Pinaki Chandra Ghose
-
మీరేం డిబేట్‌కు రాలేదు.. సోమేష్ కుమార్‌పై జస్టిస్ పీపీ ఘోష్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆలస్యంగా లోపలికి రావడంతో పాటు ఆయన సమాధానాలిచ్చిన తీరుపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కాళేశ్వరం అవకతకవలకు సంబంధించిన అభియోగాలపై ప్రస్తుతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌తో పాటు సోమేష్ కుమార్‌ను, మరికొందరిని ఇవాళ విచారించారు. అయితే విచారణ నిమిత్తం పీసీ ఘోష్.. కోర్టు హాల్లోకి సోమేష్‌ను పిలిచారు.అయినా కూడా చాలాసేపు దాకా ఆయన లోపలికి వెళ్లలేదు. దీంతో.. ఆయన కోసం ఎంతసేపు ఎదురు చూడాలని పీసీ ఘోష్ ఆగ్రహం ప్రదర్శించారు. విషయం తెలిసి సోమేష్ హడావిడిగా లోపలికి వెళ్లినట్లు సమాచారం.సూటిగా సమాధానాలివ్వండికమిషన్ ముందర చాలా సమాధానాలకు ‘గుర్తు లేదు’ అనే మాజీ సీఎస్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. ‘‘మీరేం డిబేట్‌కు రాలేదు.. స్ట్రయిట్‌గా ఆనర్సివ్వండి’’ అని చెప్పారాయన. అదే సమయంలో.. విచారణకు హాజరైన మరో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సైతం ఇదే రీతిలో పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. దీంతో.. సూటిగా సమాధానాలివ్వని ఈ ఇద్దరిపైనా పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నాకేం తెలీదు.. గుర్తు లేదు: స్మితా సబర్వాల్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అందులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కమిషన్ ఇవాళ విచారణ జరిపింది.హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఈ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఓపెన్ కోర్టులో ‘‘అన్నీ నిజాలే చెప్తా..’’ అని కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ చంద్రఘోష్, స్మితా సబర్వాల్‌తో ప్రమాణం చేయించారు. ఆపై ప్రశ్నలు గుప్పించారు.కమిషన్: క్యాబినెట్ ఆమోదం లేకుండానే మూడు బ్యారేజీలకు చెందిన పరిపాలన అనుమతుల జీవోలు తెలియజేశారా?స్మితా సబర్వాల్: అది నా దృష్టిలో లేదుకమిషన్: కొన్ని ఫైల్స్ సీఎంఓ కి రాకుండానే క్యాబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలన అనుమతులు పొందాయా?స్మితా సబర్వాల్: కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు నాకు సమాధానం తెలీదు.. అవగాహన కూడా లేదుకమిషన్: క్యాబినెట్ పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభించారా? స్మితా సబర్వాల్: నాకు తెలీదుకమిషన్: దాచడానికి ఏమీ లేదు నిజాలు మాత్రమే చెప్పాలిస్మితా సబర్వాల్: సీఎంఓకి వచ్చేటువంటి ప్రతి ఫైల్ సీఎం అప్రూవల్ ఉంటుంది2014 నుంచి పదేళ్లపాటు గత ప్రభుత్వం సీఎంవోలో సెక్రటరీగా పని చేశాసీఎంవోలో ఏడు శాఖలను పర్యవేక్షించా మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కోఆర్డినేషన్ మాత్రమే కమిషన్: మూడు బ్యారేజీలకు సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి నోట్స్ సీఎంవోకి వచ్చాయా?స్మితా సబర్వాల్: నా దృష్టిలో లేదు... నాకు ప్రస్తుతం గుర్తుకు లేదుఇదిలా ఉంటే.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సైతం ఇవాళ్టి విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో.. ఉన్నత అధికారులందరినీ కమిషన్ విచారిస్తోంది. ఓపెన్ కోర్టు ద్వారా కమిషన్ ఛైర్మన్ పినాకి చంద్రఘోష్, మాజీ అధికారులపై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. నిన్న (బుధవారం) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులు ఎస్కే జోషి, రజత్ కుమార్‌ను కమిషన్ విచారించింది.ఇదీ చదవండి: కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే! -
‘మేడిగడ్డ’ ఎప్పుడు దెబ్బతింది?
సాక్షి, హైదరాబాద్: ‘వరదనీటి మళ్లింపు కోసం ని ర్మించే బరాజ్‌లను నీటినిల్వ డ్యామ్‌లుగా ఏ ప్రాతి పదికన పరిగణించారు? 2019లో బరాజ్‌లు పూర్త యితే 2021లో వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద 2023 జూలైలో కాళేశ్వరం బరాజ్‌లను డ్యామ్ లుగా గుర్తించడం వెనక అంతర్యం ఏమిటి?’ అని రాష్ట్ర డ్యామ్‌ల భద్రత సంస్థ (ఎస్డీఎస్ఓ) మాజీ ఎస్ఈ మురళీకృష్ణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది.కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం అమెరికాలో ఉన్న మురళీకృష్ణను వర్చువల్‌గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.చట్టంలో ఉన్నందునే పరిగణించాం..‘డ్యామ్‌ల రక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మీరు అఫిడవిట్లో పేర్కొన్నదంతా వాస్తవమే నా? మీ బాధ్యతలేంటి?’ అని కమిషన్ మురళీకృష్ణ ను ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ 2021 డిసెంబర్ 30న నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ను నోటిఫై చేశారని పేర్కొన్నారు. 15 మీటర్ల ఎత్తు కలిగి, నీటిని నిల్వ చేసే జలాశయాలతోపాటు 10 మీటర్లకు మించి ఎత్తున్న చెక్ డ్యామ్‌లను కూడా డ్యామ్‌లుగా పరిగణించాలని చట్టంలో ఉందని మురళీకృష్ణ తెలియజేశారు. దీనిపై కమిషన్ స్పంది స్తూ ‘నీటిని మళ్లించడానికే బరాజ్‌లు కడతారు.. మరి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను డ్యామ్‌లుగా ఎలా పరిగణించారు? అని మళ్లీ ప్రశ్నించింది. చట్ట ప్రకారం స్పెసిఫైడ్ డ్యామ్‌లుగా బరాజ్‌లను నోటి ఫై చేశారని మురళీకృష్ణ వివరించారు. డ్యామ్‌ల రక్ష ణ చట్టం అమలు కోసం క్షేత్రస్థాయిలో అధికారుల తో చర్చించామని.. ఆయా డ్యామ్‌లను సమగ్రంగా పరిశీలించి నోటిఫై చేయించామని తెలిపారు.బరా జ్లు ఎప్పుడు పూర్తయ్యాయని కమిషన్ ప్రశ్నించ గా 2023లో స్పెసిఫైడ్ డ్యామ్‌లుగా నోటిపై చేశామ న్నారు. 2021లో చట్టం వస్తే 2019లోనే బరాజ్ పూ ర్తవడం వాస్తవమా? కాదా? అని కమిషన్ అడగ్గా వాస్తవమేనని చెప్పారు. పదేపదే విజ్ఞప్తుల అనంత రం స్పెసిఫైడ్ డ్యామ్‌ల జాబితాలో బరాజ్‌లను చేర్చారని బదులిచ్చారు. 2019లో మేడిగడ్డలో వర దలు వచ్చాయని, తొలుత సుందిళ్ల, అన్నారంలో బుంగలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత మేడిగడ్డ దెబ్బ తిందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయి తే బరాజ్‌ల అధికారులు ఈ విషయాన్ని నివేదించలేదని మురళీకృష్ణ వెల్లడించారు.రెండో వారంలో మళ్లీ విచారణనాలుగో విడత క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన జస్టిస్ చంద్రఘోష్.. మంగళవారం సాయంత్రం కోల్‌కతా తిరిగి వెళ్లనున్నారు. అనంతరం రెండో వారంలో తిరిగి హైదరాబాద్ వచ్చి ఐదో దఫా విచా రణలో ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలను ప్రశ్నించ నున్నారు. ఆ తర్వాత ఐఏఎస్‌లను విచారించే అవకాశాలున్నాయి. -
సుందిళ్ల బ్యారేజీ ఇంజినీర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
సాక్షి ,హైదరాబాద్ : సుందిళ్ల బ్యారేజీల నిర్మాణల కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగం(సీడీవో) ఇంజినీర్లపై కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజీల నిర్మాణాలపై అఫిడవిట్లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా ఇంజినీర్లు సమాధానాలు చెప్పడంపై మండిపడింది. నిర్మాణాలపై తప్పుడు సమాధానాలు చెబితే క్రిమినల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజి సహా కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ క్షేత్రస్థాయి ఇంజినీర్లతో జరిపిన రెండు రోజుల పాటు జరిపిన బహిరంగ విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్ తొలిరోజైన సోమవారం మేడిగడ్డ, రెండో రోజైన మంగళవారం సుందిళ్ళ బ్యారేజి నిర్మాణాలపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగాని(సీడీవో)కి చెందిన ఏఈఈ,డీఈ,ఈఈ,డీసీఈ’ 16మంది ఇంజినీర్లను కమిషన్ సుందిళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగింది. కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలకు ఇంజినీర్లు తప్పుడు సమాధానాలు చెప్పిటన్లు తెలుస్తోంది. అఫిడవిట్లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా సమాధానాలు మార్చి చెప్పడంపై కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుందిళ్ళ బ్యారేజి బ్లాక్ 2ఏను డిజైన్ లేకుండానే నిర్మాణం చేశామని ఇంజినీర్లు కమిషన్‌కు వెల్లడించారు. దీంతో డిజైన్ లేకుండానే బ్లాక్ ఎలా నిర్మించారు? ఎలా సాధ్యమైంది? అని కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ ప్రశ్నకు.. ఒకటో బ్లాక్,మూడు బ్లాక్‌ల మధ్య 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని ఒకసారి..