోవాలంటే సందేహం లేకుండా జె.జె.విలయ స్టైల్స్‌ను అనుసరిస్తే చాలు అనేంతటి ఘనమైన పేరుంది ఈ ఫ్యాషన్ డిజైనర్‌కి. తూర్పు -పశ్చిమ భారతదేశంలో అత్యంత ధనవంతుల వివాహ వేడుకలలో దుస్తులు తళుక్కుమన్నాయంటే ఖచ్చితంగా అవి జె.జె.విలయ రూపొందించిన డిజైన్సే అయి ఉంటాయి. అంతగా ప్రాచుర్యం పొందిన ఈ డిజైనర్ అక్కడివరకే పరిమితం కాలేదు. ఎన్నో ఫ్యాషన్ వేదికల మీద తన డిజైన్స్‌ను ప్రదర్శించారు. వివాహావేదికలకు పూల అలంకరణ, ఆహ్వానపత్రికలు, క్యాటరింగ్, ఆర్కెస్ట్రా... వంటివన్నీ ఎంతో కళాత్మకంగా, మరెంతో గ్రాండ్‌గా ఉండేలా చూసుకోగల సృజనశీలిగా విలయకు పేరుంది. రాజస్థాని వాసి అయిన విలయ అసలు పేరు జగ్‌శరణ్‌జిత్ సింగ్ అహ్లువాలియా. ఇరవై ఏళ్ల క్రితమే న్యూఢిల్లీలో ‘విలయ హోమ్’ పేరుతో వెడ్డింగ్ డిజైన్స్ మొదలుపెట్టి, అనతికాలంలోనే దేశంలోని ముఖ్య పట్టణాలలో బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. వివాహ వేడుకలలో ఓ ట్రెండ్‌సెటర్‌ని సృష్టించిన జె.జె.విలయ కట్స్, ఈ స్టైల్స్ మీ శుభకార్యాలలో మెరిపించడానికీ ఉపయోగించుకోవచ్చు.
వాడేసినవి, వాడకుండా ఓ పక్కన పెట్టేసిన చొక్కాలలో కొత్తదనం పోకుండా చాలా వరకు అలాగే ఉంటాయి. అలాంటి వాటిలో నప్పిన చొక్కాను ఎంచుకోండి. చొక్కా పొడవు, రంగు, చెక్స్ బట్టి ఏ తరహా డ్రెస్ రూపొందిస్తే బాగుంటుందో అంచనా వేసుకోండి.చొక్కాను కుర్తా / గౌన్ / స్కర్ట్‌గా రూపొందించడానికి ముందు మీ శరీర కొలతల(బాడీ మెజర్‌మెంట్స్)ను తీసుకోండి.హాల్టర్, ‘వి’నెక్ డిజై న్స్ అమ్మాయిల కుర్తాలకు బాగుంటాయి. నడుము భాగాన విడిగా సన్నని క్లాత్ స్ట్రిప్స్ లేదా ఎలాస్టిక్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు. స్ట్రిప్స్ కోసం చొక్కాకు మ్యాచ్ అయ్యే విడి క్లాత్‌లను తీసుకోవచ్చు.
రీయూజ్
చొక్కా చిక్కితే..
చొక్కాలు మగవారికే పరిమితం కాదు స్త్రీలూ వాటిని ధరిస్తున్నారు. కానీ మడతేసినా, ముడివేసినా... వాటిలో పెద్ద తేడా ఏమీ ఉండదు. కొంచెం డిజైన్ మార్చి చూడండి. చొక్కాలతో ఎన్ని వెరైటీ టాప్స్, స్కర్ట్స్ ... సృష్టించవచ్చో. కొత్తగా డిజైన్ చేసిన డ్రెస్సులను చూసి ‘వారెవ్వా’ అని ముచ్చటపడకుండా ఉండరు.