Rajasthani
-
మీ సోనియా ఇటలీ నుంచి వచ్చారు కదా !
శివాజీనగర: తాను రాజస్థాన్ నుండి వచ్చినవాడైతే మీ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ ఇటలీ నుండి వచ్చారు, ఆమె కూడా తమ రాష్ట్ర నుండి రాజ్యసభకు ఎంపికయ్యారనేది మరువరాదని మంత్రి ప్రియాంక్ ఖర్గేకు రాజ్యసభ సభ్యుడు లెహర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. కేఐఏడీబీ భూముల వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు ఖర్గే జూనియర్ వారి స్నేహితులు రాజస్థాన్ వారని తనపై ఆరోపణ చేశారు. తాను అడిగేందుకు ఇష్టపడుతున్నాను. సోనియాగాంధీ రాజస్థాన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటలీలో జని్మంచారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ సికార్‌లో, రణదీప్ సింగ్ సుర్జేవాలా చురులో జని్మంచారు. వారు ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికయ్యారని ఆయన ప్రశ్నించారు. రాజస్థానీ కావటం నేరమా? రాజస్థాన్ పాకిస్థాన్‌లో లేదని అన్నారు. నెహ్రూ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిందా లేదా కాశీ్మర్ నుండి వచ్చిందా అని ప్రశ్నించారు. తాను 59 సంవత్సరాల నుండి కర్ణాటకలో నివసిస్తున్నాను. తాను కన్నడ మాట్లాడుతున్నాను. చదువుతాను, రాస్తాను. తాను కర్ణాటక బీజేపీలో కోశాధికారి అని, తాను తన పార్టీలో ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించాను. తాను రాజకీయం వంశం నుండి వచ్చినవాడు కాదు. రాహుల్ గాని, ఖర్గే జూనియర్.. రాళ్లు వేసే ముందు గాజు గదిలో ఉన్నారనేది తెలుసుకోవాలి అని లెహర్ సింగ్ ధ్వజమెత్తారు. -
నవరాత్రి ఉత్సాహం
దాండియా నృత్యానికి కళ తెచ్చే దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉండేది లెహెంగా చోలీ. చనియా చోలీగా గిరిజన సంప్రదాయ కళ ఓ వైపు అబ్బురపరుస్తుంది.మనవైన చేనేతల గొప్పతనం మరోవైపు కళ్లకు కడుతుంది.అద్దకం కొత్తగా మెరిసిపోతుంటుంది. ఎరుపు, పచ్చ, పసుపు... రంగుల ప్రపంచంలో మునిగిపోయినట్టుగా ఉంటుంది.లెహంగా అంచులు నృత్యంతో పోటీపడుతుంటే ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది. రాజస్థానీ కళ గిరిజన సంప్రదాయ కళ ఉట్టిపడే ఎంబ్రాయిడరీ చనియా చోలీలు ఇప్పుడు నగరాల్లో జరిగే దాండియా వేడుకలలో తెగ వెలిగిపోతున్నాయి. వాటిని ధరించిన అమ్మాయిలు ఆటపాటల కోలాటంలో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. మనవైన ఫ్లోరల్స్ నృత్యం ఎప్పుడూ ఆనందాన్ని రెట్టింపు చేస్తూనే ఉంటుంది. ఆ ఆనందంతో పోటీ పడే దుస్తుల్లో ఫ్లోరల్స్ కూడా తమ స్థానాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. సంప్రదాయ కళతో పాటు కొద్దిగా ఆధునికత కూడా ఉట్టిపడాలనుకునేవారు ఫ్లోరల్ గాగ్రా చోలీలు ఎంచుకోవచ్చు. బ్లాక్ ప్రింట్స్ కలంకారీ, గుజరాతీ బ్లాక్ ప్రింట్స్ గాగ్రా చోలీలు దాండియాలో తమ వైభవాన్ని చాటడానికి పోటీపడుతుంటాయి. టాప్ టు బాటమ్ ఒకే కలర్, ప్రింట్స్‌తో ఉండే ఈ డ్రెస్సులు గ్రాండ్‌గా కనిపిస్తుంటాయి. -
నకిలీ వీసాలతో మోసాలు
సిరిసిల్ల: గల్ఫ్ బాటలో ఘరానా మోసం జరిగింది. నకిలీ వీసాలు అంటగట్టి కోట్లు కొల్లగొట్టిన ఘటన తెలంగాణ జిల్లాల్లో వణుకు పుట్టిస్తోంది. బోగస్ వెబ్సైట్ సృష్టించి నకిలీ వీసాలను చూపించి రూ.5 కోట్లకు టోకరా ఇచ్చాడు ఓ రాజస్తానీ యువకుడు. రాష్ట్రంలోని 5 జిల్లాలకు చెందిన 300 మంది చెల్లించిన లక్షలతో ఉడాయించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనలో పొరుగు జిల్లాల్లోనూ బాధితులున్నారు. షార్జా బల్దియా వీసాల పేరిట షార్జాలోని బల్దియా (మున్సిపాల్) క్లీనింగ్ వీసాల పేరిట మోసం జరిగింది. రాజస్తాన్‌కు చెందిన మక్సూద్ అలీ (పాస్‌పోర్టు నంబరు ఎల్ 3833483) దుబాయి వెళ్లి వస్తాడు. సొంతగా ఓ నకిలీ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అందు లో నకిలీ వీసాలను తయారు చేసి అప్లోడ్ చేశాడు. దుబాయి, షార్జాల్లో పని చేసే వలస కార్మికులకు బల్దియా వీసాలు ఉన్నాయని నమ్మించాడు. మీకు బంధువులకు వీసాలు ఇవ్వండి అంటూ మక్సూద్ చెప్పాడు. దీంతో పలువురు వలస జీవులు సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలోని సమీప బంధువులకు షార్జా బల్దియా వీసాలు ఉన్నాయని చెప్పారు. అవసరమైతే వెబ్సైట్లో చెక్ చేసుకుని వీసాలకు డబ్బులు చెల్లించాలని సూచించారు. షార్జాలో ఉన్న ఆత్మీయులే ఇలా చెప్పడంతో నమ్మిన పలువురు వెబ్సైట్ చెక్ చేయడంతో వీసాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. దీంతో ఒక్కొక్కరు రూ.1.80 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు వీసాలకు చెల్లించారు. ఇలా సుమారు 300 మంది యువకులు రూ.5 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. ఆ డబ్బులను తీసుకున్న మక్సూద్ నకిలీ వీసాలతో అందరినీ మోసం చేశాడు. బయట పడిందిలా.. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యులు గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేస్తారు. ఆయన 36 మందికి సంబంధించి రూ.56 లక్షలను మక్సూద్‌కి చెల్లించాడు. ఏడుగురు అభ్యర్థులను ఇటీవల షార్జా పంపించగా.. షార్జా ఎయిర్‌పోర్టు అధికారులు అవి నకిలీ వీసాలని గుర్తించి వారిని ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ శివారు తుర్కాసికాలనీకి చెందిన మరో పది మందిని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు షార్జా పంపేందుకు హైదరాబాద్ పంపారు. శంషాబాద్‌విమానాశ్రయం అధికారులు నకిలీ వీసాలను గుర్తించి ఆ పది మందిని వెనక్కి పంపారు. మక్సూద్ ఇచ్చిన వెబ్‌సైట్‌ను చెక్ చేస్తే.. అది నకిలీదని తేలింది. దీంతో తాము మోసపోయామనే విషయం బాధితులకు అర్థమైంది. కాగా, 36 మంది మోసపోయినట్లు తెలియడంతో దర్పల్లికి చెందిన ప్రజాప్రతినిధి గుండెపోటుకు గురై∙ఆస్పత్రి పాలయ్యాడు. -
రాణిస్థానీ
రాజస్థానీ ప్రాంతీయ కళా వైభవం... కళ్లను కట్టిపడేసే రంగుల సింగారం... కట్టులోనూ, కట్‌లోనూ ‘విలయ’ డిజైన్స్ ఓ ప్రత్యేకం. ఆ కళావైభవాన్ని, ఆ కలల సింగారాన్ని ఒంటిని హత్తుకుపోతే నవవధువు మహారాణిలా వెలిగిపోవాల్సిందే! రాజస్థానీ కాదు రాణిస్థానీ అనాల్సిందే అంతా! వివాహవేడుకలలో నవ వధువు అందంగా, ఆధునికంగా వెలిగిపోవాలంటే సందేహం లేకుండా జె.జె.విలయ స్టైల్స్‌ను అనుసరిస్తే చాలు అనేంతటి ఘనమైన పేరుంది ఈ ఫ్యాషన్ డిజైనర్‌కి. తూర్పు -పశ్చిమ భారతదేశంలో అత్యంత ధనవంతుల వివాహ వేడుకలలో దుస్తులు తళుక్కుమన్నాయంటే ఖచ్చితంగా అవి జె.జె.విలయ రూపొందించిన డిజైన్సే అయి ఉంటాయి. అంతగా ప్రాచుర్యం పొందిన ఈ డిజైనర్ అక్కడివరకే పరిమితం కాలేదు. ఎన్నో ఫ్యాషన్ వేదికల మీద తన డిజైన్స్‌ను ప్రదర్శించారు. వివాహావేదికలకు పూల అలంకరణ, ఆహ్వానపత్రికలు, క్యాటరింగ్, ఆర్కెస్ట్రా... వంటివన్నీ ఎంతో కళాత్మకంగా, మరెంతో గ్రాండ్‌గా ఉండేలా చూసుకోగల సృజనశీలిగా విలయకు పేరుంది. రాజస్థాని వాసి అయిన విలయ అసలు పేరు జగ్శరణ్జిత్ సింగ్ అహ్లువాలియా. ఇరవై ఏళ్ల క్రితమే న్యూఢిల్లీలో ‘విలయ హోమ్’ పేరుతో వెడ్డింగ్ డిజైన్స్ మొదలుపెట్టి, అనతికాలంలోనే దేశంలోని ముఖ్య పట్టణాలలో బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. వివాహ వేడుకలలో ఓ ట్రెండ్సెటర్ని సృష్టించిన జె.జె.విలయ కట్స్, ఈ స్టైల్స్ మీ శుభకార్యాలలో మెరిపించడానికీ ఉపయోగించుకోవచ్చు. వాడేసినవి, వాడకుండా ఓ పక్కన పెట్టేసిన చొక్కాలలో కొత్తదనం పోకుండా చాలా వరకు అలాగే ఉంటాయి. అలాంటి వాటిలో నప్పిన చొక్కాను ఎంచుకోండి. చొక్కా పొడవు, రంగు, చెక్స్ బట్టి ఏ తరహా డ్రెస్ రూపొందిస్తే బాగుంటుందో అంచనా వేసుకోండి.చొక్కాను కుర్తా / గౌన్ / స్కర్ట్‌గా రూపొందించడానికి ముందు మీ శరీర కొలతల(బాడీ మెజర్మెంట్స్)ను తీసుకోండి.