రెండు,మూడు బ్లాక్‌ల మధ్య నిర్మాణం చేశామని బదులిచ్చారు. మధ్యలో రెండో బ్లాక్ తర్వాతే 2ఏ బ్లాక్ కట్టామని కమిషన్‌కు ఓ ఇంజినీర్ వివరించారు. 2ఏ బ్లాక్‌కు డిజైన్ లేకపోవడంతో రెండో డిజైన్ ఆధారంగా 2ఏ బ్లాక్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. అప్పటి ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే డిజైన్ లేకపోయినా 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని కమిషన్‌కు వివరించారు.ఇలా ఇంజినీర్లు చెప్పిన తప్పుడు సమాధానాలపై అవసరమైతే క్రిమినల్ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని కమిషన్ హెచ్చరించింది. 16 మంది ఇంజినీర్ల నుండి బ్యారేజ్ పనుల రికార్డులపై సంతకాలు తీసుకుంది. ఆ రికార్డ్లను స్వాధీనం చేసుకున్న అనంతరం కమిషన్ తన విచారణను ముగించింది.తొలిరోజు మేడిగడ్డ నిర్మాణాలపై ప్రశ్నల వర్షంతొలిరోజు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో పియర్స్ కుంగుబాటుకు కారణాలతో పాటు ఇతర నిర్మాణలపై కమిషన్ ఇంజినీర్లకు పలు ప్రశ్నలు సంధించింది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ముందే సిద్ధం చేసుకుని వచ్చిన సమాధానాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణలకు సంబంధించిన ఇంజినీర్లు సమర్పించిన రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్.. వారితో సంతకాలు చేయించుకుని విచారణను నిలిపివేసిందిఇవాళ (మంగళవారం) సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపై ఇంజినీర్లను కమిషన్ బహిరంగంగా విచారించింది. విచారణలో ఇంజినీర్లు చెప్పిన సమాధానాలకు కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. -
12 నుంచి ఐఏఎస్‌ల విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునరుద్ధరించనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్‌కు రానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నిర్వహించిన రెండు విడతల క్రాస్ ఎగ్జామినేషన్‌లో నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వ ర్లు, బి.నాగేంద్రరావుతోపాటు పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నంచింది. మూడో విడతలో ప్రధానంగా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, రజత్‌కుమార్, ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన సోమేశ్‌కుమార్, వికాస్‌రాజ్, గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ తదితరులను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓసారి కమిషన్ వీరికి సమన్లు జారీ చేసి విచారించింది. అఫిడవిట్ రూపంలో సమాధానాలను తీసుకుంది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది. మొత్తానికి ఈ నెలాఖరులోగా అధికారులు, మాజీ అధికారుల విచారణను కమిషన్ ముగించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి నివేదిక! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న గత ప్రభుత్వ పెద్దలను పీసీ ఘోష్ కమిషన్ వచ్చే నెలలో విచారించే అవకాశాలు ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను విచారించవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంజనీర్లు, అధికారుల నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ లో సేకరించే అంశాల ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావులను విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే నెల లో వారికి కమిషన్ నుంచి నోటీసులు అందే అవకాశం ఉంద ని సమాచారం. మొత్తంగా కమిషన్ డిసెంబర్ నెలాఖరులో గా ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనున్నట్టు తెలిసింది. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొను గోలు ఒప్పందం, యాదాద్రి, భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ గత నెలాఖరులోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇంకా గడువు పొడిగించని సర్కారు! వాస్తవానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు గత నెలాఖరుతోనే ముగిసింది. మరో రెండు నెలలు పొడిగించాలని ప్రతిపాదిస్తూ సీఎం కార్యాలయానికి ఫైల్ వెళ్లినా.. ఇంకా నిర్ణయం వెలువడలేదు. గడువు పొడిగింపుపై ఉత్తర్వులు వస్తే ఈ నెల 11న హైదరాబాద్‌కు వస్తానని జస్టిస్ పీసీ ఘోష్ అధికారులకు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. -
‘కాఫర్ డ్యామ్’ నిర్లక్ష్యం పాక్షికంగా నిజమే!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తయ్యాక కాఫర్ డ్యామ్, షీట్‌పైల్స్‌ను పూర్తిగా తొలగించకపోవడంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి బరాజ్ దెబ్బతిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వ్యాఖ్యానించింది. ఇందుకు నీటిపారుదల శాఖ, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం కారణం కాదా? అని అధికారులను ప్రశ్నించగా ‘పాక్షికంగా నిజమే’నని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం సీఈ కె.సుధాకర్‌రెడ్డి అంగీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా శనివారం ఆయన్ను కమిషన్ సుదీర్ఘంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఒప్పందం ప్రకారం బరాజ్ కట్టాక నిర్మాణ సంస్థ కాఫర్ డ్యామ్‌ను ఎందుకు పూర్తిగా తొలగించలేదని నిలదీసింది. ఈ పనుల వ్యయాన్ని తొలి సవరణ అంచనాల్లో రూ. 61.21 కోట్లకు పెంచారని.. ఆ డబ్బును మిగుల్చుకోవాలని ఉద్దేశపూర్వకంగానే ఒప్పందాన్ని ఉల్లంఘించారని తప్పుబట్టింది. 2019లో వచ్చిన వరదలతో దెబ్బతిన్న మేడిగడ్డ బరాజ్‌ను నిర్మాణ సంస్థ నిర్వహించలేదని సుధాకర్‌రెడ్డి బదులిచ్చారు. 2020 వరదల్లో బరాజ్ దిగువన కాంక్రీట్ దిమ్మెలు కొట్టుకుపోగా పునరుద్ధరించాలని నిర్మాణ సంస్థను కోరారా? అని కమిషన్ ప్రశ్నించగా అప్పట్లో తానక్కడ లేనని బదులిచ్చారు. బరాజ్‌ల నిర్మాణం జరిగి అవి వినియోగంలోకి వచ్చినట్లు ధ్రువీకరించుకున్నాకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లపై కౌంటర్ సంతకం చేశానని సమర్థించుకున్నారు. ఈ సర్టిఫికెట్ల జారీకి విధివిధానాలేవి లేవని ఆయన తెలపగా, కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విధివిధానాలు లేకున్నా రబ్బర్ స్టాంపులాగా సర్టిఫికెట్ల జారీకి మీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందంటూ నిలదీసింది. మిమ్మల్ని మీరు ఇరకాటంలో పడేసుకుంటున్నారని మండిపడింది. సికెంట్ పైల్స్‌పైనే కమిషన్ గురి.. దేశంలో జలాశయాల నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగించరని, అలాంటిది మేడిగడ్డ బరాజ్‌కు ఎందుకు వాడారని కమిషన్ ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, వాటి డిజైన్లను సీఈ సీడీఓ ఇచ్చారని సుధాకర్‌రెడ్డి తెలియజేశారు. బరాజ్ కుంగిపోవడానికి మరో కారణంగా పునాదుల కింద సికెంట్ పైల్స్‌ను నిట్టనిలువుగా, క్రమబద్ధంగా నిర్మించలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ పేర్కొన్న విషయాన్ని కమిషన్ గుర్తుచేయగా ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన బదులిచ్చారు. సీఈ సీడీఓ డయాఫ్రమ్ వాల్ డిజైన్లు ఇచ్చినా దానికంటే తక్కువ వ్యవధి, వ్యయంతో నిర్మించవచ్చనే సికెంట్ పైల్స్‌కు మొగ్గు చూపినట్టు తెలిపారు. డీవాటరింగ్‌కు అంచనాల కంటే 49.6 శాతం అధిక చెల్లింపులను నిబంధనల ప్రకారమే చేశామని సుధాకర్ రెడ్డి తెలియజేశారు. టెండర్లు లేకుండానే డీపీఆర్ తయారీనా? టెండర్లు లేకుండానే నామినేషన్‌పై కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించినట్టు సుదాకర్‌రెడ్డి తెలిపారు. టెండర్లు పిలవొద్దని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా క్షేత్రస్థాయి పరీక్షల రికార్డులను వ్యాప్కోస్‌కు ఇవ్వాలని నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారని సుధాకర్‌రెడ్డి వివరించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు మరో ప్రశ్నకు బదులిచ్చారు. -
లోపాలు తేలినా.. నష్ట నివారణ చర్యలు తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో లోపాలపై 2021 అక్టోబర్, నవంబర్లలో తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇచ్చినా.. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేంద్రరావు ఆరోపించారు. బరాజ్‌ల ఎగువన, దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపో యాయని, దిగువన వేరింగ్ కోట్ దెబ్బతిన్నదని నివేదికలలో తెలిపామని వివరించారు. ప్రాజెక్టుల ఈఈలు, ఎస్ఈలు, సీఈలు దీనికి బాధ్యులని.. బరాజ్‌లలో లోపాలున్నట్టు ఎన్నడూ నల్లా వెంకటేశ్వర్లు తమకు నివేదిక సమర్పించలేదని పేర్కొ న్నారు.కాళేశ్వరం బరాజ్‌లపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం బి.నాగేంద్రరావును మూడున్నర గంటలకుపైగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 120కిపైగా ప్రశ్నలు వేసింది. నిర్వహణ, పర్యవేక్షణ (ఓఅండ్ఎం) విభా గానికి క్షేత్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ లేదని.. క్షేత్ర స్థాయి అధికారులకు ప్రాజెక్టుల నిర్వహణపై ఎప్ప టికప్పుడు ఆదేశాలిస్తామని ఈ సందర్భంగా కమి షన్‌కు నాగేంద్రరావు వివరించారు. తమ తనిఖీల నివేదికలను కమిషన్‌కు అందజేశారు. డిఫెక్ట్ లయ బిలిటీ పీరియడ్‌లో బరాజ్‌లకు రక్షణ చర్యలు తీసు కోవాలని.. వర్షాకాలానికి ముందు, తర్వాత, మధ్య లో పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించాలని తాము కోరినా రామగుండం ఈఎన్సీ చేయలేదని వివరించారు. ఐఎస్ కోడ్, కేంద్ర జలసంఘం మా న్యువల్స్ను కూడా పాటించలేదని ఆరోపించారు. బరాజ్‌ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసినట్టు నల్లా వెంకటేశ్వర్లు నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. గేట్ల నిర్వహణలో ఆపరేషన్ ప్రోటోకాల్ పాటించినట్టు సమాచారం లేదని.. వరద ఉధృతితో దిగువన రక్షణ పనులు దెబ్బతినడానికి అది ఒక కారణం కావొచ్చని తెలిపారు. మరమ్మతులు చేయడం కోసం బరాజ్ లలో నీటి నిల్వలను తగ్గించాలని నిర్మాణ సంస్థలు కోరినా పట్టించుకోలేదా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఈ దిశగా తమ కార్యాలయం ఆదేశాలేమీ ఇవ్వలేదని, అయితే నిల్వలను పెంచాలని నల్లా వెంకటేశ్వర్లు మౌఖిక ఆదేశాలిచ్చారని నాగేంద్రరావు వివరించారు.ఈఎన్సీ పోస్టు అలంకారానికా?‘బరాజ్‌ల వైఫల్యానికి నిర్వహణ వైఫల్యం ఓ కారణం కాదా? ఈఎన్సీ (ఓఅండ్ఎం) పోస్టు ఎందుకు ఉంది? అలంకారానికా?’ అని కమిషన్ నిలదీయగా.. నిర్వహణ బాధ్యత క్షేత్రస్థాయి సీఈలదేనని నాగేంద్రరావు బదులిచ్చారు. నిర్వహ ణ మాన్యువల్స్, సర్క్యులర్లు జారీచేసి వాటిని పాటించాలని కోరడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. నిరంతర నిల్వలతో బరాజ్‌ల ఎగువ భాగంలో మరమ్మతులు సాధ్యం కాలేదని, దిగువన అవకాశమున్నా మరమ్మతులు చేయలేదని వివరించారు. అయితే ‘నీటి నిల్వ అవసరాలకు బరాజ్‌లు పనికిరావని ఐఎస్ కోడ్‌లో ఉన్న విషయం మీకు తెలియదా? నిల్వ చేయాలని ఆదేశించినది ఎవరు? నిల్వలతోనే పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి బరాజ్‌లు దెబ్బతిన్నాయా?’ అని కమిషన్ ప్రశ్నించగా.. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే నీళ్లు నిల్వ చేశా రని నాగేంద్రరావు వివరించారు. నిల్వలతో ఇసుక కొట్టుకుపోయి దెబ్బతినే అవకాశాలుంటాయని అంగీకరించారు. మూడు బరాజ్‌ల పనులు సంపూర్ణంగా పూర్తయ్యాయా? అని కమిషన్ ప్రశ్నించగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పనులు పూర్తయ్యా యని, మేడిగడ్డ బరాజ్‌లో నిబంధనల ప్రకారం పనులు జరగలేదని నాగేంద్రరావు తెలిపారు.నాణ్యతా పరీక్షలకు మనస్సాక్షి అంగీకరించలేదా?‘వరదల అనంతరం బరాజ్‌ల పరిస్థితి ఏమిటి? ఏమైనా దెబ్బతిన్నాయా? నిర్మాణం సరిగ్గా జరిగిందా? లేదా? అని పరిశీలించాలని మీ మనస్సాక్షి అంగీకరించలేదా?’ అని క్వాలిటీ కంట్రోల్ రిటైర్డ్ సీఈ అజయ్‌కుమార్‌ను పీసీ ఘోష్ కమిషన్ నిలదీసింది. అయితే నిర్మాణ దశలో, బిల్లుల చెల్లింపుల సమయంలోనే నాణ్యతా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తామని, నిర్మాణం పూర్తయిన తర్వాత అవసరం ఉండదని అజయ్‌కుమార్ బదులిచ్చారు. ఇక అసంపూర్తి పనులను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు నోటీసులిచ్చామని కమిషన్‌కు మాజీ ఈఈ సర్దార్ వివరించారు. గురువారం కమిషన్ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుకు రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. -
బరాజ్‌లు ఎందుకు ఫెయిలయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటి? డిజైన్లకు సాంకేతిక అనుమతులిచ్చాక మళ్లీ అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను ఎందుకు మార్చారు? మారిన ప్రదేశాలకు అనుగుణంగా డిజైన్లలో మార్పులు చేశారా?’అని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లో పనిచేసిన, రిటైరైన ఇంజనీర్లను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భా గంగా కమిషన్ మంగళవారం పలువురు ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అన్నారం బరాజ్ డిజైన్లను ఎవరు సిద్ధం చేశారని మాజీ ఈఈ కె. నరేందర్‌ను ప్రశ్నించగా డిజైన్లను ఏఈఈలు తయారు చేస్తే.. వాటికి డీఈఈ, ఆపై ఈఈ అనుమతిస్తారని ఆయన తెలిపారు. భూభౌగోళిక, సైట్ సర్వే ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్లను సిద్ధం చేస్తామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కమిషన్‌కు ఎదురు ప్రశ్నలు వేయగా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజైన్లలో లోపాల్లేవు: బస్వరాజ్, ఎస్ఈ, కాళేశ్వరం మేడిగడ్డ బరాజ్ డిజైన్లలో లోపాల్లేవని.. ఐఎస్ కోడ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) నిబంధనలకు లోబడి ఎల్ అండ్ టీ ఆధునిక సాఫ్ట్వేర్ ద్వారా తయా రు చేసిందని కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ హెచ్.బస్వరాజ్ తెలిపారు. డిజైన్లు ప్రమాణాలకు లోబడి ఉన్నాయని నిర్ధారించాకే ఆమోదించామన్నారు. బరాజ్ నిర్మిత స్థలాన్ని పరిశీలించలేదని.. క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని ఓ ప్రశ్నకు బస్వరాజ్ బదులిచ్చారు. అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను మార్చినప్పటికీ ప్రతిపాదిత నిర్మాణ ప్రదేశంలోనే మేడిగడ్డను కట్టారని తెలిపారు. మేడిగడ్డ బరాజ్ పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే బరాజ్ కుంగిందని సీడీవో ఎస్ఈ ఎం. సత్యనారాయణరెడ్డి వివరించారు. బరాజ్‌లను నీటి మళ్లింపు కోసం కట్టాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా నిల్వ చేయడంతోనే విఫలమైనట్లు సీడీఓ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ దయాకర్‌రెడ్డి ఇంతకుముందు కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్‌లో కమిషన్ దీనిపై ప్రశ్నించగా ఆయన దాటవేశారు. దీంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రామగుండం ఈఎన్సీ ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు చేశామని సీడీవో మాజీ ఎస్ఈ రాజశేఖర్ అన్నారు. అన్యాయాన్ని సరిచేయడానికే రీ ఇంజనీరింగ్పీసీ ఘోష్ కమిషన్‌కు తెలిపిన వి.ప్రకాశ్సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ ను పునర్నిర్మించేందుకు.. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ను నాటి సీఎం కేసీఆర్ చేపట్టారని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్ తెలిపా రు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు మంగళవారం అఫిడవిట్ సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య పాలనలో గోదావరి పరీవాహక ప్రాంతంలో సాగునీటి సదుపాయం లేక రైతుల ఆత్మహత్యలు సహా వివిధ ఘటనల్లో 50 వేల మంది చనిపోయా రని కమిషన్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు లక్షిత ఆయకట్టు 16.40 లక్షల ఎకరాలుకాగా రీ ఇంజనీరింగ్ ద్వారా 37 లక్షల ఎకరాల ఆయకట్టు కు సాగునీరు అందించడానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత గురించి కేంద్ర జలసంఘం రాసిన లేఖల్లోని వాస్తవాలను కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, విద్యుత్‌రంగ నిపుణుడు కె.రఘు వక్రీకరించారని ఆధారాలతో సహా వివరించినట్లు ప్రకాశ్ చెప్పారు. మహారాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో తుమ్మిడిహెట్టి బరాజ్ సాధ్యం కాదన్నారు. -
‘కాళేశ్వరం’ నిర్ణయాలు ఎవరివి?