హాల్టర్, ‘వి’నెక్ డిజై న్స్ అమ్మాయిల కుర్తాలకు బాగుంటాయి. నడుము భాగాన విడిగా సన్నని క్లాత్ స్ట్రిప్స్ లేదా ఎలాస్టిక్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు. స్ట్రిప్స్ కోసం చొక్కాకు మ్యాచ్ అయ్యే విడి క్లాత్‌లను తీసుకోవచ్చు. రీయూజ్ చొక్కా చిక్కితే.. చొక్కాలు మగవారికే పరిమితం కాదు స్త్రీలూ వాటిని ధరిస్తున్నారు. కానీ మడతేసినా, ముడివేసినా... వాటిలో పెద్ద తేడా ఏమీ ఉండదు. కొంచెం డిజైన్ మార్చి చూడండి. చొక్కాలతో ఎన్ని వెరైటీ టాప్స్, స్కర్ట్స్ ... సృష్టించవచ్చో. కొత్తగా డిజైన్ చేసిన డ్రెస్సులను చూసి ‘వారెవ్వా’ అని ముచ్చటపడకుండా ఉండరు. -
మీస విలాసం
‘మీసము పస మగమూతికి’ అని సెలవిచ్చాడు కవి చౌడప్ప. అలాగని లోకంలోని మగమూతులన్నీ తప్పనిసరిగా మీసాలతోనే అలరారుతున్న దాఖలాలూ లేవు. అయిననూ... మీసమే మగసిరికి చిహ్నమనే నమ్మకం లోకంలో తరతరాలుగా పాతుకుపోయి ఉంది. నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు ఏవీ ఉండవు గానీ, వాటిని తీసిపారేయలేం. ఒకవేళ అలాంటి నమ్మకాలను తేలికగా తీసిపారేసే ప్రయత్నానికి ఒడిగట్టారో... ఇక అంతే సంగతులు! ఎవరివో ఒకరి మనోభావాలు దెబ్బతింటాయి. మరి మనోభావాలు దెబ్బతిన్నాక పరిస్థితి మామూలుగా ఉంటుందంటారా? అంతా రచ్చ రచ్చే కదా..! అయితే, మీసం ఒక్కటే మగసిరికి సంకేతంగా భావిస్తే అది పొరపాటే. ఒకవేళ అదే నిజమైతే, శ్రీకృష్ణ పరమాత్ముల వారికి అంత ఫాలోయింగ్ ఉండేదా? అష్టమహిషులే కాకుండా, పదహారువేల మంది గోపికలు ఆయన వెంటపడేవారా? కృష్ణుడొక్కడేనా..? అసలు, మన దేవుళ్లలో మీసాలు లేని వాళ్లదే మెజారిటీ. పురాణాలను పరికిస్తే, ఈ విషయం తేలికగానే అర్థమవుతుంది. పురాణాల్లో రాక్షసులు మాత్రమే శ్మశ్రు సంపదతో గంభీర భీకరాకారులై ఉండేవారు. దేవుళ్లు, రాక్షసుల సంగతి అలా వదిలేస్తే, అప్పట్లో మునుపుంగవులు, మహర్షులు మాత్రం మీసాలతో పాటు గడ్డాలను కూడా తెగ ఏపుగా పెంచుకొనేవాళ్లు. ఎందుకలాగ? అని ప్రశ్నిస్తే, కచ్చితమైన కారణాలను సాధికారికంగా చెప్పలేం గానీ, కొంతవరకు ఊహించుకోవచ్చు. పురాణకాలంలో మీసాలు గడ్డాలు లేని క్లీన్షేవ్డ్ ముఖాలను సాత్వికతకు చిహ్నంగా, మెలితిరిగిన బొద్దుమీసాలను తామస చిహ్నంగా భావించేవారని అనుకోవచ్చు. మీసాలు, గడ్డాలను ముఖం కనిపించనంత ఏపుగా పెంచేయడాన్ని మేధావి లక్షణంగా భావించేవారని కూడా అనుకోవచ్చు. పురాణ పురుషులను ఎవరూ చూడలేదు. పురాణ వర్ణనల ఆధారంగా చిత్రకారులు ఊహించి చిత్రించిన చిత్రాలు తప్ప