సాక్షి, హైదరాబాద్: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనే నిర్ణయం ఎవరిది? కాళేశ్వరం డీపీఆర్‌ను కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపిన తర్వాత మళ్లీ ఎందుకు మార్పులు చేశారు?’’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. నిర్ణయాలు ప్రభుత్వం స్థాయిలో జరిగాయని మురళీధర్ బదులివ్వగా.. ‘ప్రభుత్వం అంటే ఎవరు?’అని కమిషన్ తిరిగి ప్రశ్నించింది. ‘హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ (ప్రభుత్వ అధినేత)’అని మురళీధర్ బదులివ్వగా.. ప్రభుత్వఅధినేత అంటే ఎవరని కమిషన్ వివరణ కోరింది. దీంతో నీటిపారుదల శాఖ కార్యదర్శి అని మురళీధర్ బదులిచ్చినట్టు తెలిసింది. కాళేశ్వరం బరాజ్‌లపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం బీఆర్కేఆర్ భవన్‌లోని తమ కార్యాలయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించి.. తొలిరోజున రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌ను ప్రశ్నించింది. నీటి లభ్యతపై వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాణహిత ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు మురళీధర్ తెలిపారు. క్షేత్రస్థాయి ఇంజనీర్ల ప్రతిపాదనల ప్రకారమే డీపీఆర్‌లో మార్పులు చేసినట్టు వెల్లడించారు. పలు అంశాల్లో కిందిస్థాయి ఇంజనీర్లు తప్పు చేశారని పేర్కొన్న మురళీధర్.. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల పాత్రపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కమిషన్ విచారణ తీరిది.. » బరాజ్‌ల నిర్మాణం పూర్తికాక ముందే కాంట్రాక్టర్లకు సబ్ స్టాన్షియల్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిషన్ ప్రశ్నించగా.. జారీ చేసిన ఇంజనీర్లది వ్యక్తిగత స్థాయిలో తప్పేనని మురళీధర్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికెట్ జారీ చేస్తే సూపరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కూడా సంతకాలు చేశారని కమిషన్ ఎత్తిచూపగా.. వారు తప్పుచేశారని బదులిచ్చారు. » బరాజ్‌ల నిర్మాణంలో పర్యవేక్షక ఇంజనీర్లతోపాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని కమిషన్ పేర్కొంది. 2016–20 మధ్య బరాజ్‌ల నిర్మాణం జరిగితే.. వరంగల్‌లోని క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు ఒక్కసారి మాత్రమే తనిఖీ చేయడం ఏమిటని ప్రశ్నించింది. దీనితో సంబంధిత ఇంజనీర్లది తప్పేనని, పక్షం రోజులకోసారి పనుల్లో నాణ్యత పరీక్షించాల్సి ఉంటుందని మురళీధర్ బదులిచ్చారు. బరాజ్‌ల వైఫల్యానికి ఇది ప్రధాన కారణంగా పరిగణించాల్సి ఉంటుందని కమిషన్ తెలపగా.. ఒక కారణం కావచ్చని మురళీధర్ అన్నారు. » బరాజ్‌ల కాంక్రీట్ పనులకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే రూ.1,342.72 కోట్ల బిల్లులను ఏ విధంగా చెల్లించారు? బిల్లుల రికార్డుల్లో పాత తేదీలతో ఎంట్రీ ఎందుకు చేశారని కమిషన్ ప్రశ్నించగా.. సంబంధిత ఇంజనీర్లది తప్పేనని సమాధానమిచ్చారు. »డిజైన్ల ప్రకారం బరాజ్‌ల పునాదుల కింద షీట్‌పైల్స్ నిర్మించాల్సి ఉండగా.. సెకెంట్ పైల్స్‌కు ఎందుకు మారారు? నిర్మాణం ప్రారంభించాక డిజైన్లను మార్చవచ్చా? అని కమిషన్ ప్రశ్నించగా.. భూగర్భంలో ఇసుకతోపాటు భారీ రాళ్లు ఉండటంతో మార్చాల్సి వచ్చి0దని మురళీధర్ వివరించారు. నిర్మాణ దశలో డిజైన్లలో మార్పులు జరగడం సాధారణమేనని బదులిచ్చారు. » బరాజ్‌ల నిర్మాణం పూర్తయ్యాక లోపాలు బయటపడితే ఏం చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా.. సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు మురళీధర్ వివరించారు. » కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం భవి ష్యత్తులో అంచనా వ్యయం పెంచుకోవడానికి వీలు కల్పిం చే రీతిలో డిజైన్లను రూ పొందించారా? అని కమిషన్ ప్రశ్నించగా.. లేదని మురళీధర్ బదులిచ్చారు. కాళేశ్వ రం డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపకముందే పనులు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించగా.. ప్యాకేజీ–4 పనులు ప్రారంభించినట్టు మురళీధర్ అంగీకరించారు. -
‘కాళేశ్వరం’పై ఐఏఎస్‌ల విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై చేపట్టిన విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం బీఆర్కేఆర్ భవన్‌లోని తమ కార్యాలయంలో పలువురు సీనియర్ ఐఏఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌లను ప్రశ్నించనుంది. సోమవారం విచారణకు రావాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి రిటైరైన సోమేశ్‌కుమార్, ఎస్కే జోషీ, ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి, ఆ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి రజత్‌కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసిన స్మిత సబర్వాల్లకు సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు నిర్మాణ, సాంకేతిక అంశాలపై వివరాలు సేకరించిన చేసిన కమిషన్.. ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలపై దృష్టిపెట్టిందని, ఈ క్రమంలోనే అనుమతుల జారీ, అంచనా వ్యయాల పెంపు, నిధుల విడుదలలో పాత్ర ఉన్న ఐఏఎస్‌లను విచారించనుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. నిర్మాణ సమయంలో ఉన్నవారిని.. తెలంగాణ ఏర్పాటయ్యాక సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్కే జోషి పనిచేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనా నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్చార్జి బాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలోనే కాళేశ్వరంప్రాజెక్టుకు సంబంధించిన చాలా నిర్ణయాలు తీసుకున్న నేపత్యంలో.. కమిషన్ ఆయనను విచారణకు పిలిచింది. ఎస్కే జోషి రిటైరైన తర్వాత కొన్ని నెలల పాటు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్చార్జి బాధ్యతల్లో సోమేశ్‌కుమార్ వ్యవహరించడంతో ఆయనను కూడా విచారణకు రావాలని ఆదేశించింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా స్మిత సబర్వాల్ దాదాపుగా తొమ్మిదిన్నరేళ్లపాటు పనిచేశారు. సీఎం కార్యదర్శి హోదాలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించిన నేపథ్యంలో.. ఆమెను కమిషన్ విచారించనుంది. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాల సమీకరణ, బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులో పాత్ర నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ వి.నాగిరెడ్డి, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కమిషన్ విచారణకు రమ్మని కోరింది. నేడు కమిషన్‌కు కె.రఘు ప్రజెంటేషన్ ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌ల విచారణ సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. తర్వాత కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు మధ్యాహ్నం 2.30 గంటలకు కమిషన్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవకతవకతలపై సాక్ష్యాధారాలను సేకరించడానికి ఆయనను కమిషన్ విచారణకు పిలిచింది. -
వెదిరె శ్రీరామ్‌కు ‘కమిషన్’ పిలుపు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బరాజ్‌లపై విచారణలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ నుంచి సాక్ష్యాధారాలు సేకరించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. వచ్చే శుక్రవారం లేదా సోమవారం కమిషన్ కార్యాలయానికి వచ్చి తన వద్ద ఉన్న సమాచారాన్ని అందించాలని ఆయన్ను కోరింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహట్టి వద్ద బరాజ్ నిర్మించాల్సి ఉండగా, అక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) తెలపడం వల్లే బరాజ్‌ను మేడిగడ్డ వద్దకు మార్చినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంది. అయితే వెదిరె శ్రీరామ్ ఇటీవల విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ వాదనను తోసిపుచ్చారు. తమ్మడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ ప్రతిసారీ చెప్పిందని పేర్కొన్నారు.