వేరే ఆధారాలేవీ లేవు. ఇక చరిత్రలోకి వస్తే మీసాల గురించి చాలా ముచ్చట్లే కనిపిస్తాయి. చరిత్రలో మీసగాళ్లు గ్రీకువీరులు, రోమన్ యోధులలో మెజారిటీ జనాలు బోడి మూతులతోనే ఉండేవారు. వాళ్లలో కొద్దిమందికి మీసాలు, గడ్డాలు కూడా దట్టంగా ఉండేవనుకోండి. మన దేశంలో మాత్రం మీసాలు లేని రాజుల చిత్రపటాలు గానీ, శిల్పాలు గానీ బహు అరుదు. షేవింగ్ ప్రక్రియ పరిచయం లేని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పురుషులందరికీ మీసాలు, గడ్డాలు దట్టంగానే ఉండేవి. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దిలో రాతితో తయారుచేసిన పదునైన పనిముట్లతో ముఖంపై అడ్డదిడ్డంగా పెరిగిపోయిన రోమాలను తొలగించుకునే పద్ధతి మొదలైంది. ఇప్పటి ఇరాన్ ప్రాంతంలో ఉండే అప్పటి సిథియన్లు ఈ ప్రక్రియకు ఆద్యులని చరిత్ర చెబుతోంది. దట్ వజ్ వెరీ ప్రిమిటివ్ షేవింగ్ మెథడ్ నోన్ టు ది మ్యాన్‌కైండ్. లోహాల ఆవిష్కరణ తర్వాత, ముఖ్యంగా ఇనుము విరివిగా అందుబాటులోకి వచ్చాక గడ్డాలు గీసుకునే ‘మగా’నుభావుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. పారిశ్రామిక విప్లవం తర్వాత సేఫ్టీ రేజర్లు, సబ్బులు, షేవింగ్ క్రీములు వంటివి అందుబాటులోకి వచ్చాక ముఖ కేశాలంకరణలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. మీసవైవిధ్యం క్షౌర ప్రక్రియ వేగం పుంజుకున్నప్పటి నుంచి మీసాలలో వైవిధ్యమూ పెరిగింది. ముఖాకృతులకు, అభిరుచులకు తగిన రీతిలో మీసాలను తీర్చిదిద్దుకోవడం, వాటి సొగసును చెక్కు చెదరకుండా కాపాడుకోవడం మొదలైంది. క్రమంగా మీసం ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ స్థాయికి ఎదిగింది. బొద్దింకలను తలపించే బొద్దు మీసాలు, ఎగువకు మెలితిరిగిన మీసాలు, దిగువకు ఒంపుతిరిగి నేలచూపులు చూసే హ్యాండిల్‌బార్ మీసాలు, కనీ కనిపించని సరళరేఖ వంటి పెన్సిల్‌కట్ మీసాలు, పెపైదవికి ఇటూ అటూ ఉన్న రోమాలను శుభ్రంగా గొరిగేసి నడిమధ్యన గుబురుగా పెంచిన టూత్‌బ్రష్ మీసాలు... ఎగువకు మెలితిరిగిన గుబురు మీసాలను పెంచడంలో రాజస్థాన్‌కు చెందిన రాజపుత్రులది ప్రత్యేకశైలి. వీరి శైలి మీసాలను ‘రాజ్‌పుటానా’ మీసాలంటారు. రామ్‌సింగ్ చౌహాన్ అనే రాజస్థానీ ‘మగా’నుభావుడు ఏకంగా 14 అడుగుల మీసాన్ని పెంచి గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కాడు. మీస వైవిధ్యాన్ని గురించి చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడును మించేంత ఉంటుంది. ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నియంత హిట్లర్ టూత్‌బ్రష్ మీసంతోనే కనిపించేవాడు. హిట్లర్ జర్మనీవాడే అయినా, అతడి మీసకట్టు ఫ్రెంచ్కట్గానే ప్రసిద్ధి పొందింది. తొలితరం హాలీవుడ్ నటాగ్రేసరుడు చార్లీ చాప్లిన్ది కూడా ఇలాంటి మీసమే. బ్లాక్ అండ్ వైట్ జమానాలో మన హీరోల్లో చాలామంది పెన్సిల్‌కట్ మీసాన్ని మెయింటైన్ చేసేవాళ్లు. అప్పట్లో అదే ఫ్యాషన్. బాలీవుడ్ హీరోల్లో రాజ్ కపూర్ వంటి ఒకరిద్దరిని మినహాయిస్తే, చాలామంది హీరోలు మీసాల్లేకుండానే కనిపించేవారు. ఇప్పటికీ బాలీవుడ్లో బోడిమూతుల హీరోలదే మెజారిటీ అనుకోండి. పంచరంగుల సినిమాల యుగం మొదలయ్యాక మన తెలుగు హీరోల మీసకట్టు కాస్త బొద్దుదేరింది. మీసాల్లేని కుర్రహీరోలు కొందరున్నా, టాలీవుడ్ స్టార్డమ్లో మీసగాళ్లదే అగ్రస్థానం. మీసాల మాసం ఇంతకీ మీసాల గొడవెందుకని మీమాంసలో పడుతున్నారా..? మరేం లేదు.. ఇది మీసాల మాసం. మగాళ్లకు మాత్రమే వచ్చే ప్రొస్టేట్ కేన్సర్ వంటి కొన్ని రకాల కేన్సర్లపై ప్రపంచవ్యాప్తంగా ‘మగా’నుభావులకు అవగాహన కల్పించేందుకు ఏటా నవంబర్ నెలను మీసాల మాసంగా జరుపుకోవడం 2004 నుంచి మొదలైంది. ఈ నెలను ‘నో షేవ్ నవంబర్’గా... ‘మూవంబర్’గా పాటిస్తారు. నెల పొడవునా ముఖాన పెరిగే కేశసంపదను తొలగించే ప్రయత్నం చేయరు. ‘మూవంబర్’ను పాటించే వాళ్లలో మధ్యేమార్గాన్ని అవలంబించే వాళ్లు గడ్డాన్ని నున్నగా గీసేసినా, మీసాలను మాత్రం దట్టంగా పెంచుతారు. మీసం పౌరుష సంకేతం. ప్రొస్టేట్ గ్రంథిని తెలుగులో పౌరుష గ్రంథి అంటారు. అందుకే ఇదంతా... - పన్యాల జగన్నాథ దాసు -
ఖానాదానీ
రాజస్థానీ, గుజరాతీ వంటకాలు నగరవాసులకు మరింత చేరువయ్యాయి. దేశంలోనే పేరెన్నికగన్న వెజిటేరియన్ రెస్టారెంట్ చైన్ ‘ఖాన్‌దానీ రాజధాని’ కూకట్పల్లి సుజనామాల్‌లో గురువారం రెండో అవుట్లెట్ ప్రారంభించింది. ఆహ్లాదకరమైన ఇంటీరియర్... పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించిన చెఫ్‌లు వండి వార్చే నోరూరించే రుచులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. లంచ్, డిన్నర్స్‌లో మట్టర్ ఖాస్తా రోల్, సుర్తి ప్లాజా, బర్సాడొల్లా, హరివాలిపత్ర, జోధ్‌పురి పకోడా వంటి వెరైటీస్‌తో పాటు సూరతి ఉందియ, జైసల్మార్ పాంచ్ కుటా, పిథోడ్ కీ సబ్జీ, జోధ్‌పురి గట్టా, సాంగ్రి కీ కోఫ్టె, రాబోది హరాప్యాజ్, తిల్వాలే వంటి సబ్జీలను ఇక్కడ వేడివేడిగా లాగించేయచ్చు. అంతేకాదు చిల్లీసేవ్ పూరీ, టోక్రీ దహీ చాట్, డబెలీ, టమాటా, అక్రూట్ హల్వా, దూద్ప్యాక్ తదితర శ్నాక్స్ కూడా ఈ రెస్టారెంట్లో అందుబాటులో ఉంటాయి. -
ర్యాంప్ పై అందాల భామలు