తన వాదనలను బలపర్చే కీలక పత్రాలను సైతం ఆయన ప్రజెంటేషన్‌లో పొందుపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతులు, మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి సంబంధించిన పత్రాలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని సైతం సాక్ష్యాధారాలుగా సేకరించాలని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించింది. సోమవారం కమిషన్ ముందుకు రఘు తెలంగాణ జేఏసీ చైర్మన్, విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు నుంచి సైతం సాక్షా్యధారాలను సేకరించాలని కమిషన్ నిర్ణయించింది. సోమవారం కమిషన్ ఎదుట హాజరై వివరాలను అందించాలని ఆయనకు లేఖ రాసినట్టు తెలిసింది. తమ్మడిహెæట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన గతంలో అఖిలపక్ష సమావేశాలు, సదస్సులు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారీ ఇంజనీరింగ్ తప్పిదమని, ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల పథకమని పేర్కొంటూ ఆయన ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కమిషన్ ఆయన్ను సైతం పిలిచింది. రఘు గతంలో ట్రాన్స్‌కో సివిల్ విభాగం సీఈగా వ్యవహరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విభేదించారనే కారణంతోనే రఘును రెండు హోదాలు కిందికి డిమోట్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో లోపాలను తప్పుబడుతూ తన ఉద్యోగాన్ని మానేసిన ఓ నిర్మాణ సంస్థ కీలక మాజీ ఉద్యోగి ఒకరు త్వరలో కమిషన్ ముందు హాజరై తన వద్ద ఉన్న సమాచారాన్ని సాక్ష్యాధారాలుగా సమర్పించనున్నట్టు తెలిసింది. త్వరలో సీడబ్ల్యూసీ ఇతర అధికారులకు కబురు కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించిన వ్యాప్కోస్ సంస్థ అధికారులతో పాటు హైడ్రాలజీ, ఫైనాన్షియల్ అనుమతులు జారీ చేసిన సీడబ్ల్యూసీ, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారులను సైతం విచారణకు పిలిపించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ణయించింది. ఇక మూడు బరాజ్‌ల వైఫల్యాలపై అధ్యయనాకికి ఏర్పాటైన నిపుణుల కమిటీని సైతం త్వరలో కమిషన్ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాలు తీసుకున్న సమయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య/ప్రత్యేక ప్రధా న కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్‌లు శైలేంద్ర కుమార్ జోషి, రజత్‌కుమార్‌ను త్వరలో కమిషన్ పిలిపించి విచారించనుంది.20 మంది డీఈఈల విచారణకాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లు, పంప్‌హౌస్‌ల నిర్మాణంలో పాల్గొన్న 20 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను మంగళవారం కమిషన్ విచారించింది. నిబంధనల మేరకే బరాజ్‌ల పనులు జరిగాయా? ఏమైనా పనులను విస్మరించారా? బరాజ్‌లు ఎందుకు విఫలమయ్యాయి? వాటి పునరుద్ధరణకు ఏం చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై వారిని ప్రశ్నించింది. నేడు ఏఈలు, ఏఈఈలను విచారించనుంది. -
కాళేశ్వరం లిఫ్టులపైనా విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం(అన్నారం), గోలివాడ (సుందిళ్ల) పంప్ హౌస్‌ల నిర్మాణంపై సైతం జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్‌ల నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలు, లోపాలపై విచారణ నిర్వహించే బాధ్యతలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు అప్పగించగా, విచారణలో అనుబంధ అంశాలుగా పంప్‌హౌస్‌లను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లతో పాటు పంప్ హౌస్‌లపై సైతం విచారణ జరిపించాలని పలువురు కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1 ప్యాకేజీలో భాగంగా ఈ పంప్‌హౌస్‌ల నిర్మాణం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నుంచి చీఫ్ ఇంజనీర్ (సీఈ) స్థాయి వరకు.. పంప్‌హౌస్‌ల నిర్మాణంలో భాగస్వాములైన అధికారులందరూ సోమవారం విచారణకు హాజరు కావాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తాజాగా ఆదేశించడం చర్చనీయాంశమైంది. పంప్‌హౌస్‌ల నిర్మాణానికి జారీ చేసిన పరిపాలన అనుమతులు, సాంకేతిక పరిశీలనలు, ఏ మేరకు నీటిని పంపింగ్ చేయడానికి వీటికి అనుమతినిచ్చారు? చేసిన పంపింగ్ ఎంత? వీటి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎన్నిసార్లు అంచనాలు సవరించారు? గత ఐదేళ్లుగా పంప్ హౌస్‌ల పరిస్థితి ఏంటి? అనే అంశాలపై కమిషన్ ఆరా తీయనున్నట్టు సమాచారం. మూడేళ్ల కింద గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు నీట మునగడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగా, శనివారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ తన కార్యాలయంలో కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీతో సమావేశమై చర్చలు జరిపారు. సత్వరంగా నివేదిక సమర్పించాలని వారిని కోరారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక సమర్పించాలిమేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ తుది నివేదికను సత్వరం సమర్పించేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ చంద్రఘోష్ ఆదేశించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్‌తో ఆయన శనివారం ఫోన్లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై విచారణ ప్రక్రియలో ఈ నివేదిక కీలకమని స్పష్టం చేశారు. తుది నివేదిక కోసం కమిషన్ తరఫున ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలని నీటిపారుదల శాఖ అధికారులను సైతంఆయన ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నిర్వహిస్తున్న విచారణకు సంబంధించిన తుది నివేదికను కూడా సత్వరం తెప్పించుకోవాలని ఆయన సూచించారు. త్వరలో క్రాస్ ఎగ్జామినేషన్జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ త్వరలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇప్పటికే విచారణకు హాజరైన అధికారులందరినీ అఫిడవిట్ రూపంలో తమ వద్ద ఉన్న సమాచారాన్ని, వాదనలను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన అనంతరం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులకు సైతం నోటీసులు జారీ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు హాజరు కావాలని ఆదేశించే అవకాశముంది.ఇదిలా ఉండగా కమిషన్‌ను తప్పుదోవపట్టించే క్రమంలో కొందరు అధికారులు పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో సమర్పించినట్టు తెలిసింది. దీంతో వీరిని సైతం మళ్లీ క్రాస్‌ఎగ్జామినేషన్‌కు కమిషన్ పిలవనుంది. ఇక బరాజ్‌లు దెబ్బతినడానికి కారణాలేంటో తెలుసుకోవాలని కమిషన్ ఓ అధికారిని పుణెలోని సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు పంపించింది. విచారణ ముగింపులో బహిరంగ విచారణను సైతం కమిషన్ నిర్వహించనుందని సమాచారం. తొలుత అఫిడవిట్ల పరిశీలన, ఆ తర్వాత నోటీసుల జారీ, క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం బహిరంగ విచారణ ఉంటుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. -
బరాజ్‌లు కట్టిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను కాంట్రాక్టులు దక్కించుకున్న నిర్మాణ సంస్థలే నిర్మించాయా? లేక కాంట్రాక్టు నిబంధనలను విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాయా? అనే అంశంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆరా తీస్తోంది. మూడు బరాజ్‌ల నిర్మాణ పనుల్లో కనీసం 15 మంది సబ్ కాంట్రాక్టర్లు పాల్గొన్నట్టు కమిషన్‌కు కొందరు ఆధారాలు సమర్పించినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న ఓ నేత దగ్గరి బంధువుకి సంబంధించిన ఓ కంపెనీ సైతం బరాజ్‌ల పనులను సబ్ కాంట్రాక్టుగా తీసుకుని నిర్వహించినట్టు తెలిసింది. దీంతో సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సమర్పించాలని బ్యారేజీల నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశించింది. సబ్ కాంట్రాక్టర్ల వివరాలను నిర్మాణ సంస్థలు సమర్పించకుంటే.. గత పదేళ్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సమర్పించాలని నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశించనుంది. నిర్మాణ సంస్థలు అనుమానిత సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులను చెల్లించినట్టు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో ఉండే అవకాశముంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సైతం నిర్మాణ సంస్థలు సమర్పించని పక్షంలో కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి ఆ వివరాలను తెప్పించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్‌దే..తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాలనే నిర్ణయం నాటి సీఎం కేసీఆర్‌దేనని జస్టిస్ చంద్రఘో‹Ùకి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ తెలిపింది. గోదావరిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపై అధ్యయనం కోసం రిటైర్డ్ సీఈలు బి.అనంతరాములు, వెంకటరామారావు, ఎస్.చంద్రమౌళి, రిటైర్డ్ ఎస్ఈలు జి.దామోదర్ రెడ్డి, ఎం.శ్యామ్‌ప్రసాద్ రెడ్డితో 2015లో నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీని శనివారం జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో విచారించింది. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మినహా మిగిలిన ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తాము నివేదిక సమర్పించగా.. దానిని నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తిరస్కరించారని, వాటిపై సంతకాలు సైతం చేయలేదని వివరించారు. కేసీఆర్ సూచనల మేరకే మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించినట్టు తెలిపారు. మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి వద్ద 150–151 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించాలని సిఫారసు చేస్తూ అప్పట్లో సమర్పించిన ఈ నివేదిక ప్రతిని కమిషన్‌కు అందజేశారు. 27 తర్వాత కేసీఆర్, హరీశ్‌ను పిలిచే అవకాశం బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణ తుది అంకానికి చేరింది. బరాజ్‌ల నిర్మాణంతో సంబంధం ఉన్న ఈఎన్సీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులందరినీ ఆయన పిలిపించి ప్రశ్నించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర రిటైర్డ్ ఇంజనీర్లను సైతం ప్రశ్నించారు. విచారణలో పేర్కొన్న అంశాలను ఈ నెల 27లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని వారందరినీ ఆదేశించారు. అఫిడవిట్ల పరిశీలన పూర్తైన తర్వాత తదుపరిగా ఎవరెవరెని విచారించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావుతో పాటు బ్యారేజీల డీపీఆర్‌లను ఆమోదించిన కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఇంజనీర్లు, ఇతర అధికారులను సైతం పిలిపించి విచారించే అవకాశముంది. తదుపరి దశలో బహిరంగ విచారణ నిర్వహించి.. అఫిడవిట్లలో వివిధ వ్యక్తులు సమర్పించిన సమాచారం ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. -
‘టైమ్‌బౌండ్’ ఒత్తిడే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ ల నిర్మాణ పనులను నిర్ణీత గడువు (టైమ్ బౌండ్)లోగా పూర్తి చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్‌కు బరాజ్‌ల నిర్మాణ సంస్థలు తెలిపాయి. పనులు సత్వరంగా పూర్తి చేయాలంటూ పరుగులు పెట్టించిందని పేర్కొన్నా యి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి బరాజ్‌లను అప్పగించామని వివరించాయి. ఈ అంశాలను నెలాఖరు లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని నిర్మాణ సంస్థలను జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై న్యాయవిచారణలో భాగంగా బుధవారం బీఆర్కేఆర్ భవన్‌లోని కార్యాలయంలో నిర్మాణ సంస్థల ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’ తరఫున ఉపాధ్యక్షులు ఎంవీ కృష్ణరాజు, సురేశ్‌కుమార్, సీనియర్ డీజీఎం రంజీష్ చౌహాన్, అన్నారం బరాజ్ నిర్మాణ సంస్థ ‘అఫ్కాన్స్–విజేత జేవీ’ తరఫున హైడ్రో ప్రాజెక్టుల విభాగాధిపతి కె.మల్లికార్జునరావు, జీఎం శేఖర్‌దాస్, సుందిళ్ల బరాజ్ నిర్మాణ సంస్థ ‘నవయుగ’ తరఫున డైరెక్టర్ రామేశ్ యెద్దూరి, ప్రాజెక్టు మేనేజర్ కె.ఈశ్వర్రావు, జీఎం సి.మాధవ్ తదితరులు కమిషన్ ఎదుట హాజరై సమాధానాలు ఇచ్చారు. డిజైన్లు, హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లు కూడా.. బరాజ్‌ల డిజైన్లను రూపొందించిన నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)లో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్లు టి.శ్రీనివాస్, వి.మోహన్‌కుమార్ సహా మొత్తం 13 మంది ఇంజనీర్లను కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్ బుధవారం తన కార్యాలయం విచారించారు. డిజైన్ల తయారీలో ఒక్కొక్కరి పాత్రను అడిగి తెలుసుకున్నారు. డిజైన్ల ప్రకారమే పనులు జరిగాయా? తర్వాత డిజైన్లను ఏమైనా మార్చారా? ఎవరి ఆదేశాలతో మార్పులు చేశారు? షీట్‌పైల్స్‌కు బదులు సెకెంట్ పైల్స్‌ను ఎందుకు డిజైన్లలో సిఫారసు చేశారు? వంటి అంశాలపై ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం. ఇక బరాజ్‌ల వద్ద నీటి లభ్యతను నిర్ధారించిన హైడ్రాలజీ విభాగంలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్, మరో ఐదుగురు ఇంజనీర్లను సైతం జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నించారు.ఆదేశించిన వారినీ పిలిచి విచారిస్తాం: జస్టిస్ చంద్రఘోష్ బ్యారేజీల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపం ఎక్కడ జరిగింది? ఎవరు చేశారో తేలుస్తామని జస్టిస్ చంద్రఘోష్ వెల్లడించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరి ఆదేశాలతో బరాజ్‌ల నిర్మాణ పనులు జరిగాయో రికార్డు రూపంలో సమాచారం అందిన తర్వాత వారిని సైతం విచారణకు పిలుస్తామన్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించాక అవసరమైన వారిని మళ్లీ పిలిపించి విచారిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలుసుకోవడానికే అఫిడవిట్లను దాఖలు చేయాలని కోరినట్టు చెప్పారు. బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణపై సమగ్ర వివరాలు అఫిడవిట్లలో ఉండాలని నిర్మాణ సంస్థలను కోరినట్టు తెలిపారు. ఎలాంటి సమాచారమైనా అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తేనే కమిషన్ స్వీకరిస్తుందన్నారు. తప్పుడు సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, కాగ్ నివేదికలు అందాయని.. వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. న్యాయ విచారణలో భాగంగా విజిలెన్స్, కాగ్ అధికారులను సైతం ప్రశ్నిస్తామన్నారు. నేడు నిపుణుల కమిటీ సభ్యుల విచారణజస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం నీటిపారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లతోపాటు కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను విచారించనుంది. నిపుణుల కమిటీలో ఎన్ఐటీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్రావు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఎన్.రమణమూర్తి, ఉస్మానియా వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం హెచ్ఓడీ పి.రాజశేఖర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ ఉన్నారు. నిపుణుల కమిటీ ఇప్పటికే బరాజ్‌లకు చేసిన తనిఖీ నివేదికను కమిషన్‌కు సమర్పించింది. -
‘లోక్‌పాల్’ పదవికి జస్టిస్ దిలీప్ రాజీనామా
న్యూఢిల్లీ: లోక్‌పాల్ సభ్యత్వ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్ దిలీప్ బి.బొసాలే వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ నెల 12 నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దిలీప్ 2019 మార్చి 27న లోక్‌పాల్ జ్యుడీషియల్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌పాల్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆయనతో ప్రమాణం చేయించారు. లోక్‌పాల్ సభ్యులుగా ఎంపికైన వారి పదవీకాలం ఐదేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయసు వరకు కొనసాగనుంది. ప్రజా సేవకుల అవినీతి కేసులను విచారించేందుకు లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2019, మార్చిలో లోక్‌పాల్ మొదటి చైర్మన్‌గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రమాణం చేశారు. జస్టిస్ దిలీప్ బి.బొసాలేతో పాటు జస్టిస్ పీకే మహంతి, జస్టిస్ అభిలాష్ కుమారి, జస్టిస్ ఏకే త్రిపాఠి సభ్యులుగా నియమితులయ్యారు. తాజాగా జస్టిస్ దిలీప్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
లోక్‌పాల్‌గా జస్టిస్ ఘోష్ ప్రమాణం
న్యూఢిల్లీ: దేశంలో తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ శనివారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రజాప్రతినిధుల అవినీతికి సంబంధించిన కేసులను విచారించే లోక్‌పాల్, లోకాయుక్తా చట్ట్టం 2013లో ఆమోదం పొందింది. లోక్‌పాల్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్‌కుమార్ త్రిపాఠిలు నియమితులయ్యారు. నాన్–జ్యుడీషియల్ సభ్యులుగా పారా మిలటరీ దళమైన సశస్త్ర సీమాబల్ (ఎస్సీబీ) మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ జైన్, మాజీ ఐఆర్ఎస్ అధికారి మహేంద్ర సింగ్, గుజరాత్ కేడర్ మాజీ ఐఏఎస్ ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు వ్యవహరించనున్నారు. నిబంధనల ప్రకారం లోక్‌పాల్ కమిటీలో చైర్పర్సన్, గరిష్టంగా ఎనిమిది మంది సభ్యులు ఉండాలి. అందులో నలుగురు జ్యుడీషియల్ సభ్యులతోపాటు 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, మహిళలు ఉండాలని నిబంధనల్లో ఉంది. కమిటీలోని చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఉండే జీతాభత్యాలే చైర్‌పర్సన్‌కు, సుప్రీంకోర్టు జడ్జీలకు ఉండే జీతాభత్యాలే సభ్యులకు ఉంటాయి. -
చరిత్రాత్మక ఘట్టం.. ఎవరీ పీసీ ఘోష్..?
న్యూఢిల్లీ : భారతదేశ లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా భారత సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(66) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తదితరులు హాజరయ్యారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని లోక్‌పాల్ అంబుడ్స్‌మెన్ వ్యవస్థలో వివిధ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బి భోస్లే, ప్రదీప్ కుమార్ మహంతి, అభిలాష కుమారిలతో పాటుగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ కుమార త్రిపాఠి లోక్‌పాల్ సభ్యులుగా ఉంటారు. వీరందరూ 70 ఏళ్ల వయస్సు వచ్చే నాటికి రిటైర్ అవుతారు.(ఎట్టకేలకు లోక్‌పాల్) ఎవరీ పీసీ ఘోష్...? చరిత్రాత్మక లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా నియిమితులైన పీసీ ఘోష్ 1952 మే 28న కోల్‌కతాలో జన్మించారు. ఆయన తండ్రి దివంగత జస్టిస్ శంభూ చంద్ర ఘోష్ కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియెర్ కాలేజీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పీసీ ఘోష్.. కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1976లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. ఆ పిమ్మట 1997లో కలకత్తా హైకోర్టులో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. తరువాత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2013లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను హైకోర్టు నిర్దోషిగా తేల్చగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై ఆమెకు జస్టిస్ ఘోష్ ధర్మాసనమే 2015 జూలైలో నోటీసులు జారీచేసింది. ఇక 2017 మే 27న జస్టిస్ ఘోష్ సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది జూన్ 29 నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. లోక్‌పాల్ విధి- విధానాలు... ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి. సాయుధ బలగాలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. విచారణ కొనసాగుతుండగానే అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ జప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు దాఖలుపరిచారు. అంబుడ్స్‌మన్ అప్పగించిన కేసులను విచారిస్తున్న సమయంలో సీబీఐ సహా ఇతర దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణాధికారం లోక్‌పాల్‌కు కల్పించారు. లోక్‌పాల్ అప్పగించిన కేసును దర్యాప్తు చేసిన అధికారిని దాని అనుమతి లేకుండా బదిలీ చేయరాదు. కేంద్రంలో లోక్‌పాల్‌గా, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తగా వ్యవహరిస్తున్న ఈ అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్ ఏర్పాటు నిమిత్తం 2013లోనే చట్టం తెచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి లోక్‌పాల్ చైర్మన్ పదవికి అర్హులు. లోక్‌పాల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యుల్ని నియమించొచ్చని సంబంధిత చట్టంలో నిర్దేశించారు. సభ్యుల్లో నలుగురికి న్యాయరంగ నేపథ్యముండాలి. కనీసం 50 శాతం మంది సభ్యులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాల నుంచి ఉండాలి. చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 70 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది వర్తిస్తుంది). చైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీం జడ్జీలతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఒకసారి లోకాయుక్తగా నియమితులైన తరువాత ఆయన్ని తొలగించలేరు. బదిలీ చేయలేరు. సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా లోకాయుక్తను పదవీచ్యుతుడిని చేయొచ్చు. ఇక ఫిబ్రవరి చివరి నాటికి లోక్‌పాల్ నియామకం జరపాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్యానెల్ కమిటీ.. పీసీ ఘోష్‌ను లోక్‌పాల్‌గా ఎంపిక చేశారు. ఇక లోక్‌పాల్ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన.. ఐదేళ్ల తర్వాత, ఎన్నికల ముందు లోక్‌పాల్ నియామకం జరగడం గమనార్హం. President Kovind administered the Oath of Office to Justice Pinaki Chandra Ghose as Chairperson, Lokpal, at a ceremony held at Rashtrapati Bhavan pic.twitter.com/flXLRbjWjg — President of India (@rashtrapatibhvn) March 23, 2019 -
ఎట్టకేలకు లోక్‌పాల్
ఉన్నత స్థాయి అధికార వ్యవస్థల్లో అవినీతిని అంతమొందించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ సుదీర్ఘ కాలం తర్వాత సాకారమైంది. తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు వెలువరించారు. ఆయ నతోపాటు 8మంది సభ్యుల్ని కూడా నియమించారు. ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీలతో కూడిన ఎంపిక కమిటీ శుక్రవారం సమావేశమై వీరి పేర్లను ఖరారు చేసింది. అయితే ఎంపిక కమిటీ తొలి సమావేశం వివాదం లేకుండా ముగియలేదు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే తనను కమిటీ సభ్యుడిగా కాక ‘ప్రత్యేక ఆహ్వానితుడి’గా పిల వడంపై అభ్యంతర వ్యక్తం చేసి సమావేశాన్ని బహిష్కరించారు. ఆహ్వానితుడిగా హాజరైతే ఆయ నకు ఓటింగ్ హక్కు ఉండదు. ఆయన అభ్యంతరాలేవీ మినిట్స్‌లో నమోదు కావు. లోక్‌పాల్ ఎంపి కలో ఎలాంటి పాత్ర లేనప్పుడు తాను హాజరుకావడంలో అర్ధమేముందన్నది ఖర్గే ప్రశ్న. ఇది సహే తుకమైనదే. ఈ దేశంలో లోక్‌పాల్ అవసరాన్ని గుర్తించి, దానికోసం ఉద్యమం ప్రారంభించి యాభైయ్యేళ్లు కావస్తోంది. ఆ తర్వాత అది క్రమేపీ నీరసించింది. దానికోసం ఎవరెన్నిసార్లు డిమాండ్ చేసినా ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న దాఖలా లేదు. కానీ యూపీఏ ఏలుబడిలో వరసబెట్టి జరిగిన కుంభ కోణాల తర్వాత 2010లో అన్నా హజారే నాయకత్వంలో మొదలుపెట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం లోక్‌పాల్ కోసం గట్టిగా పట్టుబట్టింది. అది కూడా త్వరలోనే చల్లబడుతుందని వేసిన అంచనాలన్నీ తలకిందులై దేశవ్యాప్తంగా దాని ప్రభావం పెరుగుతుండటాన్ని గమనించాక యూపీఏ సర్కారు 2013 డిసెంబర్లో ఎట్టకేలకు లోక్‌పాల్ బిల్లు తీసుకొచ్చింది. ఉభయసభల్లోనూ అది ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత 2014 జనవరి 1న చట్టంగా కూడా మారింది. అయితే ఆనాటి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న బీజేపీ కేంద్రంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వంవహించినా గత అయిదేళ్లుగా అనేక కారణాల వల్ల లోక్‌పాల్ వ్యవస్థ అమల్లోకి రాలేదు. ముఖ్యంగా చట్టంలో పేర్కొన్నవిధంగా ప్రతిపక్ష నాయ కుడి హోదాలో ఎవరూ లేకపోవడం సాంకేతిక అవరోధంగా మారిందని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లక్రితం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీన్ని అధిగమించడానికి చట్టాన్ని సవరిస్తామని, ఆ తర్వాత లోక్‌పాల్ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించింది. అయితే ఈ వాదనను సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. లోక్‌పాల్ ఏర్పాటుకు అది తుది గడువు విధించడంతో కేంద్రానికి ఇక తప్ప నిసరైంది. కనుకనే ఇన్నాళ్లకైనా లోక్‌పాల్ ఏర్పడింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అవినీతి తారస్థాయిలో పెరిగిపోయిన వర్తమాన తరుణంలో లోక్‌పాల్ ఏర్పాటు ఒక పెద్ద ముందడుగనే చెప్పాలి. రాష్ట్రాల్లో ఇప్పటికే లోకాయుక్తలు ఏర్పాటైతే సరేసరి. లేనట్టయితే ఈ చట్టంకింద వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దేశంలో తెలంగాణతో సహా డజను రాష్ట్రాలు ఇంకా లోకాయుక్తలు, ఉపలోకాయుక్తల నియామకాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రధాని పదవిలో ఉన్నవారి నుంచి మొదలుకొని కేంద్రమంత్రులు, ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వగైరాలపై వచ్చే అవినీతి ఆరోపణలను లోక్‌పాల్ పరిశీలించి అవసరమైతే సీబీఐతోసహా వివిధ సంస్థలతో దర్యాప్తునకు ఆదేశించవచ్చు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై ప్రాసిక్యూషన్ చర్యకు అనుమతించవచ్చు. పదవిలో కొనసాగుతున్నవారు మాత్రమే కాదు... మాజీ ప్రధానులు, మాజీ కేంద్రమంత్రులు, మాజీ ఎంపీలు, రిటైరైన కేంద్ర ప్రభుత్వ అధికారులపై సైతం వచ్చే ఆరోపణలను ఇది విచారిస్తుంది. అయితే అంతర్జాతీయ సంబంధాలతో ముడిపడి ఉండే అంశాల్లోనూ, విదేశాంగ, ఆంతరంగిక భద్రత, అణు శక్తి, అంతరిక్షం వగైరా రంగాలకు సంబం ధించిన అంశాల జోలికి ఇది పోదు. అలాగే పార్లమెంటులో లేదా సభా సంఘాల్లో ప్రస్తావనకొచ్చే అంశాల ఆధారంగా చేసే ఆరోపణల్లో ఇది జోక్యం చేసుకోదు. లోక్‌పాల్ ఏర్పాటుతో అవినీతి పూర్తిగా అంతమవుతుందనిగానీ, ప్రజాజీవన రంగం ప్రక్షాళన అవుతుందనిగానీ చెప్పడం కష్టం. అయితే అధికారంలో ఉన్నవారు ఒకటి రెండుసార్లు ఆలోచించి దేనిపైన అయినా నిర్ణయం తీసు కోవడానికి ఈ లోక్‌పాల్ దోహదపడుతుంది. ఒకసారంటూ అధికారం వచ్చాక అయిదేళ్ల వరకూ తాము ఏం చేసినా చెల్లుతుందని, తమను అడిగేవారెవరూ లేరని ఈమధ్యకాలంలో రాజకీయ నాయకులు భావిస్తున్నారు. వేలకోట్లు రూపాయలు పోగేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల్లోని ఎమ్మె ల్యేలను, ఎంపీలను కొనుగోలు చేయడం, ఎన్నికలొచ్చినప్పుడు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి విజయం సాధించడానికి ప్రయత్నించడం ఎక్కువైంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు చట్టం నిర్దేశిం చిన పరిమితులకు మించి అనేక వందల రెట్లు అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల వ్యవస్థ పైనే ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. లోక్‌పాల్ దీన్ని ఏమేరకు నియంత్రించగలదో చూడాలి. అయితే లోక్‌పాల్, ఇతర సభ్యుల నియామకంతో అంతా ముగియలేదు. తనకొచ్చే ఆరోపణ లపై లోక్‌పాల్ ప్రాథమిక విచారణ జరపడానికి డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ విభాగం కావాలి. అలాగే ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవడానికి ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఉండాలి. ఈ రెండు విభా గాలూ పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకం జరగాలి. వీటికి మరికొంత సమయం పడుతుంది. ఫిర్యాదు స్వీకరించిన 90 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తికావాలి. ఆ నివేదిక వచ్చిన తర్వాత తగిన సంస్థతో దర్యాప్తునకు ఆదేశించవచ్చు. లేదా ఆరోపణలకు ఆధారాలు లేవనుకుంటే కేసును ముగించవచ్చు. దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న లోక్‌పాల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని, అవినీతిని ఏదోమేరకు అరికడుతుందని ఆశించాలి. -
ఇంతకు ‘లోక్‌పాల్’ వస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును భారత పార్లమెంట్ ఆమోదించి ఐదేళ్ల అనంతరం నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్‌ను ఆదివారం నియమిస్తూ రాష్ట్రపతికి సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఇంకా ఈ లోక్‌పాల్ కమిటీలోకి ఎనిమిది మంది సభ్యులను తీసుకోవాల్సి ఉంది. కమిటీలో షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, బీసీలు, మైనారిటీలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన నేపథ్యంలోనే దేశంలో నల్ల డబ్బును నిర్మూలిస్తానని, అవినీతిని అంతం చేస్తానని తెగ ప్రచారం చేయడం ద్వారా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. కేంద్ర స్థాయిలో వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తారని సామాజిక కార్యకర్తలు ఆశించారు. తొలి లోక్‌పాల్‌ను నియమించడానికి నరేంద్ర మోదీకి ఐదేళ్లు పట్టింది. అదీ నాడు లోక్‌పాల్ కోసం ఉద్యమించిన అన్నా హజారే, లోక్‌పాల్‌ను నియమించాలంటూ మళ్లీ నిరశనకు దిగడం, మరోపక్క ఫిబ్రవరి నెలలోగా లోక్‌పాల్‌ను నియమించాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం పరిణామాల మధ్య మోదీ నాయకత్వంలోని ఎంపిక కమిటీ ఎట్టకేలకు తొలి లోక్‌పాల్‌ను సిఫార్సు చేసింది. అదీ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక. మిగతా ఎనిమిది మంది సభ్యుల నియామకం ఎన్నికల్లోగా జరుగుతుందన్న నమ్మకం లేదు. సుప్రీం కోర్టు విధించిన గడువుకాలం ముగిసిన తర్వాత లోక్‌పాల్‌ను ఖరారు చేసినందున ఆయన నియామకం చెల్లుతుందన్న గ్యారంటీ లేదు. అవినీతి జరగకుండా చూసేందుకు ‘నేను కాపలాదారుడిని’ అని ప్రచారం చేసుకుంటున్న మోదీకి, మరింత ఎన్నికల ప్రచారం కోసం లోక్‌పాల్ నియామకం పనికి వస్తుందేమో! ఎంపిక కమిటీలో ప్రతిపక్షం మాటకు ఏం మాత్రం విలువ లేనప్పుడు లోక్‌పాల్ కమిటీ వల్ల ప్రభుత్వంలో అవినీతిని అరికట్టవచ్చని భావించడం అత్యాశే కావచ్చు! గుజరాత్ ముఖ్యమంత్రిగా లోక్‌పాల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన నరేంద్ర మోదీ ‘లోక్‌పాల్ వ్యవస్థను తీసుకొస్తారనుకోవడం పొరపాటే కావచ్చు! 1968లోనే లోక్‌పాల్ గురించి చర్చ ప్రభుత్వ స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు ఓ వ్యవస్థ కావాలంటూ 1968లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేయడంతో నాలుగవ లోక్‌సభలో లోక్‌పాల్ వ్యవస్థ గురించి మొదటిసారి చర్చకు వచ్చింది. లోక్‌పాల్ వ్యవస్థకు భయపడడం వల్ల ప్రధాని సహా కేబినెట్ మంత్రులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేరన్న వాదనతో దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత అనేక సార్లు ఈ ప్రతిపాదన వచ్చినా అదే వాదనతో దాన్ని పక్కన పెడుతూ వచ్చారు. దేశంలో అవినీతి అరికట్టేందుకు లోక్‌పాల్ వ్యవస్థ కావాలంటూ 2011లో అన్నా హజారే, నేటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఇతర సామాజిక కార్యకర్తలు ఉద్యమించడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో లోక్‌పాల్ బిల్లుకు అంగీకరించింది. బిల్లును తీసుకరావడానకి రెండేళ్లు పట్టింది. 2013లో తీసుకొచ్చినప్పటికీ బిల్లులో మార్పులు, చేర్పుల కోసం పార్లమెంట్ సెలెక్ట్ కమిటీలు, స్థాయి సంఘాల చుట్టూ తిప్పడంతో 2014, జనవరి 1వ తేదీన చట్టరూపం దాల్చింది. లోక్‌పాల్ నియామకంపై జరుగుతున్న జాప్యానికి మూడున్నర ఏళ్లపాటు మౌనం వహించిన రాహుల్ గాంధీ 2018, జనవరి నెల నుంచి నరేంద్ర మోదీపై దాడి చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయమై నిలదీస్తూ వచ్చారు. -
తొలి లోక్‌పాల్ పీసీ ఘోష్!
న్యూఢిల్లీ: ఎట్టకేలకు లోక్‌పాల్ నియామకం కొలిక్కి వచ్చింది. అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్ వ్యవస్థగా పిలుస్తున్న లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(66) పేరును కేంద్రం ఖరారుచేసినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఆదివారం ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే, న్యాయ కోవిదుడు ముకుల్ రోహత్గీ సభ్యులుగా ఉన్నారు. అయితే కమిటీ జస్టిస్ ఘోష్ పేరును ఖరారుచేసిన శుక్రవారం నాటి సమావేశానికి మల్లికార్జున ఖర్గే గైర్హాజరయ్యారు. లోక్‌పాల్ తొలి చైర్మన్ పదవికి సెర్చ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిన తుది 10 మందిలో జస్టిస్ ఘోష్ కూడా ఒకరు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ అర్హుల జాబితాను కేంద్రానికి పంపింది. అందులో నుంచి జస్టిస్ ఘోష్ పేరును ప్రభుత్వం పరిశీలించినట్లు తెలుస్తోంది. తొలి లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల నియామకంపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌పాల్ నియామకంపై పడిన ముందడుగును ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే స్వాగతించారు. 48 ఏళ్లుగా ప్రజలు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. జనలోక్‌పాల్ కోసం అన్నా హజారే సుదీర్ఘ ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఘోష్ 2017 మే 27న సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది జూన్ 29 నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. పరిధిలోకి ప్రధాని కూడా.. ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి. సాయుధ బలగాలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. విచారణ కొనసాగుతుండగానే అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ జప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు దఖలుపరిచారు. అంబుడ్స్‌మన్ అప్పగించిన కేసులను విచారిస్తున్న సమయంలో సీబీఐ సహా ఇతర దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణాధికారం లోక్‌పాల్‌కు కల్పించారు. లోక్‌పాల్ అప్పగించిన కేసును దర్యాప్తు చేసిన అధికారిని దాని అనుమతి లేకుండా బదిలీ చేయరాదు. కేంద్రంలో లోక్‌పాల్‌గా, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తగా వ్యవహరిస్తున్న ఈ అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్ ఏర్పాటు నిమిత్తం 2013లోనే చట్టం తెచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి లోక్‌పాల్ చైర్మన్ పదవికి అర్హులు. లోక్‌పాల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యుల్ని నియమించొచ్చని సంబంధిత చట్టంలో నిర్దేశించారు. సభ్యుల్లో నలుగురికి న్యాయరంగ నేపథ్యముండాలి. కనీసం 50 శాతం మంది సభ్యులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాల నుంచి ఉండాలి. చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 70 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది వర్తిస్తుంది). చైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీం జడ్జీలతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఒకసారి లోకాయుక్తగా నియమితులైన తరువాత ఆయన్ని తొలగించలేరు. బదిలీ చేయలేరు. సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా లోకాయుక్తను పదవీచ్యుతుడిని చేయొచ్చు. తండ్రీ జస్టిసే.. 1952 మే 28న కోల్‌కతాలో పీసీ ఘోష్ జన్మించారు. ఆయన తండ్రి దివంగత జస్టిస్ శంభూ చంద్ర ఘోష్ కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియెర్ కాలేజీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పీసీ ఘోష్.. కలకత్తా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1976లో బార్ కౌన్సిల్లో పేరు నమోదుచేసుకున్నారు. 1997లో కలకత్తా హైకోర్టులో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. తరువాత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2013లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను హైకోర్టు నిర్దోషిగా తేల్చగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై ఆమెకు జస్టిస్ ఘోష్ బెంచే 2015 జూలైలో నోటీసులు జారీచేసింది. -
తొలి లోక్‌పాల్‌గా పీసీ ఘోష్!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్(పీసీ ఘోష్) తొలి లోక్‌పాల్‌గా నియమితులు కానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిలతో కూడిన సెలక్షన్ కమిటీ జస్టిస్ ఘోష్‌ను ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే రేపు(సోమవారం) వెలువడే అవకాశముంది. జస్టిస్ పీసీ ఘోష్ నాలుగేళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2017లో ఆయన పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. లోక్‌పాల్ ఎంపిక సమావేశానికి లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్‌ఖర్గే హాజరుకాలేదు. లోక్‌పాల్‌లోని 8 మంది సభ్యులు, ఇతర అంశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చేవారం విడుదల కానుంది. లోక్‌పాల్‌ను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు గడువు విధించడంతో కేంద్ర ప్రభుత్వం ఈమేరకు స్పందించింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తానని గత ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ హామీయిచ్చారు. ఐదేళ్లు పూర్తవుతున్నా హామీని నిలుపుకోకపోవడంతో.. లోక్‌పాల్ బిల్లు, లోకాయుక్త చట్టం నియామకాల్లో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ జనవరిలో సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.